Breaking News

ఊరంతా ఐఏఎస్‌, ఐపీఎస్‌లే!

Published on Sat, 09/13/2025 - 18:26

అదో చిన్న ఊరు. అక్క‌డ 75 ఇళ్లు మాత్ర‌మే ఉన్నాయి. ఊరు చిన్న‌దే కానీ దాని ప్ర‌త్యేకత మాత్రం చాలా ఘ‌నం. ఆ ఊరి నుంచి 50 మంది పైగా  ప్ర‌భుత్వ ఉన్న‌త ఉద్యోగాలు సాధించారు. వీరిలో ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్ఎస్‌, పీసీఎస్ జాబ్స్‌ సాధించిన వారు ఉన్నారు. దీంతో ఆఫీస‌ర్స్ విలేజ్‌, యూపీఎస్సీ ఫ్యాక్ట‌రీగా ఆ ఊరిని పిలుస్తుంటారు. ఇంత చిన్న ఊరి నుంచి అంత మంది ఉన్న‌త ఉద్యోగాలు సాధించారంటే
అక్క‌డేదో పెద్ద కోచింగ్ సెంట‌ర్ ఉండే ఉంటుంద‌ని ఊహిస్తున్నారా? అలాంటిదేమి లేద‌క్క‌డ‌. ఇంత‌కీ ఆ ఊరు పేరేంటి, ఎక్క‌డ ఉంది..?

ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయే ఊరి పేరు మాధోపట్టి. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో ఉంది. ఈ ఊరి విజ‌యగాథ (success story) గురించి తెలుసుకోవాలంటే వందేళ్లు వెన‌క్కి వెళ్లాలి. స్వాతంత్ర్య సమరయోధుడు ఠాకూర్ భగవతి దిన్ సింగ్, ఆయ‌న‌ భార్య శ్యామరతి సింగ్‌తో ఈ విలేజ్ స‌క్సెస్ స్టోరీ ప్రారంభ‌మైంది. శ్యామరతి సింగ్ 1917లో అమ్మాయిలకు చ‌దువు చెప్ప‌డం ప్రారంభించారు. త‌ర్వాత అబ్బాయిలు కూడా ఆమె ద‌గ్గ‌ర చ‌దువుకోవడానికి వ‌చ్చేవారు. ఇలా ఆ ఊళ్లో విద్యార్జ‌న‌కు బీజం ప‌డింది.

మాధోపట్టి మ‌హిమ
స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌ర్వాత ఆ ఊరి నుంచి ఒక‌రు తొలిసారిగా ఓ యువ‌కుడు ఐఎఫ్ఎస్‌కు ఎంపిక‌య్యాడు. త‌ర్వాత‌ వినయ్ కుమార్ సింగ్ అనే మ‌రో యువ‌కుడు ఐఏఎస్ సాధించాడు. ఒకే కుటుంబంలోని న‌లుగురు అన్న‌ద‌మ్ములు ఐఏఎస్‌, ఐపీఎస్‌కు ఎంపిక కావ‌డంతో మాధోపట్టి గ్రామం పేరు మార్మోగిపోయింది. యూపీఎస్ జాబ్స్ సాధించ‌డం మాధోపట్టి (Madhopatti) వాసుల‌కు అల‌వాటుగా మారిపోయింది. అబ్బాయిల‌తో పాటు అమ్మాయిలు కూడా ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఇత‌ర ప్రాంతాల నుంచి ఆ ఊరికి కోడ‌ళ్లుగా వ‌చ్చిన యువ‌తులు కూడా ఈ విజ‌యంలో భాగ‌స్వాముల‌య్యారు. మెట్టింటిలో అడుగు పెట్ట‌గానే పుస్త‌కాల‌తో కుస్తీ ప‌ట్టి స‌ర్కారీ కొలువులు సాధించారు. మాధోపట్టి మ‌హిమ అది!

విజ‌య ర‌హ‌స్యం
ఇంత మందికి ప్ర‌భుత్వ ఉన్న‌త ఉద్యోగాలు రావ‌డానికి అక్క‌డేమి పెద్ద కోచింగ్ సెంట‌ర్లు లేవు. గ్రామమే కోచింగ్ సెంట‌లా ప‌నిచేస్తుంది. ఇప్పుడు అధికారులుగా ఉన్న సీనియర్లు కొత్త విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు. ఒకరు గెలిచినప్పుడు మొత్తం గ్రామం సంబ‌రాలు జరుపుకుంటుంది. ఎవరైనా విఫలమైనప్పుడు మ‌ళ్లీ ప్రయత్నించడానికి మద్దతు ఇస్తుంది. ఇదే మాధోపట్టి విజ‌య ర‌హ‌స్యం.

చ‌ద‌వండి: ఐఏఎస్ క్యాపిట‌ల్ ఆఫ్ ఇండియా.. ఆ రాష్ట్రం!

మాధోపట్టి అనేది కేవలం మ్యాప్‌లో ఉన్న ప్రదేశం మాత్ర‌మే కాదు. సంక‌ల్పానికి చేయూత తోడైతే ఎలాంటి విజ‌యాన్నైనా సాధింవ‌చ్చ‌నే భ‌రోసాయిచ్చే స్ఫూర్తిదాయక ప్రాంతం. కష్ట‌ప‌డి ప‌నిచేసే వారికి అండ‌గా నిల‌బ‌డేవారు ఉంటే అప‌జయం అన్న‌మాటే ఉండ‌ద‌న‌డానికి మాధోపట్టి గ్రామ విజ‌యమే ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నం. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)