Breaking News

భర్త డ్రీమ్‌ కోసం..పేరెంటింగ్‌ బాధ్యతలన్నీ ఆమెపైనే! పోస్ట్‌ వైరల్‌

Published on Tue, 07/21/2026 - 14:14

టెక్‌ ప్రపంచం రోజురోజుకి ఎలా మారిపోతోందో తెలిస్తే విస్తుపోతారు. ఏ ప్రపంచంలో ఉన్నామనే ఫీల్‌ కలుగుతుందని అంటున్నారు నెటిజన్లు. వృత్తి బాధ్యతల్లో నిష్టాతులు అవ్వడం కోసం వ్యక్తిగత జీవితమే చిక్కుల్లోకి వెళ్లిపోవాల్సిందేనా అనే ఆందోళలను మొదలవ్వుతున్నాయి. వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌ కాదు..కెరీర్‌నే ముఖ్యమా అనే సందేహాలు లేవనెత్తాయి. ఏఐ సాంకేతికత అన్నింటిని సులువు చేసిందా..లేక టెకీలను దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెట్టేసి..ఆనందానికే దూరం చేసిందా అంటే అవుననే అంటున్నారు పలువురు. ఎందుకంటే నెట్టంట వైరల్‌ అవుతున్న పోస్ట్‌ ఈ ప్రశ్నలనే లేవనెత్తుతోంది. ఏఐ టెకీల వృత్తి జీవితాన్ని ఇంతలా మార్చేసిందా అని నెట్టింట చర్చలు మొదలయ్యాయి. 

అసలేం జరిగిందంటే..2008 ఆర్థిక సంక్షోభం తర్వాత దాదాపు రెండు దశాబ్దాల పాటు, మెటా, గూగుల్ లేదా మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలలో ఉద్యోగం సంపాదించడం అత్యంత సురక్షితమైన, ప్రతిష్టాత్మకమైన కెరీర్‌ మార్గాలలో ఒకటిగా పరిగణించారు. టెక్ రంగం అధిక జీతాలు, స్థిరత్వాన్ని అందించడం తోపాటు కంప్యూటర్‌ సైన్స్‌ రంగం బాగా అభివృద్ధి చెందింది. 

అయితే గత కొన్నేళ్లుగా ఏఐ కారణంగా జరిగిన ఉద్యోగకోతలు అవకాశాల గనిగా ఉన్న సిలికాన్ వ్యాలీకి ఉన్న పేరు ఎలా దెబ్బతిందో తెలిసిందే. ఆ నేపథ్యంలో ఓ టెకీ తీసుకున్న నిర్ణయం కుటుంబంపైన, వ్యక్తిగతంగానూ ఎంత ప్రభావం చూపిందో తెలిస్తే..వామ్మో అంటారు. 

నెట్టింట వైరల్‌ అవుతున్న వాషింగ్టన్‌ పోస్ట్‌ ప్రకారం..శాన్‌ప్రాన్సిస్కోకు చెందిన 31 ఏళ్ల టెక్ ఉద్యోగి అయిన ఒక భార్య, తన భర్త ‘AI నేటివ్’ ఉద్యోగిగా మారాలనే తపన వల్ల పిల్లల పెంపకం బాధ్యతలన్నీ తన భుజాలపై మోయాల్సి వచ్చిందంటూ పోస్ట్‌లో తన గోడుని వెళ్లబోసుకున్నారు. పేరు చెప్పాడానికి ఇష్టపడని ఆమె తన భర్త ఆశయం తనపై కుటుబం నిర్వహణ భారం ఎలా మోయాల్సి వచ్చిందో వివరించారు. తన భర్త కొన్ని నెలలు క్రితం ఏఐ నేటివ్‌గా మారడంపై ఫోకస్‌ పెట్టడం కోసం పిల్లల పెంపకం బాధ్యతలన్నీ తననే చూసుకోమని కోరారని పోస్ట్‌లో పేర్కొందామె. 

ఏఐ నేటివ్‌ ఉద్యోగి అంటే..
ఆటోమేషన్ సాధనాల ఆధారంగా తమ పని విధానాన్ని పూర్తిగా పునఃరూపకల్పన చేసుకున్న వ్యక్తి అని అర్థం. అప్పుడప్పుడు చేసే పనుల కోసం చాట్‌బాట్‌లను ఉపయోగించే సాంప్రదాయ నిపుణుడు లేదా AI-ఆసక్తి గల ఉద్యోగిలా కాకుండా, ఒక AI నేటివ్ కృత్రిమ మేధను ఒక ప్రధాన భాగస్వామిగా ఉపయోగిస్తారు.

ఇక ఆమె తన భర్త AI ప్రాజెక్టులపై పనిచేస్తూ తన ఆఫీసులోనే తనను తాను బంధించుకున్నప్పుడు ఆ అనుభవం తనకు ఏదోలా అనిపించిందని తెలిపింది. అయితే ఆయన కోరుకున్నట్లుగా తన కంపెనీలో తానే అగ్రశ్రేణి ఏఐ వినియోగదారుడిగా మారాడు, అందుకు తనకు కృతజ్ఞతలు కూడా చెప్పారంటూ పోస్ట్‌ని ముగించింది. 

ఈ పోస్ట్‌ తల్లిదండ్రుల బాధ్యతలు వర్సెస్ వృత్తిపరమైన బాధ్యతలపై చర్చలు లేవెనెత్తి హాట్‌టాపిక్‌గా మారింది. నిజంగా ఇక్కడ మానవత్వం పూర్తిగా కోల్పోతున్నాం, చిన్న చిన్న ఆనందాలన్నీ వదులుకుంటూ గడుపుతున్నాం. ఇదేం జీవింతం అంటూ ఆందోళనలు వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు.

 

 (చదవండి: నిరసనల్లో షబానా అజ్మీకి ఆకస్మిక తలతిరుగుడు..! ఎందుకిలా అంటే..)

#

Tags : 1

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)