Breaking News

లఘు చిత్ర వైభవం..

Published on Sat, 12/20/2025 - 10:50

నగరం మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి నాంది పలికింది. సిటీలో మొట్టమొదటి సారిగా ‘హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ శుక్రవారం ప్రారంభమైంది. దాదాసాహెబ్‌ ఫాల్కే స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ స్టడీస్, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ, తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ షార్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఈ నెల 21 తేదీ వరకూ కొనసాగనుంది. నగరంలోని ప్రసాద్స్‌ మల్టీప్లెక్స్  ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి భారతదేశంతో పాటు స్పెయిన్, ఈజిప్‌్ట, యూకే, యూఎస్‌ఏ, సౌత్‌ కొరియా, శ్రీలంక, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్‌ వంటి పలు దేశాల నుంచి 704 చిత్రాలు ఎంట్రీలు రావడం విశేషం. 

అంతర్జాతీయ షార్ట్‌ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భాగంగా మొదటి రోజు ప్రసాద్స్‌ మల్టీప్లెక్స్ లో అన్సెసావో, జహాన్‌ షార్ట్‌ ఫిల్మ్స్‌ను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో భాగంగా 704 ఎంట్రీల నుంచి 60 అత్యుత్తమ షార్ట్‌ ఫిల్మ్‌లను ఎంపిక చేసి ప్రదర్శించనున్నారు. 

అన్సెసావో.. 
30 నిమిషాల నిడివి గల కొంకణి లఘు చిత్రం ‘అన్సెసావో’.. టొరంటోలో జరిగిన 14వ అంతర్జాతీయ దక్షిణ ఆసియా చలనచిత్రోత్సవంలో ఉత్తమ అంతర్జాతీయ లఘు చిత్రం అవార్డును గెలుచుకుంది. మంగురీష్‌ జగదీష్‌ బండోద్కర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, వృద్ధాప్యం, ఒంటరితనం తదితర సవాళ్లను ఎదుర్కోవడంలో మానవ ప్రయాణాన్ని సున్నితంగా, హృద్యంగా చిత్రీకరించింది. ఈ చిత్రానికి నటి ప్రశాంతి తల్పంకర్‌ ఐఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఏలో అంతర్జాతీయ విభాగంలో ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. వ్యక్తిగత పోరాటం, బలహీనతలతో సతమతమవుతున్న ఒక వృద్ధురాలి భావోద్వేగ లోతును, సంక్లిష్టతను ఆమె తన అద్భుతమైన నటనతో ప్రతిబింబించారు.  

జహాన్‌–ది లాస్ట్‌ గిఫ్ట్‌.. 
రాహుల్‌ శెట్టి దర్శకత్వం వహించిన జహాన్‌ చిత్రం.. సంయమనంతో కూడిన కథనంతో పాటు ఆకట్టుకునే దృశ్యాలను మిళితం చేసి, వాతావరణ మార్పుల వాస్తవాలను చూపిస్తుంది. టైగర్‌ ష్రాఫ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ లఘు చిత్రాన్ని ఇటీవల వేవ్స్‌ సమ్మిట్‌ 2025లో ప్రదర్శించారు. ఇది పర్యావరణ బాధ్యత, వాతావరణ అవగాహనపై ప్రాధాన్యతను తెలిపింది. అంతేకాకుండా, ఇటీవల ముంబైలో జరిగిన లేక్‌సిటీ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2025లో టైగర్‌ ష్రాఫ్‌ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు.

ప్యానెల్‌ చర్చలు.. మాస్టర్‌క్లాసులు.. 
ఎంపిక చేసిన 60 లఘు చిత్రాల్లో విజేతలకు రూ.3 లక్షల నగదు బహుమతి లభించనుంది. రెండు రోజుల పాటు ప్రసాద్స్‌ మల్టీప్లెక్స్  స్క్రీన్‌ 4, 5లలో ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ఫెస్టివల్‌లో అంతర్జాతీయ జ్యూరీ సభ్యులు జూడీ గ్లాడ్‌స్టోన్, మైథిలిరావు, నాగేశ్‌ కునూరర్, లీమా దాస్, సుంజు బచుస్పతిమయుమ్, ఉత్పల్‌ బోర్పుజారి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ఈ ప్రాంతం నుండి వస్తున్న కొత్త ప్రతిభను హైలైట్‌ చేస్తూ..ఒక ప్రత్యేక ఈశాన్య పెవిలియన్‌ కింద 11 లఘు చిత్రాలు, ప్రేక్షకుల కోసం ఎంపిక చేసిన ఐదు క్లాసిక్‌ చిత్రాలు కూడా ప్రదర్శిస్తున్నారు. అదనంగా, భారతీయ సినిమాలో సమకాలీన సమస్యలపై ప్యానెల్‌ చర్చలు, యువ, ఔత్సాహిక చిత్రనిర్మాతల కోసం ఒక మాస్టర్‌క్లాస్‌ కూడా ఉంటుంది. టిక్కెట్లు జోమాటో యాప్‌లోని డిస్ట్రిక్ట్‌లో అందుబాటులో ఉన్నాయి.  

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)