Breaking News

స్టూడెంట్‌ సాహసం..!జస్ట్‌ రూ. 16 వేలతో..

Published on Thu, 05/14/2026 - 16:24

ఓ వ్యక్తి తలచుకుంటే అనితర సాధ్యమైనదంటూ ఉండదు అని నిరూపించాడు ఈ విద్యార్థి. విలాసవంతమైన స్పాన్సర్‌లు, ఎలాంటి సాహసయాత్ర చేసిన నేపథ్యం లేకుండా ఎవరెస్టుని చుట్టేయలని ఉత్సాహం మాత్రం ఆకాశమంత. ఏదైతేనేం తన దగ్గర ఉన్న తక్కువ డబ్బుతోనే ఎవరెస్టు బేస్‌ క్యాప్‌కు చేరుకుని ఓ చిన్నపాటి విజయం సాధించాడు  పైగా తన వయసు యువకులకు జస్ట్‌ ఊహాలాంటి డ్రీమ్‌ని సాధ్యం చేసి..పరిమిత వనరులు, ఆర్థిక పరిస్థితి, మార్గదర్శక లేమి వంటివి ఏమీ పెద్ద అడ్డంకులు కావని ప్రూవ్‌ చేశాడు. 

కేరళలోని అలప్పుజ జిల్లాకు చెందిన 21 ఏళ్ల కేశవ్ సునీష్ బీకామ్‌ విద్యార్ధికి ఎవరెస్టుని అధిరోహించడం అతని డ్రీమ్‌. అలా అని బాగా ధనవంతుల కుటుంబ నేపథ్యమా? అంటే అదీ కాదు. పోనీ సాహసయాత్రలు చేసిన చరిత్ర ఉందా ?అంటే అదీ లేదు. కానీ ఎలాగైనా ఆకోరిక నేరవేర్చుకోవాలన్న ప్రగాఢమైన కోరిక ఒక్కటే బలంగా ఉంది. అదే అతడిని ఇంత పెద్ద సాహసానికి పూనుకునేలా చేసింది. 

అందుకోసం అతను కూరగాయ దుకాణంలో సహాయకుడిగా, ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పనిచేసిన పోదుపుతో ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌కు చేరుకున్నాడు. ఈ యాత్ర కోసం అతడ ఖర్చు చేసిందో ఎంతో తెలిస్తే విస్తుపోతారు. కేవలం రూ. 16 వేలతో ఈ డ్రిమ్‌ని ఫుల్‌ఫిల్‌ చేసుకున్నాడు. అంత తక్కువ డబ్బుతో ఎలా సాధ్యం అంటే..మనసుంటే మార్గం ఉందని అంటాడు కేశవ్‌. 

నిజానికి ఆ స్టూడెంట్‌ ఆశయం సాధరణమైంది కాదు. ఎందుకంటే ఎవరెస్టు యాత్రకు అయ్యే ఖర్చు సుమారు రూ. 15 లక్షలు. అయితే ఎవరెస్టు శిఖరాగ్రం అతడి స్థోమతకు అందనిది, అందుకని చిన్న చిన్న దశలుగా విభజించుకుని ఒక్కో మైలు రాయిని చేరుకునేలా ప్రయాణాన్ని ప్రారంభించాడు. అలా దాదాపు 5 వేల మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌కు చేరుకున్నాడు కేశవ్‌. అలాగే తన స్థోమతకు అనుగుణంగా ఖర్చులు తగ్గించుకునేలా యాత్ర ప్లాన్‌ చేశాడు. సెకండ్‌ క్లాస్‌ రైళ్లు, బస్సుల్లో ప్రయాణించి సోనౌలి సరిహద్దు ద్వారా నేపాల్‌లోకి ప్రవేశించి, కాలినడకన యాత్ర కోసం సల్లేరికి చేరుకున్నాడు.

దాదాపు ఎనిమిది రోజులు పైయా, టెంగ్‌బోచే, డింగ్‌బోచే, లుబుచేలా గుండా ప్రయాణిస్తూ..చివరకు ఎవరెస్టుబేస్‌ క్యాంప్‌కు చేరుకున్నాడు. అలాగే క్యాంప్‌కు సమీపంలో ఉన్న  గోరక్‌షెప్‌కు చేరుకోవడానికి 132 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాడు. మధ్యమధ్యలో టెంట్‌ వేసుకుని నిద్రించాడు కూడా. అలాగే తన బడ్జెట్‌కి అనుగుణంగా స్వయంగా వండుకుని ఆహారం తినేవాడు. 

