Breaking News

నటి కంగనా వెండిగ్లాసులో నీళ్లు తాగడం..! ఆరోగ్యానికి మంచిదేనా?

Published on Thu, 06/04/2026 - 11:40

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల భారత 'భారత్ భాగ్య విధాత' ట్రైలర్ విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఆమె వెండి గ్లాసులో నీళ్లు తాగుతూ కనిపించారు. 40 ఏళ్ల నటి గతంలో కూడా ఇలానే ఒక సందర్భంలో తాగుతూ కనిపించడంతో విమర్శులు వెల్లువెత్తాయి కూడా. అయితే తాను ఇలా వెండిగ్లాస్‌లో నీళ్లు తాగడానికి రీజన్‌ ఏంటో వివరించారు. 

ఎందుకు తాగుతానంటే..
తాను తాగే వెండిగ్లాస్‌ చాలా పాతదని, ముఖ్యంగా రాజ కుటుంబాలలో అనుసరిస్తున్న ఒక పురాతన సంప్రదాయం అని అన్నారామె. తాను ఆరోగ్యం కోసం ఇలా వెండిగ్లాస్‌లో తాగుతున్నట్లు తెలిపారు. అధిక పిత్తదోషం ఉన్నవారికి చల్లదనం కోసం ఇది ఎంతో మంచిదని అన్నారు. వెండికి, నీటికి ఉన్న చల్లదనాన్నిచ్చే గుణాలను గురించి కూడా నొక్కి చెప్పారామె.

నిజంగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా?

వెండి పాత్రలో నీళ్లు తాగడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయన్నారు ఆరోగ్య నిపుణులు. 

ఇలా వెండి పాత్రలో నీళ్లు తాగడం అనేది భారతీయ సంప్రదాయంలో ఆరోగ్యంలో ఒక భాగం. పైగా వెండికి సహజంగా సూక్ష్మజీవులను నిరోధించే గుణం ఉన్నందున దానికి ప్రాధాన్య ఇస్తారని అన్నారు. 

వెండిగిన్నెలో నిల్వ ఉన్న నీరు కొన్ని సూక్ష్మ జీవుల పెరుగుదలను నెమ్మదింప చేస్తుందన్నారు. 

మొత్తం ఆరోగ్య విషయానికి వస్తే ప్రయోజనాలు పరిమితంగా ఉన్నాయన్నారు. ఇలా వెండిగిన్నెలో నీరు తాగితే దానంతట అదే పోషణ, రోగనిరోధక శక్తి వస్తాయని కాదని, ఈ చిన్న మార్పు మొత్తం ఆరోగ్య మెరుగుదల అని అనుకుంటే పొరపాటే అని అన్నారు.

మన ఆయుర్వేదంలోనూ, భారతీయ సాంప్రదాయంలోనూ వెండి అనేది ఆరోగ్యానికి మంచిదే . అది వాస్తవమే అయినా..మొత్తం ఆరోగ్యంకి ముడిపెట్టడం సరికాదన్నారు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లలో చేర్చడం కూడా సముచితం కాదన్నారు ఆరోగ్య నిపుణుల. 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

(చదవండి: బంధనం, బాధ..భళ్లుమనేలా అద్భుతమైన కళకు ఊపిరిపోసింది..!)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)