Breaking News

మన అమెరికన్‌

Published on Tue, 04/07/2026 - 03:36

స్టూడెంట్‌ లీడర్‌గా జాత్యహంకారంపై పోరాడిన రిని సంపత్‌కు సమస్యల మూలాలు తెలుసు. ఆ సమస్యలపై అలుపెరగని పోరాటం తెలుసు. ‘నేను వలస ప్రజల బిడ్డను’ అని గర్వంగా చెప్పుకునే రినికి ఆత్మగౌరవ నినాదం తెలుసు. తమిళనాడులోని తేనిలో జన్మించిన 31 ఏళ్ల రిని సంపత్, వాషింగ్టన్‌ డీసీ మేయర్‌ ఎన్నికల బరిలో నిలిచిన మొట్టమొదటి దక్షిణాసియా మహిళగా నిలిచారు.

ఏడు సంవత్సరాల వయసులో రిని సంపత్‌ తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వెళ్లారు. ‘యూనివర్శిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా (యుఎస్‌సి)లో చదువుకున్న రిని విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. యుఎస్‌సీ అధ్యక్షురాలిగా విద్యార్థుల సమస్యలపై పోరాడారు. వారి హక్కుల కోసం నినదించారు. జాత్యహంకారాన్ని, వేధింపులను వ్యతిరేకించారు.

వారే నిజమైన అర్హులు
డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన రిని సంపత్‌ ప్రభుత్వ కాంట్రాక్టర్‌.  ప్రాథమిక అవసరాలు తీర్చండి’ ‘ఒక కొత్త డీసీ’ నినాదాలతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ‘నగరవాసులకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడం, వినాశకరమైన మురుగునీరు పొంగి పొర్లడాన్ని ఆపడం, గుంతలను పూడ్చడం, ధరలను తగ్గించడం అనేవి నా ప్రాధాన్యత అంశాలు. వాషింగ్టన్‌ డీసీని అందరికీ ఉపయోగపడేలా చేస్తాను. తమ వాగ్దానాలను నిలబెట్టుకునేవారే మేయర్‌ పదవికి అర్హులు’ అని తన ప్రచార వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు రిని. వాషింగ్టన్‌ డీసీని ప్రధానంగా డెమొక్రాట్లు పాలిస్తున్నారు. 1975లో మేయర్‌ పదవికి ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుండి రిపబ్లికన్‌ మేయర్‌గా ఎవరూ ఎంపిక కాలేదు.

ఇదే సరిౖయెన సమయం
తాను రాజకీయనాయకురాలు కాదని నొక్కి చెబుతుంటారు రిని. ‘నేను సంప్రదాయ రాజకీయ నాయకురాలిని కాదు. నేను ఒక ఫెడరల్‌ కాంట్రాక్టర్‌ని. నా వృత్తిజీవితమంతా ప్రభుత్వ కార్యక్రమాలలో, పౌర సేవలను మెరుగుపర్చడంలో గడిపాను.

మనకు ఒక కొత్త వ్యక్తి కావాలి
నగరానికి సేవలను అందించడంపై అవిశ్రాంతంగా దృష్టి సారించే వ్యక్తికి ఇది సరిౖయెన సమయం. అందుకే నేను మేయర్‌ రేస్‌లో ఉన్నాను. మనం కలిసి పనిచేసి, మెరుగైన డీసీని నిర్మించగలమని నమ్ముతున్నాను’  అని ప్రజలను ఉద్దేశించి అంటున్నారు రిని.

విజయానికి స్పష్టమైన మార్గం
ఫిబ్రవరి ఆరంభంలో వచ్చిన మంచుతుఫాన్‌ సమయంలో ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు రాలేకపోయారు. వికలాంగులు ఎక్కడో ఒకచోట చిక్కుకుపోయారు. నిత్యావసర సేవలు అందలేదు. ఉద్యోగులు రకరకాలుగా సమస్యలు ఎదుర్కొన్నారు. తన ప్రచారయాత్రలో ఆనాటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు రిని.

‘విజయం సాధించడానికి మనకు స్పష్టమైన మార్గం ఉంది. కేవలం నాలుగు వారాల్లోనే డీసీ చరిత్రలో మేయర్‌ బ్యాలెట్‌కు స్థానం సంపాదించిన మొట్టమొదటి దక్షిణాసియా అభ్యర్థిగా నిలిచాము. తక్కువ వనరులతో, ప్రజల మద్దతుతో సాగిన ప్రచారం ఇంతటి విజయాన్ని సాధించింది. నగరవ్యాప్తంగా ప్రతి ఓటరును చేరుకోవడానికి అవసరమైన వనరులు మనకు సమకూరి ఉంటే ఇంకా పెద్ద విజయం సాధించవచ్చు’ అంటున్నారు రిని సంపత్‌.    

