Breaking News

దుర్గాపూజలో భక్తిపారవశ్యం, నటీమణులు ఎమోషనల్‌, వీడియో వైరల్‌

Published on Sun, 09/28/2025 - 12:57

ప్రతీ ఏడాది   ముంబైలో జరిగి దసరా   ఉత్సవాలు, దుర్గా పూజలో బాలీవుడ్‌ హీరోయిన్లు ఉత్సాహంగా పాల్గొనడం ఆనవాయితీ. ముఖ్యంగా కాజోల్ , రాణి ముఖర్జీ  ఈ కార్యక్రమాల్లో ముందంజలో ఉంటూ బంధుజనంతో కలివిడిగా తిరుగుతూ   ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు. అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కానీ ఏడాది ఉత్సవాల్లో వారిద్దరూ తీవ్ర భావోద్వాగానికి లోనయ్యారు. అటు తన తండ్రి తరువాత  అయాన్ ముఖర్జీ దుర్గా పూజ ఉత్సవాల్లో తొలిసారి  పాల్గొన్నారు. 

తమ సమీప బంధువు, అత్యంత ఆప్తుడైన నటుడు దేబ్‌ ముఖర్జీ  ఈ ఏడాదితమ  మధ్య లేకపోవడమే ఇందుకు కారణం. ఆయనను గుర్తు చేసుకుని ఆయన మేనకోడళ్ళు నటీమణులు కాజోల్ , తనీషా రాణీ ముఖర్జీ భావోద్వాగానికి లోనయ్యారు. ఈ దృశ్యలు ఆన్‌లైన్‌లో దర్శనిమిచ్చాయి. ప్రతి సంవత్సరం దుర్గా పూజ పండల్   ఘనంగా  దేబ్‌ ముఖర్చీ ఈ ఏడాది లేరు. ప్రముఖ బాలీవుడ్‌  నటుడు చిత్రనిర్మాత,బ్రహ్మాస్త్ర ఫేమ్  అయాన్ ముఖర్జీ తండ్రి దేబ్ ముఖర్జీ.  ఫ్యామిలీ అంతా ప్రేమగా 'దేబు కాకా' అని పిల్చుకునే  దేబ్ ముఖర్జీ మార్చి 14, 2025న కన్నుమూసిన సంగతి తెలిసిందే.

ఈ  నేపథ్యంలో ఈ  ఏడాది  తమ కుటుంబ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లి, ఉత్సవాలను కలిసి ప్రారంభించారు కాజోల్‌, రాణీ ముఖర్జీ తనీషా ముఖర్జీ తదితర కుటుంబ సభ్యులు నార్త్ బాంబే సర్బోజానిన్ దుర్గా పూజ పండల్‌ను ఆవిష్కరించారు.రాణి ముఖర్జీ కుటుంబం యొక్క దుర్గా పూజ 2025 కి సహ-నిర్వాహకురాలిగా ఉన్నారు.

‘‘అయిగిరి నందిని’’అనే స్తోత్రం మధ్య కాజోల్, రాణి దుర్గా మాత విగ్రహాన్ని  ఆవిష్కరించారు. అమ్మవారిని చూడగానే   ఇద్దరూ భక్తితో చేతులో జోడించి నమస్కరించారు. అనంతర అటు అమ్మవారి రూపాన్ని చూసి, ఇటు దివంగత దేబ్‌ ముఖర్జీని స్మరించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

ఈ సందర్భంగా తనీషా మాట్లాడుతూ"మా కుటుంబానికి ఇది కొంచెం విచారకరమైన సమయం, కొంచెం ఉత్సాహంతో పాటు, ఈ సంవత్సరం మా కుటుంబంలో ముగ్గురు ఆప్తులను కోల్పోయాం.  ప్రతి సంవత్సరం దుర్గా పూజను నిర్వహించే మా దేబు కాకా (దేబ్ ముఖర్జీ) ఇక లేరు, ఈసారి పూజకు హాజరు కావడం  కొంచెం కష్టంగానే అనిపించింది. అయినా గానీ ఆయన కలను ముందుకు తీసుకెళ్తున్నందున చాలా ఆనందంగా కూడా ఉంది." అన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)