Breaking News

నో ఫోన్‌ అవర్‌..! స్వేచ్ఛ కోసం ఆత్మీయ పిలుపు..

Published on Wed, 08/06/2025 - 11:54

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘నో ఫోన్‌ అవర్‌’ అనే సరికొత్త ప్రచారం చక్కర్లు కొడుతోంది. నో ఫోన్‌ అవర్‌ ఒక సాధారణ ప్రచారం మాత్రమే కాదు.. నేటి అధునాతన జీవనశైలిలో స్వేచ్ఛను అన్వేషించుకునే ఆత్మీయ పిలుపు అని నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ హోం అప్లయన్స్‌ బ్రాండ్‌ కెన్‌స్టార్‌ ఆధ్వర్యంలో ఈ ‘నో ఫోన్‌ అవర్‌’లో భాగంగా ఆగస్టు 15న సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకూ మొబైల్‌ ఫోన్లు ఆఫ్‌ చేసి, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో ఆ సమయాన్ని గడపాలని పిలుపునిస్తోంది. 

ఇందులో భాగంగా డిజిటల్‌ ప్రపంచపు గందరగోళం నుంచి బయటపడి, నిజమైన ఆనందాన్ని, అనుబంధాన్ని మళ్లీ ఆస్వాదించేలా కెన్‌స్టార్‌ ఆహ్వానిస్తోంది. కెన్‌స్టార్‌ సీఈఓ సునిల్‌ జైన్‌ మాట్లాడుతూ.. బాధ్యతగల పౌరులుగా మన మూలాలను గుర్తుచేసుకుంటూ, ముఖ్యమైన వారితో కలిసి స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని కోరారు. 

ఈ డిజిటల్‌ యుగంలో మనకు వేలాది ఆన్‌లైన్‌ ఫాలోవర్స్‌ ఉన్నా, మనుషులతో కలిసుండాలన్న కోరిక ఇంకా బతికే ఉంది. ‘నో ఫోన్‌ అవర్‌’ ఆ కోరికను తీర్చగలిగే సరికొత్త ప్రయత్నమని తెలిపారు. ఈ అనుభవాలను సోషల్‌ మీడియాలో # NoPhoneHour హ్యాష్‌ట్యాగ్‌తో కథలు, వీడియోలు, ఆడియో సందేశాల రూపంలో పంచుకోవాలని పేర్కొన్నారు.  

(చదవండి: 'మన ఆరోగ్యానికి మనమే సీఈఓ': నటి లిసా రే)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)