Breaking News

నువ్వు ఎలాంటివాడవో చెప్పాలంటే, నీ మిత్రులెవరో చూపించు..

Published on Thu, 07/30/2026 - 08:24

సమాజంలో మనిషి ఒంటరిగా జీవించలేడు. అనుక్షణం పరిచయాలు, సంబంధాలు, స్నేహాలతోనే అతని జీవితం ముడిపడి ఉంటుంది. అయితే, మనం ఎవరితో కలుస్తున్నాం, ఎవరితో కాలాన్ని గడుపుతున్నామనే అంశమే మన ఆలోచనలను, ప్రవర్తనను, అంతిమంగా మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే ఇస్లామిక్‌ ధర్మం మంచి సాంగత్యాన్ని ఎంచుకోవడానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది.

పెద్దలు అంటారు ‘‘నువ్వు ఎలాంటివాడవో చెప్పాలంటే, నీ మిత్రులెవరో చూపించు’’ అని. ఇది కేవలం లౌకిక సత్యం మాత్రమే కాదు, దివ్యఖుర్‌ ఆన్‌ హదీసుల ఆత్మకూడా ఇదే!

అత్తరు తావి కావాలి!
చెడు ప్రభావం మనిషిపై ఒక్కసారిగా పడదు. కొవ్వొత్తి వెలుగు మాయమైనట్లు, అది నిశ్శబ్దంగా మనలోని మంచి గుణాలను హరిస్తుంది. ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు మంచి, చెడు సాంగత్యాల ప్రభావాన్ని ఎంతగానో హృదయానికి హత్తుకునేలా వివరించారు: ‘‘మంచి మిత్రుడు సుగంధ ద్రవ్యాల వ్యాపారి (అత్తరు అమ్మే వ్యక్తి) లాంటివాడు; అత్తరు వ్యాపారి దగ్గర ఉంటే అతడు నీకు సుగంధాన్ని బహుమతిగా ఇస్తాడు, లేదా నీవు కొనుగోలు చేస్తావు... కనీసం ఆ సువాసననైనా ఆస్వాదిస్తావు.’’ (సహీహ్‌ అల్‌–బుఖారీ)
చెడు అలవాట్లు, భావాలు ఉన్నవారి మధ్య గడిపితే ఎంతటి గట్టి మనస్కుడైనా ఏదో ఒక రోజు తప్పుదోవ పట్టే ముప్పు ఉంటుంది. అదే నైతిక విలువలు, దైవభీతి ఉన్నవారి సరసన ఉంటే మనలో నిశ్శబ్దంగా నైతిక పరిమళాలు వికసిస్తాయి.

సత్యవంతుల సహవాసం
‘‘ఓ విశ్వసించిన వారలారా! అల్లాహ్‌కు భయపడండి, సత్యవంతులతో (సజ్జనులతో) ఉండండి.’’ (దివ్య ఖుర్‌ఆన్‌ 9:119) మనిషి జీవన శైలి అతని మిత్రుని ప్రభావంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘మనిషి తన స్నేహితుడి మార్గంలోనే ఉంటాడు. కాబట్టి ఎవరితో స్నేహం చేస్తున్నారో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలి‘ (అబూ దావూద్‌) అని హెచ్చరించారు.

రేపటి పశ్చాత్తాపం వద్దు!
తాత్కాలిక లౌకిక ప్రయోజనాల కోసం లేదా వ్యసనాల కోసం చేసే స్నేహాలు పరలోకంలో తీరని నష్టాన్ని మిగులుస్తాయి. ఆనాటి పశ్చాత్తాపాన్ని దివ్య ఖుర్‌ ఆన్‌ ఇలా కళ్లకు కడుతోంది: ‘‘ఆ రోజు పాపాత్ముడు తన చేతులను కొరుక్కుంటూ... ’అయ్యో! నేను ఫలానా వ్యక్తిని నా మిత్రుడిగా చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేది!’ అని వా΄ోతాడు.’’ (దివ్యఖుర్‌ ఆన్‌  25:27–28)

అందుకే స్నేహంలో కొన్ని కీలకమైన నియమాలు పాటించాలి:
1. మితమైన స్నేహం: ఆత్మీయతలో సమతుల్యత ఉండాలి. రహస్యాలను, గతంలో చేసిన ΄÷రపాట్లను ఇతరుల ముందు విప్పకూడదు. తప్పులకు దేవుని సమక్షంలో పశ్చాత్తాపపడాలి (తౌబా చేయాలి) తప్ప, పబ్లిక్‌లో పరచడం వల్ల భవిష్యత్తులో అది బలహీనతగా మారుతుంది.
2. గృహ రక్షణ: మన అంతరంగ వలయం లోకి ధర్మనిష్ఠ గలవారినే రానివ్వాలి. రకరకాల అలవాట్లు ఉన్న సాధారణ పరిచయస్తులను ఇంటి పరిధికి దూరంగా ఉంచడం వల్ల కుటుంబంలో, పిల్లలలో మంచి సంస్కారం నిలుస్తుంది.

అద్దం లాంటి మిత్రుడు
సచ్ఛీలుడైన మిత్రుడు ‘అద్దం’ లాంటివాడు. అద్దం ముఖంపై ఉన్న మచ్చను ఏ అసూయా లేకుండా స్పష్టంగా చూపిస్తుంది. అలాగే నిజమైన మిత్రుడు మనలో లోపం ఉన్నప్పుడు దయతో, రహస్యంగా సరిదిద్దుతాడు. అటువంటి సద్విమర్శను అహంకారం విడిచి వినయంతో స్వీకరించడమే ఆత్మవికాసానికి తొలిమెట్టు.

విశాల ప్రపంచంలో వేలాది పరిచయాలు ఉండవచ్చు. కానీ మనల్ని దైవ మార్గంలో నిలబెట్టే, మన ప్రవర్తనను సన్మార్గంలో నడిపించే కొద్దిమంది ‘సజ్జనుల’ సాంగత్యమే మన నిజమైన సంపద. మన చుట్టూ ఉన్నవారిని ఒకసారి పరిశీలించుకుందాం... వారు మనల్ని వెలుగు వైపు నడిపిస్తున్నారా, లేదా అంధకారం వైపు గుంజుతున్నారా?
– ముహమ్మద్‌ ముజాహిద్‌

నిర్వహణ: డి.వి.ఆర్‌.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)