Breaking News

దిండు ఖరీదే రూ. 40 వేలా..! స్పెషా​ల్టీ ఇదే..

Published on Fri, 11/06/2026 - 15:57

ఇటీవల కాలంలో మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్ల వాడకం ఎక్కువై చిన్న, పెద్ద అనే తేడాలేకుండా అందరు మెడకి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా స్క్రీన్ల సమయం అధికమై కేవలం కంటి చూపుని కాదు..అన్నింటికంటే ప్రధానమైన మెడ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇది మన నిద్రనాణ్యతపై ప్రభావం చూపి పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్యులు సైతం హెచ్చరిస్తుంటారు. అయితే రోజువారీ జీవితంలో భాగమైన ఆ గాడ్జెట్లు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేం.  పైగా అందుకు తగ్గట్టుగా ఏదో ఒక వెసులుబాటు చూసుకుంటామే గానీ తగ్గదే లే, ఆ అలవాట్లు మానుకునేదే లే అనే వాళ్లే ఎక్కువయ్యారు. ఇదంతా ఎందుకంటే ఇక్కడొక మహిళ అచ్చం ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటూ పైగా ఏం పనిచేసిందో తెలిస్తే నోరెళ్లబెడతారు. 

విపాన్‌దీప్‌ కౌర్‌ అనే చార్టర్డ్‌ అకౌంటెంట్‌ కూడా మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ కారణంగా విపరీతంగా మెడ సమస్యలు ఎదుర్కొంటోంది. అది కాస్తా ఆమె నిద్రపై ప్రభావం చూపి నిద్రలేని రాత్రుళ్లు గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఆమెకు నిద్ర అంటే మహా ఇష్టం. ఎలాగైన ఈ సమస్యకు చెక్కుపెట్టాలని   అనుకుంది. ఈలోగా అనుకోకుండా జపాన్‌ పర్యటనకు వెళ్లింది. ఆ పర్యటనలో ఉండగా..ఆమె హోన్‌బాషిలోని 400 ఏళ్ల నాటి 'నిషికావా' (Nishikawa) అనే జపనీస్ ప్రసిద్ధ బెడ్డింగ్ బ్రాండ్ దుకాణంని సందర్శించి అక్కడ ఒక దిండుని కొనుగోలు చేసింది. 

ఆ దిండు అలాంటి ఇలాంటి పిల్లో కాదు. అంత ప్రత్యేకత ఏముందంటే..మంచి నిద్ర కోసం ప్రత్యేకంగా తయారు చేసిన దిండు అట. కస్టమర్‌కి ఏ రకమైన వస్త్ర బెటర్‌..అతడి శరరీ భంగిమ ఎలా ఉంటుంది, ఎన్నాళ్ల నుంచి మెడ సమస్యలు ఎదుర్కొంటున్నాడు..ఇవన్నీ బేరీజు వేసుకుని మరి డిజైన​ చేస్తారట ఈ దిండుని. సింపుల్‌గా చెప్పాలంటే మన నిద్ర అలవాట్లకు అనుగుణంగా డిజైన్‌ చేసిన దిండు అట. దీని ఖరీదు అక్షరాలు రూ. 40వేలట. నిద్ర నిపుణులు పర్యవేక్షణలో దీన్ని తయారు చేస్తారట. మన ఎత్తు, అలవాట్లు, కావల్సిన కొలతలు ఆధారంగా దిండు తయారీ ప్రక్రియని ప్రారంభిస్తారట. 

ఈ దిండులో 'బ్లాక్ బిన్చోటాన్ చార్‌కోల్ పైప్ బీడ్స్' (black Binchotan charcoal pipe beads) ఉంటాయట. వీటిని దిండులో నింపడం వల్ల నిద్ర మరింత సౌకర్యవంతంగా ఉండటమే గాక శరీర భంగిమ మెరుగుపడుతుందట. ఆ విషయాన్నే ఈ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ కౌర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ..తాను మంచి దానిపైనే పెట్టుబడి పెట్టాను కదూ..అని అడిగింది. అయితే నెటిజన్లు మాత్రం ఆ అలవాట్లు మానుకుంటే సరికదా..! ఇంత ఖర్చు అవసరమా? అని ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టగా, కొందరు మాత్రం మా వద్ద కూడా అన్ని డబ్బులుంటే కచ్చితంగా కొనుగోలు చేసేవాళ్లమని అన్నారు.

 

ఇదీ చదవండి: వజ్రాల తళుకులు..క్రిస్టల్‌ బ్లౌజ్‌ మ్యాజిక్‌! అందరి దృష్టి నీతా అంబానీ పైనే..

 

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)