Breaking News

ఆ చెప్పులు మన వారసత్వ కళ..ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ఏకంగా..!

Published on Thu, 06/26/2025 - 12:03

మనవాళ్లు ఎప్పుడో కళాత్మకంగా రూపొందించినవి కొన్ని రకా ఫ్యాషన్‌ బ్రాండ్‌లు కాపీ కొట్టేసి మార్కెట్లోకి రిలీజ్‌ చేసి ధర నిర్ణయిస్తుంటే కళ్లప్పగించి చూస్తుంటాం. ఇది మన పూర్వీకుల నుంచి వచ్చిన వారసత్వ కళ అని గుర్తుకు రాదు. లేటెస్ట్‌ ఫ్యాషన్‌ ట్రెండ్‌ అనగానే..డబ్బులు వెచ్చించేయడమే గానీ..అదేంటని నిశితంగా ఆలోచించేవారే కరువు. అందువల్లే కాబోలు ప్రముఖ లగ్జరీ బ్రాండ్‌లు మన ఆర్ట్‌ని సులభంగా కాపీ కొట్టేస్తున్నాయి. అచ్చం అలానే ఓ దిగ్గజ ఇటలీ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ఎంత పనిచేసిందో వింటే విస్తుపోతారు.

కొల్హాపూర్‌ లెదర్‌ చెప్పులు చాలా ప్రసిద్ధిగాంచినవి. ముఖ్యంగా పెద్దవాళ్ల హుందాతనం ఉట్టిపడేలా చేసేలా ఉంటాయి ఆ చెప్పులు. కొల్హాపురి ఫ్లాట్‌ చెప్పులుగా బాగా ఫేమస్‌. అయితే వాటిని ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ ప్రాడా సమ్మర్ 2026 56 రన్‌వే లుక్‌లలో అచ్చం మనలాంటి పాదరక్షలనే ప్రదర్శించింది. అచ్చం మన కొల్హాపురి చెప్పులు మాదిరిగా ఉన్నాయి. 

అయితే ఆ లగ్జరీబ్రాండ్ వాటి ధర ఏకంగా అక్షరాల రూ. 1.2 లక్షలుగా నిర్ణయించడం విశేషం. ఈ లగ్జరీ బ్రాండ్‌ మన వారసత్వానికి ఎలాంటి క్రెడిట్‌ ఇవ్వకుండా తానే డిజైన్‌ చేసినట్లుగా ఫోజులు కొడుతూ..అంత ఖరీదు నిర్ణయించడంతో సర్వత్రా ఆగ్రహాం వ్యక్తమైంది. నెట్టింట అందుకు సంబధించిన ఫోటోలను ఆ బ్రాండ్ వైరల్‌ చేయడంతో నెటిజన్లు  ఇది "చప్పల్‌ చోరి" అంటూ తింటూపోస్తున్నారు. 

ఫ్యాషన్‌ సంస్కృతికి తప్పుడు అర్థాన్నిచ్చేలా చేసిందంటూ మండిపడుతున్నారు. కనీసం భారతీయ వారసత్వ కళను ప్రశంసిస్తూ..వాటిని ప్రదర్శించినా..మా కళ మళ్లీ పునరుజ్జీవనం చేసుకుంటుందని సంతోషించేవాళ్లం అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. 

కొల్హాపురి చెప్పుల చరిత్ర...
12వ శతాబ్దానికి చెందిన వారసత్వ కళ. ఇది సాంప్రదాయకంగా మహారాష్ట్ర, కర్ణాటకలోని చెప్పులు కుట్టేవారి చేతిల్లో రూపుదిద్దుకున్న కళ ఇది. ఈ కొల్హాపురి చెప్పులకు జీఐ ట్యాగ్ కూడా ఉంది. ఇది మన భారతీయ వారసత్వంలో భాగం. ఆ కాలంలోనే మన పూర్వీకులు ధరించిన చెప్పులివి. వీటిని తయారు చేయడానికి ఆరువారాలపైనే పడుతుందట. వీటి ధర రూ. 500 నుంచి రూ. 700ల మధ్య ఉంటుందట. 

కాగా, దీనిపై ప్రముఖ కాలమిస్ట్‌ శోభా దే కూడా మండిపడ్డారు. ఈ బ్రాండ్లు మన భారతదేశాన్ని ఒక మార్కెట్‌గా చూస్తున్నాయని విమర్శించారు. ఒకరంగా ఇది చేతిపనుల నైపుణ్యాలన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన ప్రాముఖ్యతను హైలెట్‌ చేసింది. అలాగే మన మూలాలను మర్చిపోకుండా గుర్తు చేసింది. ఫ్యాషన్‌ ట్రెండ్‌గా పరిచయం చేసిన ఈ చెప్పులు మన కళా వారసత్వానికి ప్రతీకలని గొంతెత్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.  

 

(చదవండి: 22వేల కోట్ల బ్యాంక్‌ బ్యాలెన్స్, అతిపెద్ద ప్యాలెస్‌.. ఐనా ఆమె స్టిల్‌ బ్యాచిలర్‌..!)

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)