Breaking News

నో ఫుడ్‌.. నోవాటర్‌.. రోజుకి 8 లీటర్ల ఇంజిన్‌ ఆయిల్‌ చాలు, వైరల్‌ వీడియో

Published on Fri, 09/19/2025 - 16:28

కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి సాధారణ ఆహారాన్ని తీసుకోకుండానే గత 33 ఏళ్లుగా జీవిస్తున్నాడట.  అదేంటి? ఎలా? అని ఆశ్చర్య పోతున్నారా? మరదే కదా స్టోరీ.. రోజుకు కేవలం 7-8 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్,  టీ మాత్రమే సేవిస్తాడు. అందుకే లోకల్‌గా ‘ఆయిల్‌ కుమార్‌’గా పాపులర్‌ అయ్యాడట.  దీనికి సంబంధించి ఒక వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.  

ఈ వైరల్‌ వీడియోలో రైస్‌ , చపాతీలు ఇస్తే తీసుకోలేదు. దీనికి బదులుగా  ఇంజిన్ ఆయిల్ బాటిల్‌ను ఎత్తి గటా గటా తాగేశాడు. కర్ణాటకలో సాధువు రూపంలో నివసిస్తున్న ఆయిల్ కుమార్ మోటార్ ఆయిల్ తాగుతూ సంతోషంగా జీవిస్తున్నాడు. గత కొన్ని దశాబ్దాలుగా రోజువారీ 7-8 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్ తాగుతూ జీవిస్తున్నాడు. అంతేకాదు ఇప్పటివరకు అతనికి ఎలాంటి అనారోగ్యం రాలేదనీ, ఆసుపత్రికి వెళ్లలేదనీ,ఆరోగ్యకరమైన జీవిస్తున్నానని తెలిపాడు పైగా అయ్యప్ప ఆశీస్సుల వల్లే ఈ ప్రత్యేక జీవనశైలి సాధ్యమవుతుందని అయ్యప్ప వేషధారణలోఉన్న ఆయిల్‌ కుమార్‌ చెప్పుకొచ్చాడు.తన విశ్వాసమే దీన్ని భరించే సామర్థ్యాన్ని ఇస్తోందనీ, ఆ అయ్యప్ప స్వామి దయ ద్వారా మాత్రమే తాను జీవిస్తున్నాననేది అతని విశ్వాసం.

నిపుణులేమంటున్నారంటే
అయితే, వైద్య నిపుణులు మాత్రం దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. మోటారు ఆయిల్‌లో మానవులకు విషపూరితమైన పెట్రోలియం ఆధారిత సమ్మేళనాలు ఉంటాయని, చాలా ప్రమాదమ నొక్కి చెప్పారు.  ఇలాంటి  పదార్థాలను మింగడం లేదా పీల్చడం వల్ల అనేక తీవ్రమైన పరిణామాలు సంభవించవచ్చు. ముఖ్యంగా ఊపిరితిత్తులలోకి పీల్చినట్లయితే, తక్షణ , దీర్ఘకాలిక ప్రమాదాలు ఎదురవుతాయని వారు హెచ్చరించారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్,శ్వాసకోశ వైఫల్యం, దీర్ఘకాలిక దగ్గు, శ్వాసలోపం మరియు శ్వాస ఆడకపోవడం ప్రాణాంతక పరిస్థితులకు దారితీయవచ్చుని పేర్కొన్నారు. జీర్ణవ్యవస్థ ప్రభావం చూపుతుంది.నోరు, గొంతు , కడుపులో కాలిపోవచ్చు.అంతర్గత రక్తస్రావం. వాంతులు, కొన్నిసార్లు రక్తపు వాంతులు కావచ్చు. అల్సర్లు, పుండ్లు తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారి తీయవచ్చు. తలనొప్పి, తలతిరగడం, దిక్కుతోచని స్థితి, మూర్ఛ వంటి నాడీ సంబంధిత సమస్యలొస్తాయి. ఈ విషపూరిత సమ్మేళనాలతో కాలేయం,మూత్రపిండాలకు దెబ్బతినేఅవకాశం ఉంది. హైడ్రోకార్బన్ కంటెంట్ కారణంగా  గుండెజబ్బు లాంటి ప్రాణాంతక సమస్యలు రావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)