Breaking News

మంగళసూత్రం, మెట్టెలు అందుకే.... అమెరికన్‌ మహిళ వీడియో వైరల్‌

Published on Wed, 02/26/2025 - 15:08

సాంప్రదాయ భారతీయ వివాహాలలో వివాహిత మహిళలను మంగళసూత్రం, నుదుటిన బొట్టు, కాళ్లకు మెట్టెలు విధిగా పాటిస్తారు.   మంగళసూత్రం భార్యాభర్తల మధ్య ప్రేమకు ప్రతీక అని. స్త్రీ మంగళసూత్రాన్ని ధరించినప్పుడు, వైవాహిక జీవితాన్ని అన్ని కష్టాల నుండి కాపాడుతుందని చెబుతారు. మహిళలు  కూడా అది తమకు శుభప్రదంగా, మంగళకరంగా ఉంటుందని భావిస్తారు తాజాగా  అమెరికాకు చెందిన ఒక మహిళ మంగళసూత్రాలు, మెట్టెలు, పట్టీలు  బొట్టు ధరించడం విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో  వైరల్‌గా మారింది అంతేకాదు  భారతదేశంలో వివాహిత హిందూ మహిళలు ధరించే మంగళసూత్రం లేదా  కుంకుమ, ఎందుకు ధరిస్తారనే ప్రశ్నలకు  కౌంటర్‌ కూడా ఇచ్చింది.


గోవాకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది అమెరికాకుచెందిన జెస్సికా.   సూపర్ మార్కెట్ నుంచి బైటికి వస్తున్నప్పుడు ఆమె  మెడలో మంగళసూత్రం, మెట్టెలు, పట్టీలు పెట్టుకొని, భారతీయ సంప్రదాయాలను స్వీకరించడం గురించి ఒక అమెరికన్ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అయ్యింది. అమెరికాలో ఉంటూ కూడా ఇవన్నీ ధరించడం చర్చకు దారితీసింది.  ఇలా ఎందుకు ధరిస్తావని అమెరికాలోని ఇండియన్స్‌ తనని విచిత్రమైన ప్రశ్నలు అడుగుతారని చెప్పుకొచ్చింది.  ‘నేను ఒక భారతీయడ్ని పెళ్లి చేసుకున్నా. వివాహిత హిందూ మహిళ ఈ వస్తువులను ధరించడం కామనే కదా.. అని  చెప్పాను. ఇలా చెప్పడం కరెక్టే కదా.  నేను సరిగ్గానే స​మాధానం చెప్పానా?’  కామెంట్‌ చేయాలంటూ నెటిజనులను కోరింది.

చదవండి: వింగ్‌డ్‌ బీన్స్‌..పోషకాలు పుష్కలం : ఒకసారి పాకిందంటే!
ఒక్క ర​‍క్త పరీక్ష : రానున్న పదేళ్లలో మన మరణం గుట్టు! కొత్త పరిశోధన

 

నెటిజన్లు ఏమన్నారంటే
ఆచారాలను పాటిస్తూ, భర్త సంస్కృతిని గౌరవించినందుకు చాలామంది జెస్సికాను ప్రశంసించారు. మరికొందరు తమ అనుభవాలను పంచుకున్నారు. పంజాబీ సిక్కుని పెళ్లి చేసుకొని 39 ఏళ్లు. అయినా ఇప్పటికే ప్రశ్నలు ఎదురైతాయి. అయినా వాటిని ధరించడం ఇష్టం.. అందుకే  వేసుకుంటాను.. సత్  శ్రీ అకల్ అని చెప్పి వెళ్ళిపోతాను  అని   ఒకరు వ్యాఖ్యానించగా, పెళ్లై 23 ఏళ్లు..అయినా సరే  భారతీయ ఆహారం ఇష్టమా? దానిని ఎలా వండాలో తెలుసా? అని అడుగుతారు.. వచ్చు అని చెబితే తెగ ఆశ్చర్య పోతారు అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేసింది మరో మహిళ. ‘‘ఎయిర్‌పోర్టుల్లో సెక్యూరిటీ సిబ్బంది కూడా అడుగుతారు.. ఒక భారతీయుడిని వివాహం చేసుకున్నానని వారికి చెబుతాను. అపుడు వారు దాన్ని లైక్‌  చేస్తారు. అలాగే నువ్వు నిజమైన భారతీయ మహిళవి' అన్నపుడు నాకు భలే గర్వంగా అనిపిస్తుంది.  జెస్సికా  సాంప్రదాయాలను పాటించడాన్ని ప్రేమిస్తున్నాను" అని  మరొక యూజర్‌ రాశారు.

కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వెర్నేకర్ ఫ్యామిలీ పేరుతో ఉన్న జెస్సికా వెర్నేకర్, భారతీయుడితో తన ప్రేమ, పెళ్లి గురించి కొన్ని రీల్స్‌ ద్వారా పంచుకుంది.  స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణం ద్వారా అతణ్ని కలుసుకున్నట్టు గుర్తుచేసుకుంది.  ఆ పరిచయం ప్రేమగా  నైట్‌క్లబ్‌లకు వెళ్లి కలిసి నృత్యం చేసేవాళ్ళమని, పెళ్లి చేసుకున్నా మని తెలిపింది.  తన భర్త  అమ్మమ్మతో సహా  తన  కుటుంబాన్ని మొత్తం ఆకట్టుకున్నాడని చెప్పింది. ప్రస్తుతం జెస్సికా భర్తతో కలిసి అమెరికాలో నివసిస్తోంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.

అమెరికన్‌ మహిళ వీడియో వైరల్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)