Breaking News

ఎముకలు, కండరాలు దృఢంగా ఉండాలంటే ఇలా చేయండి!

Published on Sat, 01/25/2025 - 10:48

శరీరం తేలికగా కదలటానికి, చురుకుగా ఉండటానికి ఎముకలు బలంగా ఉండటం ఎంతైనా అవసరం ఎముకలు బలహీనపడితే.. విరగడం, ఆస్టియోపోరోసిస్ ముప్పు పెరుగుతుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి  జీవన శైలిమార్పులతోపాటు,  వ్యాయామాన్ని కూడా క్రమం తప్పకుండా చేయాలి.  

ఎముకలు, కండరాలను బలోపేతం చేయడానికి, అకస్మాత్తుగా పడిపోయే ప్రమాదాన్ని నివారించగల శక్తి అధో ముఖానికి ఉంది. రోజూ ఈ ఆసనాన్ని దినచర్యలో భాగం చేస్తూ ఉంటే మైండ్, బాడీ చురుకుదనం పెరుగుతుంది. 


ఇలా వేయాలి....
∙మ్యాట్‌ పైన లేదా నేలపైన నిటారుగా నిల్చొని చేతులను పైకి స్ట్రెచ్‌ ఉంచాలి. తర్వాత నడుం భాగం వంచుతూ, చేతులను పూర్తిగా నేలమీద ఆనించాలి. ∙చేతులను పాదాలకు దూరంగా తీసుకెళుతూ త్రికోణాకారంలో ఉండాలి.

కాలి వేళ్ల మీద ఉంటూ మడమలను పైకి లేపాలి. శరీర బరువు చేతులు, కాలి ముని వేళ్ల మీద ఉంటుంది. 

∙నిమిషం సేపు ఇదే భంగిమలో ఉండాలి. తిరిగి యధాస్థితికి రావాలి. ఇలా ఒకటి నుంచి 3 సార్లు ఈ ఆసనాన్ని పునరావృతం చేయాలి.

ఈ ఆసనం వేయటానికి మొదట్లో కాస్త కష్టంగా వున్నా రోజూ సాధన చేస్తూ ఉంటే సులువవుతుంది. వెన్నెముక, కాళ్ళను బలోపేతం చేస్తుంది. అదే విధంగా ఏకాగ్రత పెంచి, ఒత్తిడి నుండి రిలీఫ్‌ని ఇస్తుంది. అజీర్తి సమస్యలు దూరమవుతాయి. నడుము నొప్పి తగ్గుతుంది. ఆస్టియోపోరోసిస్‌ సమస్య నుండి రక్షిస్తుంది. సైనస్, ఆస్తమా, పీరియడ్స్‌లో వచ్చే సమస్యల నుంచి రిలీఫ్‌ని ఇస్తుంది. ఇన్ని ప్రయోజనాలని ఈ ఆసనం ద్వారా  పొందవచ్చు. 

ఎముకలు దృఢంగా ఉండటానికి ఏం చేయాలి?

  • ఎముకలు దృఢంగా ఉండాలంటే.. సమతుల్య, పోషకమైన ఆహారాన్ని తీసుకోవాలి.

  • కాల్షియం, విటమిన్‌ డి వంటి పోషకాలు సమృద్ధిగా లభించే ఆహారం తినాలి.

  • పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులు తినాలి.

  • విటమిన్ డి సమృద్ధిగా ఉండే ఆహారాలు తినాలి.

  • బాల్యంలో ఎముకలు దృఢంగా ఉండటానికి పోషకాలు తీసుకోవడం ముఖ్యం.

  • వ్యాయామం చేయడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి.

  • మెనోపాజ్‌ దాటిన స్త్రీలు మరింత జాగ్రత్తలు  తీసుకోవాలి.

  • ఎముకలు, కండరాలను  బలోపేతం చేసేలా వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.

ఇదీ చదవండి: టాటూ కోసం వెళ్లి..వ్యాపారవేత్త, పాపులర్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ మృతి


 

#

Tags : 1

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)