Breaking News

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా క్యూట్‌ లవ్‌ స్టోరీ..! ప్రియతమ ఈ జర్నీలో..

Published on Wed, 06/25/2025 - 17:41

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station) (ఐఎస్ఎస్) వైపుకు ఈ రోజే(బుధవారం జూన్‌ 25)చేరుకోనున్నారు. ఈ యాక్సియం స్పేస్ సంస్థ చేపడుతున్న యాక్సియం-4 (AX-4) మిషన్‌లో శుభాంశు కీలక పాత్ర పోషించనున్నారు. నాసా ప్రకటన ప్రకారం, ఈ ప్రయోగం ఈ రోజు మధ్యాహ్నం 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రారంభమైంది. ఈ ప్రయోగం విజయవంతమైతే, గురువారం సాయంత్రం 4:30కి వ్యోమనౌక ఐఎస్ఎస్‌తో డాకింగ్ కానుంది. మన భారతీయ వ్వోమగామి ఈ ప్రతిష్టాత్మక మిషన్‌లో భాగం కావడంతో యావత్తు దేశం సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. ఈనేపథ్యంలో ఆయన కుటుంబ నేపథ్యం, లవ్‌స్టోరీ గురించి తెలుసుకుందామా..!.

ఆయన బుధావారం మధ్యాహ్నం ఫాల్కన్ 9 రాకెట్  రాకెట్‌ లాంచ్‌ అవ్వడానికి కొన్ని గంటల ముందు తన భార్య కోసం ఒక భావోద్వేగమైన లేఖ రాశారు. అదులో తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ..తన ప్రయాణంలో నువ్వులేని లేటుని భర్తీ చేయలేనిది అని భావోద్వేగంగా రాశారు. దానికి శుభాంశు భార్య కామ్నా గర్వంతో కూడిన ప్రేమతో స్పందించారు. 

ఈ క్రమంలోనే వారి ప్రేమ కథ తెరపైకి వచ్చింది. కామ్నా దంత వైద్యురాలు. ఆమెతో శుభాంశుకి దశాబ్దాల ప్రేమ బంధం ఉంది. వారిద్దరు మొదట లక్నోలోని ప్రాథమిక పాఠశాలలో కలుసుకున్నారు. అప్పటి నుంచి వారు మంచి స్నేహితులుగా ఉండేవారు. ఆయన తరగతి గదిలో అత్యంత సైలెంట్‌గా ఉండేవాడిని. ఒక్కమాటలో చెప్పాలంటే సిగ్గరి. అలాంటి వ్యక్తి జాతీయ స్థాయిలో ప్రేరణగా నిలవడం ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుందన్నారు. తమ విద్యా రంగాల దృష్ట్యా వేరైనా క్షణాలు ఎన్నో ఉన్నాయి. అయినా మా మధ్య ప్రేమ అలానే స్వచ్ఛంగా ఉంది. 

బహుశా అదే మమల్ని పెళ్లి పీటల వరకు వచ్చేలా చేసి ఉండొచ్చు. శుభాంశు కెరీర్‌ పరంగా ఎన్నో ఎడబాటులను తట్టుకుని నిలిచిన అపూర్వ ప్రేమ మాది అని కామ్నా సగర్వంగా చెప్పారు. అయితే తమ కొడుకు తన తండ్రితో గడిపే క్షణాలను కోల్పోడం మాత్రం ఇప్పటికీ బాధగానే ఉంటుంది. ఎన్ని బాధ్యతలున్నా..అతడి ఫోకస్‌ అచంచలంగా ఉంటుదని కీర్తించారు. అంతేగాదు శుభాంశు దృఢ సంకల్పాన్ని మహాభారతంలోని అర్జునుడితో పోల్చారామె. ఆయన మంచి ఏకాగ్రతతో స్పష్టమైన వైఖరి ఉన్న వ్యక్తిత్వం గలవాడని చెబుతున్నారు కామ్నా. 

ఫైటర్ జెట్ల నుంచి అంతరిక్షం వరకు చేరుకున్న అతడి కెరీర్‌  నిజంగా చాలా గొప్పదన్నారు. నక్షత్రాలలో తన స్థానాన్ని సుస్థిరపరుచుకోవాలనే ఆ కాంక్షతోనే ఈ స్థాయికి ఆయన చేరుకున్నారని చెప్పుకొచ్చారామె. ఆయన ఎ‍ల్లప్పుడూ "పరిస్థితి ఎంత సవాలుగా ఉన్నా, ఈత కొడుతూనే ఉండండి" అనే నినాదాన్ని గట్టిగా విశ్వసిస్తారని చెప్పుకొచ్చారు కామ్నా. 

కార్గిల్ యుద్ధంతో కెరీర్‌ యూటర్న్‌..
శుభాంశు శుక్లా లక్నోలోని అలీగంజ్ క్యాంపస్‌లోని సిటీ మాంటిస్సోరి స్కూల్ (CMS) ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. కానీ 1998లో కార్గిల్ యుద్ధం సమయంలో కెరీర్‌ సడెన్‌గా మలుపు తిరిగింది. ఈ యుద్ధం అతనిలో దేశానికి సేవ చేయాలనే  ప్రగాఢమైన కోరికను రేకెత్తించింది. 

దృఢ సంకల్పంతో తన కుటుంబానికి చెప్పకుండా UPSC నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) పరీక్షకు దరఖాస్తు చేసుకుని ఉత్తీర్ణులయ్యారు. అలా శుభాంశు 2005లో కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీతో  పట్టభద్రుడయ్యారు. తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో విమాన శిక్షణ పొందాడు. 

చివరికి 2006లో అధికారికంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ స్ట్రీమ్‌లోకి నియమితులయ్యారు. ఆయన బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని కూడా పొందారు. చాలా ఏళ్లుగా శుక్లా భారత వైమానిక దళంలో ఫైటర్‌ పైలట్,  టెస్ట్ పైలట్‌గా సేవలందించారు. 

అదీగాక దాదాపు 2 వేల గంటల విమానయాన అనుభవంతో సాధించిన రికార్డు వివిధ రకాల  విమానాలను అధిరోహించేలా చేసింది. ఆ కెరీర్‌ నేపథ్యమే 2019లో భారతదేశం ప్రతిష్టాత్మకమైన గగన్‌యాన్ మిషన్ కోసం నాలుగు వ్యోమగాములలో ఒకరిగా అతని ఎంపికకు దారితీసింది. అప్పటి నుంచి ఆయన రష్యాలోని యూరి గగారిన్ కాస్మోనాట్ శిక్షణా కేంద్రంలో, అలాగే బెంగళూరులోని భారతదేశ వ్యోమగామి శిక్షణా కేంద్రంలో కఠినమైన వ్యోమగామిగా శిక్షణ పొందారు.

(చదవండి: ఇ​జ్రాయెల్‌ ప్రధానికి భారత్‌ అంటే ఇంత ఇష్టమా..! ఇక్కడ ఫుడ్‌ తోపాటు అమితాబ్‌తో..)

 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)