Breaking News

International yoga day 2025 : ఆరోగ్య ‘యోగం’ ఇంతింత కాదయా

Published on Fri, 06/20/2025 - 10:11

వేగంగా మారుతున్న యుగంలో యువత ఎంతో ఒత్తిడి, అపరిమిత ఆందోళనల మధ్య జీవించాల్సి వస్తోంది. విద్య, ఉద్యోగపోటీలు, డిజిటల్‌ లైఫ్, సామాజిక ఒత్తిళ్ల మధ్య మానసిక, శారీరక ప్రశాంతత కోల్పోతుంటారు. ‘యువత జీవనవిధానంలో ఏర్పడిన భావోద్వేగ బ్లాకేజ్‌లను ఎలా తొలగించుకోవాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో యోగ ఒక శక్తివంతమైన  ఆయుధంగా పనిచేస్తుంది’ అని వివరిస్తారు యోగా ట్రైనర్‌ స్వప్న యోగాన్వేష్‌.

‘లండన్‌లో ఎంబీయే చేసి, కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలి, యోగాతో నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకున్నాను’ అని తెలిపిన స్వప్న హైదరాబాద్‌లో ఐదేళ్లుగా యోగా ట్రైన ర్‌గా రాణిస్తున్నారు. ‘‘ఇండియాకు వచ్చి, రిషీకేష్‌ వంటి యోగిక్‌ ప్లేస్‌లన్నీ సందర్శించాను. వారాంతంలో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి విద్యార్థులకు ఉచితంగా యోగా శిక్షణా తరగతులు తీసుకుంటుంటాను. సాధారణంగా యువతలో చాలా మంది జిమ్‌లకు వెళ్లడానికి ఆసక్తి చూపుతారు. అది శారీరక ఫిట్‌నెస్‌ కోసం ఉపయోగపడుతుంది. యోగా వ్యాయామం మాత్రమే కాదు. శరీరం, మనస్సు, ఆత్మ మూడింటినీ సమతుల్యంగా ఉంచే జీవన విధానం. ఈ కాలంలో యువత ఎక్కువ శాతం డిజటల్‌ మీద డిపెండ్‌ అయి ఉంటున్నారు. అన్ని విషయాల మీద చాలా నాలెడ్జ్‌ వచ్చింది. కానీ, చిన్ననాటి నుంచి రకరకాల ఎమోషనల్‌ బ్లాకేజీలు అంతర్గతంగా ఏర్పడి, వారితో పాటు ఎదుగుతుంటాయి. వీటి నుంచి రిలాక్స్‌ అవడానికి యోగా ఒక సాధనంలా ఉపయోగపడుతుంది. యోగా  ప్రాచీన భారత సంప్రదాయంలో భాగంగా వేల సంవత్సరాలుగా అభివృద్ధి చెంది ఉంది. పతంజలి వంటి ఎంతో మంది రుషులు, యోగులు యోగాను సాధన చేసినట్టుగా ్ర΄ాచీన భారతం మనకు చూపుతుంది. యోగా వల్ల లాభాలేంటి అని ప్రశ్నించే ఈ తరానికి చెప్పలేనన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.. 

 చదవండి: Today Tips యోగాతో లాభాలెన్నో.. ఈ చిట్కాలు తెలుసా?

తరగని గని యోగా! 
మనందరిలో ఫిజికల్, సైకలాజికల్‌ ట్రామా రెండూ ఉంటాయి. దైనందిన జీవనంలో శ్వాస తీసుకోవడం, వదలడం కూడా సరిగ్గా చేయడం లేదు. దీర్ఘ శ్వాస తీసుకోవడం, అంతే దీర్ఘంగా వదలడం వంటివి యోగా చేయడం వల్లే లభిస్తుంది. యోగాలో ప్రతి ఆసనం శ్వాసతో అనుసంధానించి ఉంటుంది. కొన్ని రోజులు క్రమం తప్పకుండా సాధన చేస్తూ ఉంటే తినే ఆహారం, నిద్రా సమయం కూడా క్రమ బద్ధం అవుతుంది. మొదలు పెట్టేప్పుడు ముందుగా శ్వాస యోగా నుంచి  ప్రారంభించాలి. అందుకు కపాభాతి వంటి శ్వాస యోగాసనాలు ఉన్నాయి. వారంలో రెండు రోజులు, మూడు రోజులు యోగా చేస్తే సరిపోదు. క్రమం తప్పకుండా చేయాలి. దీని వల్ల తలనొప్పి వచ్చినా.. ఎందుకొచ్చింది? ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఫుడ్‌ పరంగా ఎక్కడ మిస్టేక్‌ అయ్యింది? ఈ సందేహాలకు సమాధానాలు వెంటనే తెలిసిపోతాయి. కోపం, అసహనం, చిరాకు వల్ల బంధాలలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. యోగా సాధన వల్ల వ్యక్తిగత జీవితం, బంధాలు కూడా సెట్‌ అవుతాయి. అంతర్గత ఆనందం కలిగితే చెడు వ్యసనాల జోలికి ఎంత మాత్రం వెళ్లరు. 

