Breaking News

ఫోర్బ్స్‌ శిఖరం నుంచి రోడ్డు మీదకు! ఐనా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం...

Published on Wed, 10/14/2026 - 16:48

ఇటీవల యువత స్టార్టప్‌ల దిశగా అడుగులు వేస్తూ ఆకాశమంత విజయానికి బాటలు వేస్తున్నారు. ఒకరిని స్ఫూర్తిగా తీసుకుని మరొకరు స్టార్టప్‌ల వైపుకు వస్తున్నారు. విజయంతో పాటు కంటికి కనపడని చేదు నిజం, నమ్మశక్యం కాని కన్నీళ్లు ఉంటాయి. అవన్నీ తట్టకుని లేచి నిలబడే ధైర్యం ఉన్నవాళ్లకే ఇక్కడ చోటు అని ఈ బ్రిటన్‌ లాయర్‌ సోఫియా ఉదంతం చెబుతోంది. ఆకాశమంత ఎత్తుకు హిమాలయా శిఖరంలా ఎదిగింది..ఒక్కసారిగా అథఃపాతళానికి పడిపోయినా..ఆమె చూపిస్తున్న అసామాన్య ధైర్యం ప్రతిఒక్కరిని కదిలిస్తుంది. గెలిచినప్పుడే కాదే ఓడినప్పుడు కూడా అంతే గుండె నిబ్బరం ఉండాలని చెప్పే  కథ. 

యూకేకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సోఫియా పన్వార్‌. ఆమె లాస్కూల్‌ నుంచి న్యాయ విద్యను పూర్తి చేసిన తర్వాత ఆ వృత్తి వద్దంటూ స్టార్టప్‌ పెట్టాలనే కృత నిశ్చయంతో 2021 దుస్తుల బ్రాండ్‌ 'UNDR' (Unndr Lingerie) స్థాపించి సక్సెస్ అయ్యింది. అనతి కాలంలోనే కోట్లు కొద్దీ లాభాలు గడించి  ప్రతిష్టాత్మక 'ఫోర్బ్స్ 30 అండర్ 30' (Forbes 30 Under 30) జాబితాలో కూడా చోటు దక్కించుకుంది. ఆ ఉత్సాహంతో తన బ్రాండ్‌ని మరింత విస్తరించేలా చేయాలనుకుంది. కానీ ఆ ప్రయత్నంలో విఫలమై ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి.

ఎంతలా అంటే చివరికి తన వ్యాపారాన్ని మూసేవేస్తున్నట్లు ప్రకటించే పరిస్థితికి చేరుకుంది. ప్రస్తుతం తన వద్ద చిల్లిగవ్వ కూడా లేదంటూ.. తను ఎదుర్కొంటున్న పరిస్థితిన సోషల్‌ మీడియ వేదికగా చెప్పుకొచ్చింది. ఆ పరిస్థితిలో కూడా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో తన బాధను చెబుతూనే నిలదొక్కుకుంటాననే నమ్మకంతో మాట్లాడిన తీరుకి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. నిజంగా అలాంటి గడ్డు పరిస్థితుల్లో మళ్లీ లేచి నిలబడలేనేమో అనుకుంటాం, కానీ సోఫియా అలా భావించకపోవడం విశేషం.

అంతేగాదు క్లిష్టపరిస్థితుల్లో ఎదురవ్వుతున్న అవమానం, ఒంటరితనమే ఎక్కువ బాధిస్తున్నాయని కూడా వాపోయిందామె. తనది ఆర్థికపరమైన సమస్య కాదని..ఇంత దారుణమైన స్థితికి వచ్చానన్న భాదే జీర్ణం కావడం లేదని చెబుతోందామె. ఇతరులకు తన పరిస్థితి తెలిసిపోతుందనే భావన మరింత పీడిస్తుందని కూడా అంది. కానీ ఇప్పటికే నీకు అన్ని విషయాలు అర్థమై ఉండాలని చెప్పే అంతరాత్మ ప్రబోధ మరింత బాధపెడుతుందని అంటోంది. ప్రస్తుతం తాను యూకే యూనివర్సల్‌ క్రెడిట్‌పై బతుకుతున్నట్లు తెలిపింది. ఇది తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులకు, పనిచేయలేని వారికి నెలవారీ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ చెల్లింపులు గృహ ఖర్చులతో సహా, అవసరమైన జీవన వ్యయాలను భరించడంలో సహాయపడటానికి ఉద్దేశించినవి. 

