Breaking News

ఉత్త డబ్బారాయుడు : ఇలాంటి భర్తతో జీవితాంతం ఎలా?

Published on Thu, 06/12/2025 - 10:58

నాకు గత ఏడాది పెళ్లయింది. నా భర్త ప్రభుత్వ ఉద్యోగి. పెళ్ళి అయిన మొదటి రోజు నుంచి నేను గమనించిందేమిటంటే... ఆయన తన గురించి తాను విపరీతంగా గొప్పలు చెప్పకుంటారు. మిగిలిన వాళ్ళని మనుషులుగా కూడా చూడరు. నాఒక్క దానితోనే ఇలా ఉంటాడనుకున్నాను. కానీ బయట అందరితో ఇలాగే ఉంటాడని తెలిసింది. ఎక్కడికి వెళ్ళినా అందరూ తనని స్పెషల్‌గా చూడాలనుకుంటాడు. ఆయన చుట్టాల్లో, ఫ్రెండ్స్‌ సర్కిల్లో ఆయన్ని ‘డబ్బారాయుడు’ అంటారట. ఆఫీస్‌లో కూడా అందరితో ఇలా మాట్లాడు తున్నాడని తెలిసి ఆయనకి వార్నింగ్‌ కూడా ఇచ్చారు. అయినా ఆయన ప్రవర్తన మార లేదు. కిందపడ్డా తనదే పై చేయి అంటాడు. ఈ మధ్య నా కజిన్‌ పెళ్ళికి వెళ్తే అక్కడ తనకంటే ఆపెళ్ళి కొడుకుకి ఎక్కువ మర్యాదలు చేస్తున్నారని అలిగి వచ్చేశాడు. ఎవరైనా చిన్న మాట అన్నా నొచ్చుకుంటారు. ఆయనని ఎలా అర్థం చేసుకోవాలో తెలీట్లేదు. ఇలాంటి వ్యక్తితో నేను జీవితాంతం ఉండగలనా అనిపిస్తోంది! – అలేఖ్య, చిత్తూరు

మీరు చెప్పిన విషయాలు చదివిన తరువాత మీ భర్తకి ఉన్న పర్సనాలిటీ సమస్య వల్ల మీరు తీవ్రమైన ఒత్తిడి, అసౌకర్యానికి గురవుతున్నారని అర్థమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు గురించి ఆందోళన సహజమే. మీ భర్త తనని గొప్పగా ప్రదర్శించుకోవడం, ఇతరుల్ని చిన్నచూపు చూడడం, విమర్శలను ఒప్పుకోకపోవడం, అందరిపై తానే మెరుగ్గా ఉండాలని కోరుకోవడం, తాను చాల గొప్పవాడిననే భావన, ఇతరుల భావాల పట్ల ఎంపతీ లేకపోవడం) ఇవన్నీ ‘నార్సిసిస్టిక్‌‘ వ్యక్తిత్వ లక్షణాలుగా పేర్కొనవచ్చు. తమ తప్పులకి అవతలి వాళ్ళని బాధ్యులుగా చేసి గిల్టీగా ఫీల్‌ అయ్యేలా చేసే ‘గ్యాస్‌ లైటింగ్‌’ అనే పద్ధతిని వీళ్ళు ఎక్కువగా వాడతారు. 

ఇదీ చదవండి: అమెరికాలో వాల్‌మార్ట్‌లో అమ్మానాన్నలతో : ఎన్‌ఆర్‌ఐ యువతి వీడియో వైరల్
 

ఈ పర్సనాలిటీ సమస్య జన్యుపరమైన కారణాలు, పెంపక లోపాలు, బాల్యంలో వారు పెరిగిన పరిస్థితుల వలన రావచ్చు. స్త్రీల కంటే పురుషుల్లో ఎక్కువగా ఈ సమస్యను చూస్తాము. వాళ్ళకు తాము ఏదైనా సమస్యతో ఉన్నామనే ఎరుక ఉండదు. అందువల్ల వీరికి చికిత్స చేయడం కూడా చాలా కష్టం. వారిలో మారాలనే ఆలోచన ఎంతో కొంత ఉంటే సైకోథెరపీ ద్వారా కొంతమార్పు తీసుకురావచ్చు. కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరసీ’ ద్వారా తన ఆలోచనల్ని, ప్రవర్తనల్ని మార్చుకోవచ్చు. కానీ ఇది కాస్త సమయంతో కూడుకున్న వ్యవహారం. మీరు ఇద్దరూ కలిసి కౌన్సెలింగ్‌ తీసుకుంటే సహజంగానే మీ బంధాన్ని మెరుగుపర్చుకోవచ్చు. కానీ దానికి కూడా అతను సహకరించాల్సిన అవసరం ఉంది.‘నార్సిజం’కు ప్రత్యేకంగా మందులు లేవు. కానీ వీరిలో డిప్రెషన్, ఆందోళన లేదా కోపం లాంటి సమస్యలు ఉంటే వాటికి మానసిక వైద్యులు మందులు సూచిస్తారు. అయితే వీరితో జీవితాంతం కలిసి ఉండవచ్చా అనే ప్రశ్న చాలా సంక్లిష్టమైనది. కొంత కష్టమే అయినా మీరు అతన్ని అతనిలా అంగీకరించగలిగితే కలిసి ఉండొచ్చు. కానీ కొన్నిహద్దులు ఏర్పాటు చేసుకోవాలి. మీ ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తిస్తే మీరు అతనికి ఆ విషయాన్ని చెప్పగలగాలి. మీరు మానసికంగా దృఢంగా ఉండాలి. చివరిగా మీకు నాదొక సలహా. పొగడ్తకి లొంగని మనిషి లోకంలో లేరు. అలాంటిది మీ భర్తకు పొగడ్తే ఆహారం, నీరు అన్నీ! అప్పుడప్పుడూ మీరే అతన్ని పొగిడితే అతనూ సంతోషంగా ఉంటాడు. మీరూ కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు. మీ లాంటి ‘సైలెంట్‌ సఫరర్స్‌’ లోకంలో చాలామందే ఉన్నారు. విడిపోవడం చాలా సులభం, కానీ కలిసి ఉండాలంటే మీవైపునుండి కొంత సర్దుబాటు, ఓర్పు, త్యాగం అవసరం. గట్టి ప్రయత్నంతో చాలా సమస్యలు సర్దుకుంటాయి. ప్రయత్నిస్తే పోయేది ఏం లేదు. ఆల్‌ ది బెస్ట్‌!

-డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి సీనియర్‌ సైకియాట్రిస్ట్,  విజయవాడ
మీ సమస్యలు, సందేహాలు  పంపవలసిన మెయిల్‌ ఐడీకsakshifamily3@gmail.com
 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు