Breaking News

Travel: కసౌలి.. నేచర్‌ లవర్స్‌ ప్యారడైజ్‌! ఇదో మాయా లోకం!

Published on Mon, 10/05/2026 - 08:50

షిమ్లా రద్దీకి దూరంగా, హిమాచల్‌ కొండల్లో ఒదిగిపోయిన ఒక చిన్న అందమైన ప్రదేశమే కసౌలి. ఇక్కడ పెద్ద హోటళ్లు ఉండవు, పెద్ద షాపింగ్‌ మాల్స్‌ ఉండవు. ఉన్నదల్లా పైన్‌ చెట్ల వాసన, చల్లటి గాలి, ఉదయాన్నే కిటికీలోకి తొంగి చూసే సూర్య కిరణాలు, చుట్టూరా కనిపించే మంచు.

ఇక్కడ ఉదయం చాలా నెమ్మదిగా మొదలవుతుంది. టీ కప్పు చేతిలో పట్టుకుని బాల్కనీలో నిలబడితే, దూరంగా మంచుతో కప్పబడిన హిమాలయాలు, లోయలో తేలిపోతున్న మేఘాలు కనిపిస్తాయి. ఏ శబ్దం లేదు, కేవలం పక్షుల కిలకిలా, పైన్‌ ఆకుల మధ్య నుంచి వచ్చే గాలి శబ్దం మాత్రమే వినిపిస్తుంది.

ఏం చూడాలి?

  • కసౌలిలో ఎక్కువ తిరిగే అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నా మీకు ప్రశాంతత లభిస్తుంది. అయితే కొన్ని ప్రదేశాలు తప్పకుండా కవర్‌ చేయాలి అని ఒక లిస్ట్‌ రెడీ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు మంకీ ΄ాయింట్‌ వెళ్లండి. ఇదే ఇక్కడ అతి ఎత్తైన ప్రదేశం. ఇక్కడి నుంచి చూస్తే సట్లెజ్‌ నది, చండీగఢ్‌ నగరం కూడా కనిపిస్తాయి. ఇక్కడ హనుమాన్‌ గుడి ఉంది, వానరాలు ఎక్కువగా ఉంటాయి.

  • గిల్బర్ట్‌ ట్రయిల్‌ అనేది కసౌలికి గుండెకాయ లాంటిది. రెండు వైపులా ఎత్తైన పైన్, ఓక్‌ చెట్లు, మధ్యలో సన్నటి దారి ఉంటుంది. ఈ దారిలో నడవడం అంటే ప్రకతితో మాట్లాడటమే. సన్‌ సెట్‌ ΄ాయింట్‌ లో సాయంత్రం కూర్చుంటే, సూర్యుడు కొండల వెనుకకు వెళ్లే దశ్యం, ఆకాశం ఎర్రగా మారే క్షణాలను మర్చిపోలేము.

  • కసౌలి బ్రూవరీ, క్రై స్ట్‌ చర్చ్, ఇవి బ్రిటిష్‌ కాలం నాటి కట్టడాలు. 150 ఏళ్ల నాటి చర్చ్‌ లోపల కూర్చుని ఏమీ ఆలోచించకుండా కాస్త సమయాన్ని గడిపి చూడండి.

ఎక్కడ ఉండాలి, ఏం తినాలి?

  • కసౌలిలో పెద్ద హోటల్స్‌ కన్నా, బ్రిటిష్‌ కాలం నాటి బంగ్లాలు, హోమ్‌ స్టేలు బాగుంటాయి.

  • చెక్కతో కట్టిన ఇళ్లు, లోపల ఫైర్‌ ప్లేస్, బయట పూల తోట. ఉదయం లేవగానే తోటలోకి వచ్చే కోయిల కూత.. ఇలాంటి చిన్న చిన్న నథింగ్‌ లాంటి థింగ్సే ఇక్కడ బాగుంటాయి.

  • తినడానికి ఇక్కడ టిబెటన్‌ మోమోస్, థుక్పా చాలా ఫేమస్‌. మాల్‌ రోడ్‌ లో చిన్న చిన్న కేఫ్‌ లలో వేడి వేడి బన్, చాయ్‌ తాగుతూ కొండలను చూడటం, అదొక మజా.

హైదరాబాద్‌ నుంచి ఎలా వెళ్లాలి?