ఆ సహాయంపైనే ఆధారపడి జీవితాన్ని వెళ్లదీస్తోంది సోఫియా. నిజానికి తన కథను ఆన్‌లైన్‌లో పంచుకోవాలా లేదా అని నెలలు తరబడి ఆలోచించానని కూడా చెప్పుకొచ్చింది. నిజానికి వ్యాపారంలో తిరిగి నిలదొక్కుని మంచి సక్సెస్‌ అందుకున్నాక మాట్లాడాలని అనుకుందట. అయితే సక్సెస్‌ అందుకున్నప్పుడూ ఎవ్వరైనా మాట్లాడగలరు, కానీ కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడూ అంత సాహసం చేయలేరు, అదే తాను చేసి చూపించాలనే ఇలా మీ ముందుకొచ్చి తన కథను వివరించానని పేర్కొంది. అయినా చాలామంది ఇలాంటి పరిస్థితినే నిశబ్దంగా ఎదుర్కొంటున్నారని, ఇప్పుడు తనకు అదే పరిస్థితి ఎదురైందని చాలా ధైర్యంగా చెప్పగలనని అందామె. 

చివరగా ఆశాభావంతో తన సంభాషణ ముగించి నెటిజన్ల మనసుని దోచుకుంది. తన జీవితంలో ప్రస్తుత దశని అసౌకర్యంగా వినయాన్ని నేర్పేదిగా వర్ణించింది. అయినా హృదయ విదారకంగ ఉన్న ఈ దశ తన కథలో కేవలం ఒక అధ్యాయమే అని తేల్చి చెప్పిందామె. కచ్చితంగా ఆకాశమంత సక్సెస్‌ని అందుకుంటానని పరోక్షంగా చెప్పకనే చెప్పింది సోఫియా. ఏదో ఒక దశలో ఎవ్వరికైనా ఈ పరిస్థితులు ఎదురవ్వడం సహజం ఎలా స్పందిస్తామనేది ముఖ్యం. అది మనల్ని విజయ తీరాలకు చేర్చకోపోయినా..లేచి నిలబడే శక్తిని తప్పక అందిస్తుంది కదూ..!.

 

ఇదీ చదవండి: Success Story: జస్ట్‌ రూ.2 వేలుతో ప్రారంభించి..రూ. 580 కోట్ల బ్రాండ్‌..! ఏకంగా 30కి పైగా దేశాలకు..)

 

#

Tags : 1

Videos

ఇండియా VS వెస్టిండీస్.... ఉప్పల్ కు పోటెత్తిన ఫ్యాన్స్!

YSRCP నేత ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకల్లో YS జగన్

అన్ని పోలింగ్ స్టేషన్స్ లో CCTV పెట్టలేం... క్లారిటీ ఇచ్చిన AP ఎలక్షన్ కమీషనర్

సాయి పల్లవి 2.0 కల్కితో స్టార్ట్...

జగన్ కేసులపై బ్రేకింగ్ న్యూస్ లా ఎల్లో మీడియా విష ప్రచారం

సమరానికి సై... ఓట్ల తొలగింపు.. SIRపై SEC ఏమన్నారంటే!

OpenAI రహస్య కుట్ర.. ఇంజినీర్ పైనే అనుమానాలు?

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

బుద్ధిలేని గేమ్.. హౌస్ లో మరో బిగ్ ట్విస్ట్

ఏపీ లోకల్ ఫెట్ మూడు దశల్లో మున్సిపల్ ఎన్నికలు

Photos

+5

వియత్నాం ట్రిప్ ఫుల్‌గా ఎంజాయ్ చేసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత ఫొటోషూట్ (ఫొటోలు)

+5

డోంట్ స్లీప్ మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

పూల డ్రస్‌లో శ్రీముఖి.. ‍గ్లామర్ రచ్చ (ఫొటోలు)

+5

'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లైట్ కలర్ శారీలో అనసూయ గ్లామర్.. (ఫోటోలు)

+5

తిరుమల : సింహ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు దర్శనం (ఫొటోలు)

+5

రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. విరోష్ జంట క్యూట్‌ మూమెంట్స్ (ఫోటోలు)

+5

'ఆలియాస్ రుక్మిణీ'గా ఆఫియా సయ్యద్.. ఈమె ఎవరంటే? (ఫొటోలు)

+5

‘గరివిడి లక్ష్మి’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ (ఫొటోలు)