ఈ యాత్రకు ఎన్నో అడ్డంకులు..
అతడు ఈ యాత్రను సెప్టెంబర్ 2025లో ప్రారంభించాడు. జనవరిలో తన అమ్మమ్మ మరణింతో మధ్యలోనే తిరిగి వచ్చేశాడు, కానీ సంకల్పం వదులుకోలేదు. ఆ తర్వాత చిన్న చితకా ఉద్యోగాల్లో చేరి డబ్బు ఆదా చేసి ఏప్రిల్‌ 7న అధిరోహణ పునః ప్రారంభించాడు. అలా రెండో ప్రయత్నంలో తన కలను సాకారం చేసుకున్నాడు. అతడి కథ..చుట్టూ ఎలాంటి వనరులు లేకపోయినా..కనీసం మార్గనిర్దేశం లేకపోయానా..సాధించాలి అన్న తపన ఎవరెస్టు వరకు నడిపించింది. 

చాలా శ్రమకోర్చి సాధించిన విజయం ఇది. పైగా కేశవ్‌ జస్ట్‌ 21 ఏళ్లకే దాన్ని సాధించాడు. అయితే అతడు శిఖరాగ్రం చేరుకోకపోవచ్చు..సమీపం వరకు వెళ్లి అనుకున్నది సాధించాడు. నిజానికి ఎవరెస్టు శిఖరాగ్రం చేరుకోవడానికి బేస్‌క్యాంప్‌లో ఫిజికల్‌ శిక్షణ, వంటివి చాలానే ఉంటాయి. అయినా ఇంత సాధించిన కేశవ్‌కి అదేమంత కష్టమేమి కాదు. మరి అతడికి ఆల్‌ది బెస్ట్‌ చెబుదామా..!

 

(చదవండి: ట్రాక్టర్‌ డ్రైవర్‌ కుమారుడు స్పేస్‌ టెక్‌ కంపెనీ సీఈవోగా..!)
 

Videos

జై జగన్ జై జగన్!! దద్దరిల్లిన YSRCP ఆఫీస్

లోకేష్ జల్సాలు..స్పెషల్ ఫ్లైట్లో పుట్టపర్తికి..భారీ కాన్వాయ్ లో చక్కర్లు

2 వాహనాలతో మోదీ కాన్వాయ్ 8 వాహనాలతో లోకేష్ కాన్వాయ్

YSRCPలో చేరిన తరువాత మోపిదేవి శ్రీనివాసరావు ఫస్ట్ రియాక్షన్

తెలుగు రాష్ట్రాలకు తీపి కబురు ముందుగానే రుతుపవనాలు

మోపిదేవికి జగన్ హామీ..

జగన్ సమక్షంలో పార్టీలో చేరిన మోపిదేవి శ్రీనివాసరావు

రేపు పోలీసుల ముందుకు బండి.. హైకోర్టులో వాదనలు

బండి భగీరథ్ కు బిగ్ షాక్.. హైకోర్టు సంచలన కామెంట్స్

హైకోర్టు సంచలన కామెంట్స్.. బండి భగీరథ్ కు బిగ్ షాక్

Photos

+5

ఫారిన్ వెకేషన్‌లో మహేశ్ బాబు ఫ్యామిలీ.. (ఫోటోలు)

+5

కేన్స్ వీధుల్లో మెగా డాటర్ నిహారిక సందడి.. (ఫోటోలు)

+5

పొలిటికల్‌ స్టైల్‌ షో.. ఈ అదిరే లుక్స్‌ చూశారా?..

+5

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేసిన నటి ఊర్వశీ రౌతేలా (ఫొటోలు)

+5

చిత్తూరు గంగజాతర... కనులపండువగా అమ్మవారి దివ్యరూపం (ఫొటోలు)

+5

‘దూరదర్శని’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విడాకుల రూమర్స్.. ట్రెండింగ్‌లో మౌనీరాయ్ (ఫొటోలు)

+5

అరుణాచలం ట్రిప్‌లో హీరోయిన్ అంజలి (ఫొటోలు)

+5

తెలంగాణ : కోరిన కోరికలు తీర్చే అద్భుత శక్తులు కలిగిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆలియా భట్ (ఫొటోలు)