  • హైదరాబాద్‌ నుంచి కసౌలికి డైరెక్ట్‌ ఫ్లైట్‌ లేదు. హైదరాబాద్‌ నుంచి చండీగఢ్‌ కి ఫ్లైట్‌ తీసుకోవాలి. దాదాపు 2.30 గంటల ప్రయాణం. చండీగఢ్‌ నుంచి కసౌలి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కారులో 2 గంటల్లో వెళ్లిపోవచ్చు. దారి మొత్తం కొండలు, పైన్‌ ఫారెస్ట్‌ లు, చిన్న చిన్న ఊళ్లు కనిపిస్తాయి. ఈ జర్నీ చాలా బాగుంటుంది.

  • ఫ్లైట్‌ లో వెళ్లాలనుకుంటే ముందు ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి కాల్కా వరకు ట్రైన్‌ లో వెళ్లవచ్చు. కాల్కా నుంచి టాయ్‌ ట్రైన్‌లో సోలన్‌ వరకు, అక్కడి నుంచి కసౌలి చేరుకోవచ్చు. ఈ టాయ్‌ ట్రైన్‌ ప్రయాణం జీవితంలో ఒకసారి చేయాల్సిందే.

  • విజయవాడ నుంచి వచ్చే వాళ్లు హైదరాబాద్‌ మీదుగా వెళ్లడం ఈజీ, లేదంటే డైరెక్ట్‌ గా ఢిల్లీకి వెళ్లి కంటిన్యూ చేయవచ్చు.

  • కసౌలి వెళ్లేందుకు అక్టోబర్‌ నుంచి మార్చ్‌ వరకు బెస్ట్‌ సీజన్‌. డిసెంబర్, జనవరిలో మంచు కురుస్తుంది. అప్పుడు కసౌలి మరింత అందంగా కనిపిస్తుంది.

  • కసౌలి అంటే హడావిడి లేని ప్రయాణం. ఫోన్‌ సిగ్నల్‌ తక్కువ, మనుషుల గోల తక్కువ. మనసులో ప్రశాంతత ఎక్కువ.

ఇదీ చదవండి: ఆఫ్రికా గుండె చప్పుడు.. కన్నీళ్లు తెప్పించే అద్భుతం!

Videos

నిన్నే అడుగుతున్న... పెనుకొండలో ఉషశ్రీ చరణ్ భారీ ధర్నా

రజినీతో క్లాష్ మిస్... దుల్కర్ తో క్లాష్ ఫిక్స్..

జూలైలోనే విమానం కూల్చేందుకు కుట్ర... సంచలన విషయాలు

రాయలసీమ ద్రోహి చంద్రబాబు

YSRCP నేతలను ఎన్నికల్లో పోటీ చేయకుండా కూటమి కుట్ర

బాల్కనీ నుంచి జారిన చిన్నారి.. చివరి క్షణంలో ఎలా కాపాడాడంటే!

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో డెలివరీ బాయ్‌పై భార్యాభర్తల దాడి

ఫ్యాన్ కోసం సెక్యూరిటీని లెక్కచేయని ధావన్

తాట తీస్తాం చుట్టమల్లే డీప్ ఫేక్ పై నాగవంశీ వార్నింగ్

రాజకీయ ప్రయాణం బుక్ స్థితప్రజ్ఞుడు YS జగన్..

Photos

+5

మూవీ రిలీజ్ తర్వాత మళ్లీ ట్రెండింగ్‌లో నక్షత్ర (ఫొటోలు)

+5

ఎం.ఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్.. రష్మిక ఎమోషనల్ పోస్ట్ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్ కళ్యాణ్’మూవీ హీరోయిన్ మహిమ నంబియార్ (ఫొటోలు)

+5

యాంకర్ అనసూయ 'దేశీ గర్ల్' లుక్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్ : ఏపీలో ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాలు...(ఫొటోలు)

+5

టెన్నిస్‌ కోర్టులో నటి వర్ష డిసౌజా.. (ఫొటోలు)

+5

రష్మిక రణబాలి లుక్‌.. అదిరిపోయిన స్టిల్స్(ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ భారత క్రికెటర్‌ శిఖర్ ధావన్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : దుర్గామాతకు జైకొడదాం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : సందడిగా దక్కన్‌ డెర్బీ మీట్‌ (ఫొటోలు)