Breaking News

నటి కంగనా రనౌత్‌ పండుగ లుక్‌..! ఆ లెహంగా అంత ఖరీదా..

Published on Sun, 10/18/2026 - 12:05

నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ ఫ్యాషన్‌కే ఐకాన్‌గా ట్రెండ్‌ సెట్‌ చేస్తుంటుందామె. ఎప్పుడూ విలక్షణమైన ఆహార్యంతో తనదైన స్టైల్‌తో ఆకట్టుకుంటారమే. వేడుకకు, సందర్భానికి అనుగుణంగా దుస్తులు ధరించడంలో కంగానకు సాటిరారెవ్వరూ. ఈసారి ఈ నవరాత్రుల పండుగకు కూడా అదే తరహాలో అత్యద్భుతమైన లుక్‌తో అందర్నీ ఆశ్చర్యపర్చింది. మన దేశ సాంస్కృతికి వారసత్వాన్ని, పండుగ శోభను అందించేలా చక్కటి డిజైనర్‌వేర్‌లో మెరిసింది. ఆమె ధరించిన డ్రెస్‌లో ఎన్ని విశేషాలు దాగున్నాయో తెలుసా..!.

నటి కంగనా రనౌత్‌ టోరాని డిజైనర్‌ లేబుల్‌కి చెందిన అద్భుతమైన సిల్క్‌ లెహంగాలో మెరిసిందామె. ఈ లెహంగా సెట్‌lr సింధులోయ సంచార సంస్కృతుల వారసత్వాన్ని గుర్తు చేసేలా డిజైన్‌ చేశారు. దీనిపైన ఉన్న కిట్చీ డిజైన్‌ శైలి రంగుల గొప్పతనాన్ని ఆవిష్కరించింది. ఈ విశాలమైన, ఫ్లేర్డ్ లెహంగా స్కర్ట్‌ను క్లిష్టమైన ఎంబ్రాయిడరీతో కూడిన చోళీతో జత చేశారు. క్రాస్‌క్రాస్ టైస్ స్టేట్‌మెంట్ టాసెల్స్‌తో కూడిన లేస్-అప్ బ్యాక్ డిజైన్‌తో బ్లౌజ్ ప్రత్యేకంగా నిలిచింది. 

కంగనా భుజంపై మ్యాచింగ్ ప్రింటెడ్ దుపట్టా నవరాత్రి లుక్‌ని అందించి ఆకర్షణీయంగా కనిపించేలా చేసింది. అందుకు అనుగుణంగా భారీ ఆక్సిడైజ్డ్ సిల్వర్ ఆభరణాలతో  నిండుగా కనిపించింది. ఆమె లావుపాటి నెక్లెస్‌లు, వెడల్పాటి బాహుబంధాలు, అలంకరించిన ఉంగరాలను పొరలుగా ధరించి, గుండ్రని మాంగ్ టికా పెట్టుకుంది. అలాగే కురులను చక్కటి హెయిర్‌ యాక్సెసరీస్‌తో అందమైన జడలా వేశారు. నేచరుల్‌గా కనిపించేలా తేలికపాటి మేకప్‌నే ఎంచుకుందామె. 

మోదీ అన్నట్లుగా బంగారం కొనడం తగ్గించండి అన్నపిలుపుకి అనుగుణంగా వెండి ఆభరణాలతో మెరిసిందామె. అంతేగాదు వెండి కూడా ఆభరణమే ధైర్యంగా ధరించండి అని చెబుతున్నట్లుగా ఉంది ఆమె అలంకారం. అలాగే భారతీయ వారసత్వాన్ని చాటిచెప్పేలా పండుగ రూపాన్ని ప్రదర్శించేలా కనుబొమ్మలు, గడ్డం వద్ద సున్నితమైన ఐలైనర్‌ చుక్కలను జోడించింది కంగనా. అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ..‘ధోలిదా 2026’ అనే క్యాప్షన్‌ జోడించి మరి పోస్ట్‌ చేశారు. 

అలాగే పోస్ట్‌లో నవరాత్రి స్త్రీత్వపు వేడుక. గర్భా నృత్య మేళ. వీటన్నింటిలో దేవిక శక్తి ఉంటుంది. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఇలా అమ్మవారి పండుగలో స్వదేశీ సాంప్రదాయ కళ, సాంస్కృతిక వారసత్వానని ధరించడం చాలా ఆనందంగా ఉందని చెబుతోందామె. ఈ వేడుక కోసం చత్తీస్‌గఢలో ఉండటం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. ఇంతకీ కంగనా ధరించిన ఆ లెహంగా ధర ఎంతంటే..అక్షరాలు రూ.  రూ. 2.1 లక్షలు పలుకుతుందట.  

 

ఇదీ చదవండి: Sai Pallavi: గులాబీ చీరలో ‘సీతమ్మలా’ సాయిపల్లవి ట్రెడిషనల్‌ లుక్‌!
 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)