Breaking News

రొటీన్‌ వాకింగ్‌ కంటే అలా చేస్తే..బోలెడన్ని ప్రయోజనాలు.. !

Published on Fri, 06/06/2025 - 13:56

వాకింగ్‌ అంటే అందరు కామన్‌గా చేసేదే. అయితే ఈ వాకింగ్‌ మాత్రం చాలా విభిన్నమైనది. సంప్రదాయ వాకింగ్‌ కంటే మంచి ఫలితాలను పొందగలగుతారట. దీన్ని జపనీస్‌ వాకింగ్‌ అనిపిలుస్తారు. మరి ఆ నడక వ్యాయామం విశేషాలేంటో చూద్దామా..!. 

జనీస్‌ వాకింగ్‌ వ్యాయామం అంటే..
దీన్ని ఇంటర్వెల్‌ వాకింగ్‌ ట్రైనింగ్‌ (ఐడబ్ల్యూటీ) లేదా జపనీస్‌ వాకింగ్‌ అని కూడా పిలుస్తారు. ఇది ప్రత్యామ్నాయ విరామాలను కలిగి ఉంటుంది. మూడు నిమిషాల వేగవంతమైన నడక, మరో మూడు నిమిషాలు స్లో వాకింగ్‌. ఇలా కనీసం ఐదు విరామాల సెట్‌తో కూడిని వాకింగ్‌ చేస్తారు. 

మంచిదేనా అంటే..
ఇలా వేగవంతంగా, మళ్లీ చాలా నెమ్మదిగా చేసే వాకింగ్‌ విధానం గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందట. శారీరక ధృఢత్వాన్ని మెరుగుపరచడంలో, కండర బలాన్ని, గ్లైసెమిక్‌ నియంత్రణను అందిస్తుందట. వ్యాయామం చేయలేకపోతున్నా అని బాధపడేవారికి.. ఇది మరింత మేలు. అన్ని వయసుల వారికే కాదు వృద్ధులు సైతం హాయిగా ఈ విధానంలో వాకింగ్‌ చెయ్యొచ్చట. 

అంతేగాదు ఇది మంచిదేనా? కాదా అని జపనీస్‌ నిపుణులు సుమారు 63 సంవత్సరాల వయస్సు గల దాదాపు 200 మందిపై అధ్యయనాన్ని నిర్వహించగా మెరుగైన ఫలితాలను కనిపంచాయి. అందువల్ల ఇది సురక్షితమైనదని నమ్మకంగా చెబుతున్నారు నిపుణులు. అయితే బాగా వేగంగా వాకింగ్‌ చేసేటప్పుడు గాయాలు అయ్యే ప్రమాదం లేకపోలేదనేది కొందరి పరిశోధకులు వాదన. 

కలిగే లాభాలు..
రక్తపోటు తగ్గుతుంది
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మెరుగ్గా ఉంటాయి. 
బాడీమాస్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. 
కండరాలను బలోపేతం చేస్తుంది. 

ఎలా చేయాలంటే..
ఈ ఇంటర్వెల్‌ వాకింగ్‌ ట్రైనింగ్‌ అనేది సరిగా సాధనం చేయడంపైనే మెరుగైన ఫలితాలు అనేవి ఉంటాయట. మొదట సాధారణ వేగంతో నడిచి..ఆ తర్వాత ఓ 20 నుంచి 30 సెకన్లు వేగంగా నడవాలట. మళ్లీ ‍బ్రేక్‌ ఇచ్చి స్లోగా ఇలా ..కనీసం మూడు నుంచి ఐదు సెట్ల చొప్పున చేయాలట. ప్రారంభంలో 30 నిమిషాలు కేటాయించి.. ఆ తర్వాత నెమ్మదిగా ఈ విధానాన్ని పెంచుకోవాలట. 

అదీ కూడా మన బాడీ తత్వానికి అనుగుణం చేయాలట. ముఖ్యంగా సౌకర్యవంతమైన బూట్లను ధరించి చేయాలట. అంతేగాదు ఒకవేళ ఈ క్రమంలో తలనొప్పి, వికారం వంటివి వచ్చినట్లయితే వెంటనే ఆపేయాలని సూచిస్తున్నారు నిపుణులు. చాలామటుకు దీన్ని పిట్‌నెస్‌ నిపుణుల సమక్షంలో ఈ విధానాన్ని ప్రయత్నించడం మంచిదని చెప్పారు నిపుణులు. 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం మంచిది.

(చదవండి: ఆటో డ్రైవర్‌ స్టోరీ..! చిన్న ఐడియాతో నెలకు ఏకంగా రూ. 5 లక్షలు పైనే..)

 

#

Tags : 1

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)