Breaking News

ఫ్యాషన్‌ మోడల్‌గా రైతు..! బాలీవుడ్‌ సైతం..

Published on Thu, 10/08/2026 - 16:45

ఎలాంటి అవకాశాలులేని చోట కూడా గొప్పగా లైఫ్‌ని మలుచుకోవచ్చు అని చూపించాడు ఈ యువకుడు. అందరు ఎన్నో అనుకుంటారు. అనుకున్నవి కాలేదని జీవితం ఆగిపోదు అన్న నానుడి మాదిరిగా ఈ యువ రైతు తన లైఫ్‌ని మలుచుక్ను విధానం ఈ తరానికి ఆదర్శం. అంతేగాదు బాలీవుడ్‌ సైతం అతడి క్రియేటివిటీకి దాసోహం అంటోంది. 

ఒకచిన్న ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అనేందుకు జార్ఖండ్‌కి చెందిన ఈ 24 ఏళ్ల నిశాంత్‌ అనే రైతు ఓ ఉదాహరణ. అతడు స్వతహాగా వైల్డ్‌ లైఫ్‌ ఫోటోగ్రాఫర్‌ కావాలని కలలు కన్నాడు. కానీ జీవితం మరోలా తీసుకుపోయింది. నిశాంత్‌ తన తల్లిదండ్రులు నలుగురు అన్నలతో కలిసి జీవిస్తున్నాడు. కుటుంబంలో నిశాంత్‌ అందరికంటే చిన్నవాడు. అతడి కుటుంబం వరి, రాగి, మినుములు, వివిధ కాలనుగుణ కూరగాయలు పండిస్తూ జీవినోపాధి పొందుతోంది. 

ప్రస్తుతం అతడి అన్నదమ్ములు ఉద్యోగ అవకాశాల కోసం రాంచీలో ఉన్నారు. ఇక నిశాంత్‌ లైప్‌ ఎప్పుడు సాఫీగా సాగలేదు. కుటుంబం కోసం వ్యవసాయం చేయడం నుంచి సైకిళ్లను బాగు చేయడం వంటి చిన్న చితకా పనులు చేయాల్సి వచ్చేది. అయితే చిన్నప్పుడు బ్రెయిన్‌లో జరిగిన రక్తస్రావం కారణంగా అతని శరీరం ఒకవైపు పక్షవాతానికి గురైంది కూడా. అయినా తన చదువుని ఆసక్తులను వదిలేయలేదు. అలా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేస్తూనే గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాన్ని చూసుకునేవాడు. 

అయితే నిశాంత్‌కు క్రియేటివిటీ రంగంపై చాలా ఆసక్తి ఉండేది. అందుకే కాలేజ్‌లో నృత్యం, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, పరుగు, వాలీబాల్‌, ఫోటోగ్రఫీ వంటి వాటిని బాగా ఆస్వాదించేవాడు. అందుకే గోవాలో హౌస్‌కీపింగ్‌ ఉద్యోగం చేస్తూనే వన్యప్రాణి ఫోటోగ్రఫికోర్సులో చేరాడు. అలాగే ఆర్థిక స్థిరత్వం కోసం అతను తన కజిన్‌తో కలిసి రాంచీలో ఒక చిన్న కిరాణా దుకాణాన్ని కూడా తెరిచాడు. అయితే ఒక రోజు తన బట్టల అరను సద్దుతుండగా బుర్రల్లో తళుక్కమన్న ఆలోచన అతడి లైఫ్‌ని యూటర్న్‌ తిప్పింది. తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న బట్టలను చూసి..తానే వాటిని స్టైల్‌ చేసి ట్రెండ్‌కి అనుగుణంగా ధరించి వీడియోలు తీస్తే ఎలా ఉంటుందని అనుకున్నాడు. 

