Breaking News

'మెహ్మాన్' అంటూ.. భారతీయుల మనసులను గెలుపొందాడు..!

Published on Tue, 12/02/2025 - 17:53

కొన్ని వైరల్‌ వీడియోలు గొప్ప సందేశాన్ని, అ‍ద్భుతమైన ప్రేమను వ్యక్తం చేస్తాయి. అలాంటి అద్భుతమైన క్షణానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. భారతీయ ట్రావెల్‌ వ్లాగర్‌ కైలాష్‌ మీనా భారతీయ సందర్శకులు పట్ల సంస్కృతిని ప్రతిబింబించే సంభాషణను రికార్డు చేశాడు. ఆ వీడియోలో అఫ్గనిస్తాన్‌లోని జ్యైస్‌ కార్ట్‌ ​వద్ద కైలాష్‌ ఒక గ్లాసు దానిమ్మ రసం ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తుంది.

ఆ తర్వాత డబ్బు చెల్లించబోతుంటే..విక్రేత మర్యాదగా నవ్వి డబ్బు తీసుకోవడానికి నిరాకరిస్తాడు. పైగా "మెహ్మాన్" అనే పదాన్ని పునరావృతం చేస్తాడు. అంటే మీరు మా అతిథి అని అర్థం. అంతేగాదు సమీపంలో నిలబడి ఉన్న ఒక స్థానిక వ్యక్తి  "ఇండియా మెహ్మాన్ హై" అని గట్టిగా చెబుతూ భావోద్వేగం వ్యక్తం చేస్తాడు. ముఖ్యంగా భారతీయ ప్రయాణికుల పట్ల చూపిన ఆప్యాయతను గురించి వీడియోలో నొక్కి చెప్పడం స్పష్టంగా చూడొచ్చు. 

అందుకు ముగ్దుడై ఈ ట్రావెల్‌ వ్లాగర్‌ ఈ దేశం ఆతిథ్యాన్ని గుర్తిస్తూ  "యే హై ఆఫ్ఘనిస్తాన్ కి మెహ్మన్నవాజీ" అని అంటాడు. అంతేగాదు తాను అఫ్గాన్‌ అంతటా చాలా ప్రదేశాల్లో ఈ స్థాయి ఆతిథ్యాన్నే చూశానని, మళ్లీ ఈ దేశాన్ని సందర్శించాలనుకుంటున్నా అంటూ వీడియోని ముగించాడు. ఈ వీడియో నెటిజన్లను ఆకర్షించడమే కాదు అఫ్గాన్‌ దేశం ఆతిథ్యంపై ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: జేఈఈ ప్రిపరేషన్‌ నుంచి రాష్ట్రపతి మెడల్‌ వరకు..! ఎన్డీఏ చరిత్రలో సరికొత్త మైలు రాయి..)

 

 

Videos

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)