Breaking News

ముళ్లులేని బ్రహ్మజెముడుతో లాభాల పంట

Published on Tue, 11/10/2026 - 06:41

ఖాళీ బీడు నేల. నీరు తక్కువ. అటువంటి తన పొలంలో పెరిగే పంటల గురించి చైతన్య కుమార్‌ వెతికారు. ఆ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని ‘ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌ ది డ్రై ఏరియాస్‌’ (ఐసీఏఆర్‌డీఏ) శాస్త్రవేత్తలను సంప్రదించి ముళ్లు లేని కాక్టస్‌ సాగుపై అవగాహన పెంచుకున్నారు. 2024 నవంబర్‌లో రూ. 10 చొప్పున 10,000 ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులను (దీని ఆకునే పొలంలో నాటితే.. అదే వేరుపోసుకొని మొక్కగా ఎదుగుతుంది) కొనుగోలు చేసి 2.5 ఎకరాల్లో నాటారు.

25 రకాల మొక్కలు
ఆ తర్వాత చైతన్య బ్రెజిల్‌ తదితర ప్రాంతాల నుంచి తెచ్చిన 25 రకాల ముళ్లు లేని బ్రహ్మజెముడు జాతులను పెంచుతున్నారు. దీంతో ఆయన పొలం నర్సరీగా మారిపోయింది. సౌరశక్తితో నడిచే బోరు ద్వారా వేసవిలో 5–6 రోజులకు ఒకసారి, శీతాకాలంలో 15 రోజులకు ఒకసారి నీరు అందిస్తూ, ఏడాదికి రెండుసార్లు పశువుల ఎరువు వేస్తున్నారు. ఒక ఆకును పాలీబ్యాగ్‌లో నాటి 4 నెలల్లో 6 నుంచి 8 కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారు. గతేడాది రూ. 3 లక్షల పెట్టుబడితో 30,000 మొక్కలను విక్రయించి పెట్టుబడిని రాబట్టుకున్నారు. ఇప్పుడు తన పొలంలోని తల్లి మొక్కల ద్వారా ఏటా 4 లక్షల మొక్కలను ఉత్పత్తి చేసి, రూ. 40 లక్షల వ్యాపారం చేసే స్థాయికి చేరుకున్నారు. నర్సరీ పనుల కోసం సమీప గ్రామాలకు చెందిన 60 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు.

ఐదు ప్రయోజనాలు 
ముళ్లులేని బ్రహ్మజెముడును ఐదు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. దీని ఆకులను కూర వండుకోవచ్చు. పశుగ్రాసంగా ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలకు ఈ ఆకులను ముక్కలు చేసి వేయొచ్చు. బయోగ్యాస్‌ తయారీకి వాడొచ్చు. సేంద్రియ బయో లెదర్‌ తయారు చేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేసవిలో పచ్చగడ్డి దొరకనప్పుడు తన మేకలకు ఈ ఆకులను పౌష్టికాహారంగా అందిస్తున్నట్లు చైతన్య తెలిపారు. 

‘వికసిత్‌ భారత్‌’ పథకం కింద జార్ఖండ్‌ ప్రభుత్వం 400 హెక్టార్లలో ముళ్లులేని బ్రహ్మజెముడు సాగును ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ ప్రాజెక్టులకు చైతన్య మొక్కలు సరఫరా చేస్తున్నారు. భవిష్యత్తులో రైతుల సహకార సంఘం ఏర్పాటు చేసి బయోగ్యాస్, బయో–లెదర్‌ ఉత్పత్తి యూనిట్లను నెలకొల్పాలని చైతన్య లక్ష్యంగా పెట్టుకున్నారు.
 

Videos

ఇదేనా నీ సనాతన ధర్మం..! పవన్ పై జడ శ్రవణ్ సంచలన కామెంట్స్

ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన MPTC శ్రావణి

AP హైకోర్టులో YS జగన్ పిటిషన్ పై విచారణ

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

Photos

+5

సిద్దు జొన్నలగడ్డ కొత్త చిత్రం ప్రారంభం (ఫోటోలు)

+5

'గోట్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. దివ్య భారతి హైలైట్! (ఫొటోలు)

+5

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి హీరో రిషబ్ శెట్టి దీపావళి వేడుకలు (ఫోటోలు)

+5

వరంగల్ : నేతకాని ‘దీపావళి బతుకమ్మ’ (ఫోటోలు)

+5

‘మాయలేడి’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : డీజే సంగీత హోరు.. దున్నరాజుల విన్యాసాలు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)