కపాలబాతి, ప్రాణాయామం.. వంటి శ్వాస వ్యాయామాలు చేయడానికి 8 గంటల ముందు ఆహారం తీసుకోవాలి. అందుకే, యోగాను సూర్యోదయం సమయంలో ఖాళీ కడుపుతో చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మిగతా ఆసనాలకు కనీసం ఆహారం తీసుకోవడానికి మూడున్నర గంటల ముందు తీసుకోవాలి. లంగ్స్, లివర్, స్టమక్, కిడ్నీ, హార్ట్‌... మనం చేసే పనులలో ఈ ఐదు ఆర్గాన్స్‌ పనితీరు బాగుండేలా అడ్వాన్స్డ్‌ మెథడ్స్‌ ఉంటాయి. బ్రీతింగ్‌ టెక్నిక్స్‌ ఉంటాయి. ఇంటర్నల్‌ హీలింగ్‌ ద్వారా వీటిని సాధన చేయచ్చు.  – స్వప్న యోగాన్వేషి, యోగా ట్రైనర్, హైదరాబాద్‌
 

యోగాసనాలు శరీరాన్ని బలపరుస్తాయి. రక్తప్రసరణ మెరుగుపడి, హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. మన శరీరంలో ఉన్న ఏడు చక్రాల కుండలిని యాక్టివేట్‌ చేసి, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. 

  • ధ్యాన సాధన క్రమంగా చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. చదువులో, ఉద్యోగ జీవితంలో మెరుగైన ఫలితాలు
    ఇస్తుంది.

  • దృష్టి, ఏకాగ్రత పెరుగుతుంది∙మైండ్‌ఫుల్‌నెస్‌ (సంపూర్ణ శ్రద్ధతో జీవించడం) అభివృద్ధి చెందుతుంది.

  • డిప్రెషన్, ఆందోళన, అలసట వంటి సమస్యలు తగ్గుతాయి.

  • శ్వాసక్రియ( ప్రాణాయామం) వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

  • పొట్ట, తల, వెన్నెముక ఆరోగ్యంగా ఉంటాయి.

కేటాయించాల్సిన సమయం...

  • యోగాసనాల సాధనకు 45 నిమిషాల నుంచి గంటన్నర సమయం పడుతుంది. 

  • ప్రతి రోజు కనీసం 20–30 నిమిషాలు యోగాకు కేటాయించాలి 

  • యోగా అంటే కష్టమైన ఆసనాలు కాదు అది అందరూ చేయగలిగేది ∙

  • సరైన గురువు లేదా యాప్‌ సహాయంతో శాస్త్రీయంగా ప్రారంభించాలి 

  • యోగా అనేది యువతకు శారీరక ఆరోగ్యం, మానసిక స్థైర్యం, 

  • సామాజిక నైతికత అన్నింటినీ అందించే ఓ సంపూర్ణ మార్గం. 

  • యోగాకు వయస్సు అడ్డంకి కాదు, ముందు అడుగు వేయడమే ముఖ్యం

సోషల్‌ మీడియా డీటాక్స్‌: రోజంతా మొబైల్, స్క్రీన్‌ ముందు గడిపే యువతకు యోగా ద్వారా స్వీయ ఆత్మ పరిశీలన జరుగుతుంది. ఇది డిజిటల్‌ డీటాక్స్‌కు సహాయపడుతుంది. యువతలో స్థిరత్వం, ఓర్పు, విలువల పట్ల గౌరవం పెరుగుతుంది.

ఇదీ చదవండి: ఎయిరిండియా విషాదం : మానవత్వం చూపించిన రియల్‌ హీరో


 

-నిర్మలా రెడ్డి, 
సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు