Breaking News

క్యాష్‌ కొడితేనే పెళ్లి భోజనం!

Published on Thu, 09/17/2026 - 09:04

మన దగ్గర పెళ్లి తంతు పూర్తవగానే.. కళ్లు చూసేది భోజనాల వైపే. కానీ దక్షిణ కొరియాలో మాత్రం అలా డైరెక్ట్‌గా భోజనానికి వెళ్లడానికి వీల్లేదు. డైనింగ్‌ రూమ్‌కి ముందుండే సెక్యూరిటీ గార్డు.. ద్వారపాలకుడిలా అమాంతంగా ఆపేస్తాడు. భోజనం చేయడానికి వీల్లేదని నిర్దయగా చెప్పేస్తాడు. ‘కానుక ఇచ్చుకో .. కంచం పుచ్చుకో’ అని హుకుం జారీ చేస్తాడు. 

అదీనూ ఏదో ఒక గిఫ్ట్‌ కాదూ.. కచ్చితంగా క్యాషే ఇవ్వాలని ఆర్డర్‌ వేసేస్తాడు. క్యాష్‌ ఇచ్చి.. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తరువాతనే టోకెన్‌ ఇస్తాడు. దక్షిణ కొరియాలో ఉన్న ఈ వింతైన వివాహ సంస్కృతి గురించి తాజాగా ఓ భారతీయ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. కవర్‌లో క్యాష్‌ ఉంటేనే భోజనం అనే ఈ సంస్కృతిని కొరియన్‌ల భాషలో ‘చుగిగుమ్‌’ అని పిలుస్తారు. 

పెళ్లికి వచ్చిన అతిథులు ముందుగా ఓ ప్రత్యేకమైన డెస్క్‌ వద్ద తమ క్యాష్‌ కవర్‌ను అందించి తమ పేరు నమోదు చేసుకుంటారు. ఆ తరువాతే వివాహ వేడుకలోపా ల్గొంటారు. అయితే ఎన్నో ఏండ్లుగా వస్తున్న ఈ ఆచారం వెనుక ఒక గొప్ప ఆలోచన ఉంది. గిఫ్ట్స్‌ రూపంలో కాకుండా డబ్బులు ఇవ్వడమే.. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న జంటకు తోడ్పాటునిస్తుందన్నదే ఆ ఆలోచన. అంటే వారిచ్చే డబ్బే వారి కొత్త ఇంటికి అవసరమైన వస్తువులు, ఇతర ఖర్చులు వంటి వాటికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. 

అందుకే తమకు నచ్చిన వస్తువు కొనడం కంటే, అవసరానికి తగ్గట్టు ఖర్చు చేసుకునే అవకాశం ఇవ్వడం కొరియన్‌ల సంస్కృతిలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే చుగిగుమ్‌లో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఎవరు తమ పెళ్లికి ఎంత ఇచ్చారో గుర్తుంచుకోవడం. భవిష్యత్తులో అతిథుల ఇంట్లోనూ పెళ్లి జరిగినప్పుడు తగిన మొత్తంలో తిరిగి ఇవ్వాలనే సామాజిక ఆనవాయితీ కూడా ఉంది. 

అయితే కాలంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఈ పద్ధతిలో ఇప్పుడిప్పుడే మార్పులు ప్రారంభమయ్యాయి. అంటే డిజిటల్‌ పేమెంట్ల ద్వారా కూడా కానుకలు పంపే పద్ధతి నెమ్మదిగా విస్తరిస్తోందంట. ఏది ఏమైన ప్పటికీ ఈ గమ్మత్తైన ఆచారం వివాహం జరిపే కుటుంబాలకు, వివాహం చేసుకుంటున్న దంపతులకు ఆర్థిక తోడ్పాటుని అందిస్తూ.. అండగా నిలుస్తోంది.    

 (చదవండి:  గాఢంగా నిద్రపోతే... 3.76 లక్షలు!)

 

Videos

APలో ఉన్నది ఎల్ నినో కాదు.. ఎల్లో నినో ఎఫెక్ట్.. YS జగన్ కౌంటర్

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములపై విచారణ.. రంగంలోకి రెవెన్యూ అధికారులు

‘దేశ సేవకు మరింత శక్తి కలగాలి’.. ప్రధాని మోదీకి జగన్‌ విషెస్‌

రోహిత్ & వంశీ మధ్య బిగ్ ఫైట్ కెప్టెన్‌గా చరణ్..!

కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడానికి ఎలా వస్తున్నాయి..? డబ్బులు లేవని చెప్పడానికి సిగ్గులేదా..!

మధుకర్ మహా మాయగాడు నందు కేసులో కొత్త ట్విస్ట్..!

పోరాటం ఫలించింది.. సాక్షి టీవీ దెబ్బకు దిగొచ్చిన కూటమి సర్కార్‌

సాయికృష్ణ కేసులో మరో నిందితుడు సరెండర్

PM Modi: బెంగాల్ మహిళలకు గుడ్ న్యూస్

మల్లారెడ్డిపై బీఆర్‌ఎస్‌ నేతల తిరుగుబాటు? ఫ్లెక్సీలు చించివేత

Photos

+5

పదేళ్ల ప్రేమ.. పెళ్లి చేసుకున్న హీరోయిన్ (ఫొటోలు)

+5

సందడిగా సమంత సీమంతం వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్ : అబ్బా భలే ఉన్నాడే... గణేశుడు (ఫొటోలు)

+5

'ధురంధర్' భామ ఆయేషా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఆషికా.. బార్బీ డాల్‌కి ఏం తక్కువ కాదు! (ఫొటోలు)

+5

అందంతో టాప్ లేపిన మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఫ్యాన్స్‌ ఫైట్‌ చేస్తుంటే.. స్టార్స్‌ ఏం చేస్తున్నారో చూడండి! (ఫొటోలు)

+5

ఘనంగా ‘సైమా అవార్డ్స్ 2026’ సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి తొలిపూజకు వేళాయే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి (ఫోటోలు)