Breaking News

భాగ్యనగరంలో జపాన్‌ ఫెస్టివల్‌

Published on Thu, 10/23/2025 - 13:23

ఇండియా, జపాన్‌ల మధ్య ఉన్న బంధాన్ని పెంచేందుకు ఈ నెల 25, 26వ తేదీల్లో స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఆర్ట్‌ వేదికగా ‘హైదరాబాద్‌ జపాన్‌ ఫెస్టివల్‌–2025’ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్‌ జపనీస్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ హెచ్‌.పురుటా తెలిపారు. నారా జపాన్‌ హబ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్‌ ద్వారా రెండు దేశాల సాంస్కృతిక మార్పిడి, పరస్పర అవగాహన, ఆర్థిక సహకారాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. 

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం కార్యక్రమ కరపత్రాన్ని నా రా జపాన్‌ హబ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ బొడ్డుపల్లి రామభద్ర, సహ వ్యవస్థాపకురాలు బొడ్డుపల్లి నాగనాథ్, హిడీతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండు రోజుల ఉత్సవంలో కాలిగ్రఫీ, మార్షల్‌ ఆర్ట్స్, ఇండియన్‌ కూచిపూడి, కిమోనో, శారీ ఫ్యాషన్‌ షో ఉంటుందని, ఒరిగామి, సుమీ పెయింటింగ్స్, విద్యార్థుల సృజనాత్మకపై కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 

జపాన్‌లో విద్యా, ఉద్యోగ అవకాశాలు, స్కాలర్‌షిప్‌ పొందడం ఎలా, జపనీస్‌ ఉత్పాదక పద్ధతులు, ఇకిగై తత్వశాస్త్రం వంటి అంశాలను నిపుణులు చర్చిస్తారని చెప్పారు. జపాన్‌ ప్రత్యేక వంటకాలతో స్టాల్స్‌ ఏర్పాటు చేస్తారన్నారు. కార్యక్రమానికి జపాన్‌ కౌన్సిల్‌ జనరల్, హైదరాబాద్‌ కలెక్టర్‌ హరిచందన హాజరవుతారని పేర్కొన్నారు. 

(చదవండి: పండుగ ముగిసింది.. చేయాల్సింది మిగిలే ఉంది..!)

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)