Breaking News

Yoga సంపూర్ణ ఆరోగ్యం కోసం ఖర్చు లేని మందు, కానీ..!

Published on Fri, 06/20/2025 - 10:35

అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్‌ 21) సందర్భంగా‘సంపూర్ణ ఆరోగ్యానికి ఖర్చులేని మందు, మానసిక వికాస సిద్ధి, శరీరం – మనసు మధ్య సమతుల్య సాధనకు సహాయపడేది యోగాఒక్కటే’ అనే నినాదం మార్మోగుతోంది. విశాఖపట్నంలో యోగా ప్రధాన వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననుండడం మరో విశేషం. విద్యాలయాల్లో గతంలో ప్రతిరోజూ ఒక పీరియడ్‌ ‘డ్రిల్‌ క్లాసు’ కోసం కేటాయించేవారు. తొలుత పరు గుతో పాటు ఆపై అనేక క్రీడల్లో విద్యార్థు లకు శిక్షణ ఇవ్వడానికి పీఈటీ,ఎంపీఈడీ, బీపీఈడీ టీచర్లు, అధ్యాప కులు ఉండేవారు. ఆపై వేలాది మంది శిక్షకులు విద్యార్థులకు క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చే వారు. విద్యాలయాల్లో రానురాను వీరి నియామకాలు నిలిచిపోవడంతో, ఏకంగా పలు క్రీడాంశాలే మటు మాయమయ్యాయి.

గతంలో ప్రతి ఏటా జోన్, సెంట్రల్‌ జోన్, జిల్లా, రాష్ట్రస్థాయుల్లో జరిగే క్రీడాపోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనేవారు. ఇవి వారిలో పోటీతత్వాన్ని పెంపొందించేవి. ప్రస్తుతం జిల్లా స్థాయిలో మొక్కుబడిగా క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. వీటిలోనూ అనేక విద్యా లయాలకు కనీస ప్రాతినిధ్యం కూడా లభించడం లేదు. నేడు అనేక పాఠశాలలు, కళాశాలల్లో క్రీడాపరికరాలు సైతం మచ్చుకైనా కనిపించడం లేదు. ఇక విద్యాలయాల్లో వ్యాయామ విద్యకు చోటెక్కడున్నట్టు? అలాగే, ప్రభుత్వ గుర్తింపు పొందిన వేలాది పాఠశాలలు జానెడు ఖాళీ స్థలానికి కూడా నోచుకోని అపార్ట్‌మెంట్లలో నడుస్తున్నాయి. కచ్చితంగా ఆటస్థలం ఉండాలనే విద్యాశాఖ నిబంధనలున్నా, ఫలితం మాత్రం శూన్యం! 

ఇదీ చదవండి: Today Tips యోగాతో లాభాలెన్నో.. ఈ చిట్కాలు తెలుసా?

యోగా, వ్యాయామ విద్యల మధ్య పెద్దగా తేడాలేమీ లేవు. రెండింటిలోనూ శారీరక భంగిమలు 70 శాతం సమానం. వ్యాయామంలో తొలుత రన్నింగ్‌ ఉంటే, యోగాలో మెడిటేషన్‌ ఉంటుంది. రన్నింగ్‌ తర్వాత యోగా చేస్తే సత్ఫలితాలు ఉంటాయని నిపుణులు కూడా  చెబుతున్నారు. అయితే, ఆధునిక కాలానుగుణంగా వ్యాయామ విద్యలో అవసరమైన మార్పు–చేర్పులు చేసి, ఉన్నత పాఠశాలల్లోని ప్రతి విద్యార్థీ విధిగా నిత్యం ‘స్పోర్ట్స్‌ పీరియడ్‌’లో పాల్గొనేలా ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకోగలిగితే... యోగా ఉన్నత స్థాయికి చేరుకుంటుందని చెప్పడంలో సందేహించాల్సింది లేదు.

చదవండి: ఎయిరిండియా విషాదం : మానవత్వం చూపించిన రియల్‌ హీరో

– నిమ్మరాజు చలపతిరావు 
( జూన్‌ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)