ఇలా అనుకున్నాడో లేదా దాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చి..వీడియోలు పోస్ట్‌ చేస్తుండేవాడు. వాటికి నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్‌ రావడం మొదలైంది. అవి కూడా తన పొలంలో కండలను ప్రదర్శిస్తూ పనులు చేసుకుంటున్నట్లు తీసిన వీడీయో ఫ్యాషన్-ఫార్వర్డ్ స్టైల్స్‌కి కెరాఫ్‌గా మారింది. ఆ తర్వాత వదులుగా ఉండే షర్టులతో బ్యాగీ ఫ్యాంట్లు, ఫార్మల్‌ షర్టులతో జీన్స్‌, టై, పొడవాటి కోట్లు, స్కార్ఫ్‌లు క్యాజువల్స్‌ ఇంకా మరెన్నో ఫ్యాషన్‌ వేర్‌ వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకోవడమే కాదు గ్రామీణ కుర్రాళ్లలో ఇంత టాలెంట్‌ ఉంటుందా అని ఆశ్చర్యపోయేలా చేశాడు. 

ముఖ్యంగా అతని ఫేస్‌ మోడల్‌గా అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు. అంతేగాదు అతని వీడియోలు బాలీవుడ్‌ ప్రముఖుల వరకు చేరి భూమి పడ్నేకర్‌, అనూషా దండేకర్‌ వంటి నటులు వావ్‌ అద్భుతం అని అతడిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఒకపక్క తండ్రి అనారోగ్య సమస్యలు, తన ఆరోగ్య సమస్యలు, ఆర్థిక పరిస్థితి ఇవేమి అతడి కలను ఆపలేకపోయాయి కదూ..! మనసుంటే మార్గం ఉందన్నట్లుగా గ్రామీణ వాతావరణాన్ని ప్యాషన్‌కి వేదికగా ములుచుకుని ఫ్యాషన్‌ రీల్స్‌ చేయడం నిజంగా అద్భుతమే కదూ..!.

 

ఇదీ చదవండి: వైద్యురాలి నుంచి యోధురాలిగా..! అచ్చం సినిమాని తలపించే జీవితం ఆమెది..

 

Videos

తాడేపల్లి YSRCP పార్టీ ఆఫీస్ కూల్చివేత అంబటి స్టాంగ్ వార్నింగ్

జనసేన MLA చిర్రి బాలరాజు సన్నిహితురాలు సంచలన వీడియో

డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే..! ఫౌజీ నుంచి 3 నిమిషాల టీజర్..

ఏపీలో స్థానిక ఎన్నికలకు SEC రెడీ

Viral: చెన్నైలో షాకింగ్ ఘటన.. రోడ్డుపై భారీ గుంతలోకి దూసుకెళ్లిన కారు

జగ్గారెడ్డి దీక్ష.. రాజీనామా చేసే వరకు నా పోరాటం ఆగదు

సునీత కుటుంబానికి పదవులు? చంద్రబాబు ను కలవడానికి కారణం కూడా.. షాకింగ్ నిజాలు

YSRCP ఎమ్మెల్యే విరుపాక్షికి బెయిల్‌

వెనక్కి తగ్గిన కేంద్రం.. UPI చార్జీలు వాయిదా

YS జగన్ దృష్టిలో BC అంటే బ్యాక్ బోన్ క్లాసెస్

Photos

+5

రణబాలి మూవీ ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌లో స్పెషల్ మూమెంట్స్.. (ఫోటోలు)

+5

శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

జిమ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ దివి కసరత్తులు చూశారా?.. (ఫోటోలు)

+5

ది ప్యారడైజ్‌ ఏషనాగుల కట్టమీద సాంగ్‌ వర్కింగ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోలు

+5

విజయవాడ : విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

తల్లికి బంగారు పతకం, తండ్రి, కుమార్తెకు పీజీ డిగ్రీలు (ఫొటోలు)

+5

తెరపై చూసిన నానా కాదు.. ఈ విలక్షణ ఫొటోలు చూడండి!

+5

హైదరాబాద్ : భళా..సరస్‌ మేళా (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)