చారిత్రక మైలురాయి
మేయర్‌ ప్రైమరీ ఎన్నిక జూన్‌ 16న జరగనుండగా, సాధారణ ఎన్నిక నవంబర్‌ 3న జరగనుంది. అమెరికా రాజకీయాలలో ప్రాతినిధ్యానికి సంబంధించి రిని ప్రచారం చారిత్రక మైలురాయిగా నిలవనుంది. ఉన్నత స్థాయికి ఎంపికైన పదవులలో భారతీయ అమెరికన్‌లకు తక్కువ ప్రాతినిధ్యం ఉంది. వారి రాజకీయ భాగస్వామ్యం పెరుగుతున్న తరుణంలో మేయర్‌ బరిలో రిని సంపత్‌ నిలవడం విశేషంగా మారింది. మేయర్‌గా ఎన్నికైతే ఆమె డీసీ చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కురాలైన మేయర్‌ అవుతారు. చిన్న వయసులోనే అమెరికాకు వెళ్లినా తన మూలాలను ఎప్పుడూ మరచిపోలేదు రిని. ‘మా తాతగారు ఎప్పుడూ నాకు చోదకశక్తిగా, స్ఫూర్తితేజంగా ఉన్నారు’ అంటారు.

ఆ శక్తి ఏమిటో నాకు తెలుసు
వాషింగ్టన్‌ డీసీ మేయర్‌ పదవికి బ్యాలెట్‌లో చోటు దక్కించుకున్న మొట్టమొదటి దక్షిణాసియా వ్యక్తిని కావడం సంతోషంగా ఉంది. అమెరికా కలను సాకారం చేసుకోవాలనే తపనతో తల్లిదండ్రులతో కలిసి ఏడేళ్ల వయసులో అమెరికాకు వచ్చాను. వలసదారుల కుమార్తెగా, కఠోర శ్రమ, పట్టుదలల శక్తి ఏమిటో నాకు తెలుసు. ఆ విలువలని నగర పాలక సంస్థ(సిటీ హాల్‌)లోకి తీసుకు రావడానికి, వాషింగ్టన్‌ వాసులందరికీ సత్ఫలితాలు అందించడానికి ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నాను. డీసీ మేయర్‌ పదవికి నన్ను బ్యాలెట్‌లో చేర్చడానికి నా పిటిషన్‌పై 4,500 మందికి పైగా సంతకాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. మన ఆర్థిక వ్యవస్థకు దక్షిణాసియా ప్రజల సహకారం ఎంతో ఉంది. కానీ ప్రభుత్వంలో వారికి చాలా తక్కువ ప్రాతినిధ్యం ఉండటం విచారకరం.
– రిని సంపత్, మేయర్‌ అభ్యర్థి, వాషింగ్టన్‌ డీసీ

Videos

శభాష్ జగన్ అంటున్న కూటమి నేతలు..

మావిగన్ పేరెత్తగానే ఎందుకు అంత భయపడుతున్నారు?

RK అక్షర వ్యభిచారం..! శవాలపై చిల్లర ఏరుకోడానికి కూడా సిద్ధం

చంద్రబాబు నోటికి ప్లాస్టర్ రెచ్చిపోతున్న దగ్గుబాటి ప్రసాద్..

పచ్చ నేతల రౌడీయిజం 3 కోట్ల NRI భూమి కబ్జా

ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకున్నాడు చంపేశాడు

తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం

శత్రుదేశంలో ఉన్న పైలట్ ను ఎలా కాపాడారు.. ఎన్ని ఆయుధాలు వాడారంటే

RBI బంపర్ ఆఫర్.. బ్యాంక్ ఎఫ్ డీలకు మించి వడ్డీ..!

జీతంలో కోత పంచాయతీ కార్యదర్శులకు బిగ్ షాక్

Photos

+5

శోభితలో ఈ టాలెంట్‌ కూడా ఉందా! (ఫోటోలు)

+5

అప్పుడే ఏడేళ్లు.. ఎంత త్వరగా ఎదుగుతున్నావో!: లాస్య మంజునాథ్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా 'లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)

+5

శేష్‌-మృణాల్‌ ‘డెకాయిట్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. రష్మిక చిన్నప్పటి క్యూట్‌ ఫోటోలు

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 05-12)

+5

ఉప్పల్‌లో క్రికెట్‌ ఉత్సాహం (ఫొటోలు)

+5

చిరు, దిల్‌రాజు భార్యలు అతిథులుగా కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)