Breaking News

సెంటర్‌స్టోన్‌ డైమండ్‌రింగ్‌, లగ్జరీ గౌనులో ఇషా అంబానీ : ధర ఎంతో తెలుసా?

Published on Tue, 09/30/2025 - 16:43

యువ వ్యాపారవత్త, అంబానీ వారసురాలు ఇషా అంబానీ తన ఫ్రెండ్‌ పెళ్లిలో స్టైలిష్ దుస్తుల్లో  అందరి దృష్టిని ఆకర్షించింది. అలెశాండ్రో మిచెల్  డెబ్యూ వాలెంటినో కలెక్షన్‌కు చెందిన డిజైనర్‌ వేర్‌లో తళుక్కుమంది. ఆత్మవిశ్వాసం, హుందాతనంతో కూడిన అద్భుతమైన అందంతో తన తల్లి నీతా అంబానీలాగానే  లగ్జరీ అండ్‌ ఫ్యాషన్‌  స్టైల్లో  ప్రత్యేక  ఆకర్షణగా  నిలిచింది  ఇషా అంబానీ.

క్రీమ్‌ కలర్‌, పాస్టెల్ గ్రీన్  కలర్‌లో, అల్లికలు ,లేయర్డ్ రఫ్ఫ్లే ఎంబ్రాయిడరీ,  క్లాసిక్ లగ్జరీగా రూపొందించిన ఈ గౌను ఇషా సహజ సౌందర్యాన్ని హైలైట్ చేశాయి.  ఇంకా అద్భుతమైన పూల ఆకారపు డైమండ్ చెవిపోగులు, అందమైన బంగారు బ్రాస్‌లెట్ ,  అద్భుతమై సెంటర్‌  స్టోన్‌తో డైమండ్ రింగ్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది.

(పారిస్ ఫ్యాషన్ వీక్‌ : ఐశ్వర్యా డాజ్లింగ్‌ లుక్‌ వెనుకున్న సీక్రెట్‌ ఇదే!)

ఫ్యాషన్ ఐకాన్  ఇషా అంబానీ తన సన్నిహితులతో వేడుకలకు హాజరైంది.  దీని ధర  దాదాపు రూ. 5 లక్షలు.  అంబానీ ఫ్యామిలీ ఇన్‌స్టా పేజ్‌  ఇషా అంబానీ ఫోటోలను షేర్‌ చేసింది.  ఈ వెడ్డింగ్‌లో ఆమె  లుక్‌ మోడ్రన్‌  ఫ్యాషన్ అభిరుచిని ఆమె గ్లోబల్‌ స్టైల్‌ని సూచిస్తుందంటూ ఫ్యాన్స్‌ పొగిడేశారు. ఇటాలియన్ లగ్జరీ హౌస్ క్రియేటివ్‌ కలెక్షన్స్‌ సంచలనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. 

వాలెంటినో కలెక్షన్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.మరోవైపు ఇషా అంబానీకి వాలెంటినో కలెక్షన్‌ అంటే చాలా ప్రేమ. ఈ లగ్జరీ బ్రాండ్‌తో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది. తన పెళ్లి రిసెప్షన్ వేడుకలో వాలెంటినో లెహంగానే ధరించింది. ఈ ఫ్యాషన్ హౌస్ రూపొందించిన మొదటి లెహంగా ధరించడం, అనేక సందర్భాల్లో ఈ కలెక్షన్ దుస్తులకే ఆమె ప్రాధాన్యత. 

చదవండి: స్కూలు ప్రిన్సిపాల్‌ ఇంగ్లీషుకి బ్యాంకు అధికారులే ‘బౌన్స్‌’.. మీరూ చూడండి!

 

కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్-నీతా అంబానీల ఏకైక కుమార్తె ఇషా అంబానీ. ప్రస్తుతం రిలయన్స్‌రీటైల్‌ బాధ్యతల్లో విజయ పథంలో దూసుకుపోతోంది. 2018లో డిసెంబర్‌లో ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకుంది ఇషా.  ఈ జంటకు ఆదియా శక్తి, కృష్ణ కవల పిల్లలున్నారు. 
 

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?