Breaking News

37 ఏళ్లకు బిగ్‌ బాస్‌ బ్యూటీ, యాంకర్‌ పెళ్లి : ఆరెంజ్‌ శారీ, టెంపుల్‌ జ్యుయల్లరీ

Published on Thu, 08/28/2025 - 16:59

కన్నడ బుల్లితెర  యాంకర్, నటి అనుశ్రీ (37) మొత్తానికి మూడు ముళ్ల బంధం లోకి అడుగుపెట్టింది. ఎన్నో ఊహాగానాల తర్వాత,  ఆగస్టు 28న సాంప్రదాయ వేడుకలోవ్యాపారవేత్త రోషన్‌ను వివాహం చేసుకుంది. బెంగళూరు శివార్లలోని ఒకఅందమైన రిసార్ట్‌లో ఈ వివాహం జరిగింది. ఈ జంట సన్నిహితులు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. దీంతో అభిమానులుఫుల్‌ ఖుషీగాఉన్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు  నెట్టింట సందడిగా మారాయి.

అనుశ్రీ సాంప్రదాయ నారింజ రంగు చీరలో చాలా అందంగా కనిపించింది. నెక్లెస్, రాణి హార్, కమర్బంద్, మాంగ్ టీకా, ఝుంకాలు, బ్యాంగిల్స్‌ , ఇతర టెంపుల్‌ జ్యుయల్లరీతో అందంగా మెరిసిపోయింది. మరోవైపు, వరుడు రోషన్ బంగారు కుర్తాను , మ్యాచింగ్‌ ధోతీని ధరించాడు.  

అనుశ్రీ - రోషన్ వివాహ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు
అనుశ్రీ - రోషన్ వివాహానికి మెహందీ, హల్ది లాంటి  ప్రీవెడ్డింగ్‌ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారుఘీ సన్నిహిత వేడుకల ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అయ్యాయి. అభిమానులు, సన్నిహితులు హృదయపూర్వక శుభాకాంక్షలతో  వెల్లువెత్తాయి.

అనూశ్రీ భావోద్వేగం: రోషన్ మంగళసూత్రాన్ని కట్టుకుంటుండగా అనుశ్రీ భావోద్వేగంతో  కన్నీరుపెట్టుకుంది. 

కన్నడనాట అనుశ్రీ తన టాలెంట్‌, యాంకరింగ్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తన చాతుర్యంతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను, పాపులారిటీని సంపాదించుకుంది.  బిగ్ బాస్ కన్నడలో కూడా పాల్గొంది. మంగళూరులో జన్మించిన అనుశ్రీ, చిన్నతనంలోనే తండ్రి విడిచి పెట్టడంతో తల్లితో పాటు పెరుగుతూ అనేక  కష్టాలను ఎదుర్కొంది. అలా చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను స్వీకరించింది. కరియర్‌లో నిలదొక్కుకుని తన తల్లి కోసం ఒక ఇల్లు కూడా నిర్మించింది, ఆమె సోదరుడు తన సొంత హోటల్ వ్యాపారాన్ని స్థాపించాడు. తన కుటుంబం బాధ్యతలను నెరవేర్చిన ఇన్నాళ్లకు   అనుశ్రీ  కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది.  భార్యగా తన కొత్త పాత్రను స్వీకరించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)