తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2
Breaking News
Yoga విల్లులా వంగే పాలరాతి శిల్పం.. శిల్పా శెట్టి, వైరల్ వీడియో
Published on Sat, 06/21/2025 - 15:12
International Yoga Day 2025 అంతర్జాతీయ యోగా డే సందర్భంగా బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కుంద్రా (shilpa shetty) అద్భుతమైన యోగాసనాలు వేసింది. దీనికి సంబంధించి ఒక వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
బాలీవుడ్ బ్యూటీ క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తుంది. ఫిట్నెస్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే శిల్పా శెట్టి తన సోషల్ మీడియాలో, ఫిట్నెస్ యాప్లో యోగా, ధ్యానం, ఫిట్నెస్ వ్యాయామాలను పంచుకుంటుంది. తన అద్భుతమైన శరీరాకృతి, ఫిట్నెస్కు యోగానే కారణమని చాలా సార్లు వెల్లడించింది. తాజాగా యోగా డే సందర్భంగా ఇన్ష్టాలోషేర్ చేసిన వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.
50 ఏళ్ల వయసులో చాలా ఫిట్గా యంగ్ లుక్లో తన అభిమానులను మెస్మరైజ్ చేస్తుంది. శిల్పా తరచుగా తన అభిమానులతో విభిన్న యోగాసనాలు లేదా భంగిమల్ని పంచుకుంటూ , అభిమానులకు ప్రేరణనిస్తుంది.
ఇదీ చదవండి: జిమ్కి వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది..ఫేస్ గ్లో కోసం..!
Tags : 1