Breaking News

స్వాతంత్య్రదినోత్సవ థీమ్‌...! ఒక్కొక్కరు ఒక్కొలా దేశభక్తి..

Published on Fri, 08/15/2025 - 09:37

థీమ్‌ అనేది అలంకార్రప్రాయం కాదు. మన భవిష్యత్‌ లక్ష్యాల గురించి బలంగా చెప్పే... సంక్షిప్త సందేశం. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తూ, కొత్త శక్తులతో ముందడుగు వేసినప్పుడే కొత్త భారతాన్ని ఆవిష్కరించుకోగలుగుతాము. ఈ భావాన్ని ప్రతిబింబించేలా ‘నయా భారత్‌’ అని ఈ స్వాతంత్య్ర దినోత్సవం థీమ్‌ను నిర్ణయించారు.

డాలీగారి దేశభక్తి
‘దేశభక్తి మీకేనా? నాకు కూడా ఉంది’ అని చెప్పకనే చెప్పింది డాలీ. పెయింటర్‌ డాగ్‌గా పాపులర్‌ అయిన డాలీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తాజాగా త్రివర్ణ పతాకం పెయింట్‌ వేసి ‘ఆహా’ అనిపించేలా చేసింది డాలీ. ‘శునక రాజమా... నీ దేశభక్తికి జోహార్లు’ అంటున్నారు నెటిజనులు.

ఈ అమెరికన్‌ మన జాతీయగీతం అద్భుతంగా ఆలపిస్తాడు!
పదిహేడు సంవత్సరాల అమెరికన్‌ గేబ్‌ మెరిట్‌ ఆలపించిన మన జాతీయగీతం ‘జన గణ మన’ సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. ‘ఓ మై గాడ్‌... నా హృదయం దేశభక్తితో ఉప్పొంగిపోయింది’ అనే కాప్షన్‌తో ఈ వీడియోను షేర్‌ చేసింది దిశ అనే నెటిజన్‌. ‘ఎన్నో దేశాల జాతీయగీతాలు పాడినప్పటికీ గేబ్‌కు మన జాతీయగీతం ఆలపించడం అంటే ప్రత్యేక అభిమానం’ అని రాసింది దిశ.

తండ్రి పేరు వందేమాతరం..!
‘పేరులో పవర్‌ ఉంటుంది’ అంటారు. కొన్ని పేర్లు వింటే ‘నిజమే!’ అనిపిస్తుంది. ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన ఈ కుటుంబసభ్యుల పేర్లలో దేశభక్తి ధ్వనిస్తుంది. తండ్రి పేరు వందేమాతరం ప్రహ్లాద్‌ నాయక్, కుమారుడి పేరు తిరంగా ప్రియదర్శన్, కూతురు పేరు జైహింద్‌ జగ్యన్‌సేని. 

‘మతాన్ని ప్రతిఫలించే  పేర్లు  కాకుండా దేశభక్తిని ప్రతిఫలించే పేర్లు అంటే నాకు ఇష్టం’ అంటున్న వందేమాతరం స్వచ్ఛందసేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు. వందేమాతరం ఇంటిలోని గదులు జాతీయజెండాలోని మూడు రంగులతో అలంకరించి ఉంటాయి.

అంటార్కిటికాలో వందేమాతరం
అంటార్కిటికాలోని పరిశోధన కేంద్రంలో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు ఆగస్ట్‌ పదిహేను పర్వదినాన్ని పురస్కరించుకొని జాతీయజెండా ఎగరేయడానికి సన్నద్ధం అవుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. 

వాతావరణ ప్రతికూలతలు ఉన్నప్పటికీ ‘మేము సైతం’ అంటూ జాతీయపతాకావిష్కరణకు సన్నద్ధం అవుతున్న దృశ్యం నెటిజనులను ఆకట్టుకుంది. ఉద్యోగులు మంచుపెకిలిస్తుంటే, నేపథ్యంలో ‘వందేమాతర గీతం’ వినిపిస్తుంటుంది. 

(చదవండి: ఒక్కొక్కరం ఒక్కో రంగు)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)