Breaking News

నో రన్నింగ్‌, నో కార్డియో..! జస్ట్‌ 20 నిమిషాల నడకతో 24 కిలోలు..

Published on Mon, 08/03/2026 - 08:33

బరువు తగ్గడం అనేది వ్యాయామలు, చక్కటి డైట్‌, మంచి ఆహారపు అలవాట్లతోనే సాధ్యం కాదు. చేసే వ్యాయామాలు కాస్త తెలివిగా చేస్తేనే శరరీంలో సత్వర మార్పులు చూడగలం. ఒకటే దినచర్యకు బాడీ అలవాటు పడి.. పెద్దగా బరువులో ఎలాంటి ప్రభావం ఉండదు. పైగా ఇంతలా చేస్తున్నా..బరువులో మార్పు కనిపించక..మధ్యలోనే వెయిట్‌లాస్‌ జర్నీకి స్వస్తి పలుకుతుంటారు చాలామంది. అలాంటి వాళ్లు ఈ ఫిట్‌ఇన్‌ఫ్లుయెన్సర్‌లా తెలివిగా చేస్తే..అమాంతం బరువు తగ్గడమే గాక స్లిమ్‌ అవుతారు. మరి ఆ ట్రిక్‌ ఏంటో చూద్దామా..!.

బరువు తగ్గడంలో అందరూ తక్కువ తినడం, ఎక్కువ కదలడం, నిలకడగా ఉండటం వంటి సులభమైన కామన్‌ సూత్రం పాటిస్తుంటారు. ఇలా నెలల తరబడి, ఇదే వర్కౌట్‌​ రొటీన్‌ని అనుసరిస్తుంటారు. కానీ వెయిట్‌ మెషిన్‌లో బరువులో పెద్దగా మార్పు కనిపించక నిరాశ చెందుతుంటారు. ఆ విషయం గురించి ఫిటెనెస్‌ కంటెంట్‌ క్రియేటర్‌ మాట్లాడుతూ..తన వెయిట్‌లాస్‌ జర్నీలో కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నట్లు వివరించారు. 

తాను కూడా ఉదయం 6 గంటలకు ప్రతిరోజూ మూడు నెలల పాటు 45 నిమిషాలు ట్రెడ్‌మిల్‌పై చేసినా..తన బరువులో పెద్దగా మార్పులు కనిపించక వదిలేశానని పంచుకున్నారు. ప్రతిరోజూ డెడికేటెడ్‌గా వ్యాయామాలు చేస్తున్నప్పటికీ..కనిపించేంతగా కొలెస్ట్రాల్‌ తగ్గలేదని, బట్టలు సరిపోయే విధానంలో అస్సలు మార్పు కనపించలేదని చెప్పుకొచ్చారు. తన సమస్య వ్యాయామం చేయడం కాదని, ఒకేరకమైన వ్యాయమాన్ని అదేపనిగా చేయడమే అసలు సమస్య అని తెలిసందంటున్నాడు. 

శరీరం ఆ దినచర్యకు అలవాటుపడిపోయి..రాను రాను పెద్దగా ప్రభావం చూపించలేదని అన్నారు. అందుకే ట్రెడ్‌మిల్‌పై 45 నిమిషాలు గడపడానికి బదులుగా,  వాలు స్థాయిలను మారుస్తూ 20 నిమిషాల పాటు వాలుగా నడిచే దినచర్యకు మారినట్లు తెలిపారు. ఈ వర్కౌట్లలో పరుగుల లేదు. మరి ఎలా చేస్తున్నారంటే..

  • వాలుగా నడక: వేగం 3.5, వాలు 8, 5 నిమిషాల పాటు.

  • నిటారుగా ఎక్కడం: వేగం 3.0, వాలు 12, 5 నిమిషాల పాటు.

  • పవర్ వాక్: వేగం 3.8, వాలు 6, 5 నిమిషాల పాటు.

  • కూల్ డౌన్: వేగం 2.5, వాలు 0, 2 నిమిషాల పాటు.

ఈ పద్ధతికి మారిన కేవలం రెండు వారాల్లోనే తనలో స్పష్టమైన మార్పులు కనిపించాయని  చెప్పారు. కష్టపడి పనిచేయడం కాదు, తెలివిగా చేస్తే బరువు తగ్గడం మంచి ఫలితాలు అందుకుంటారని అన్నారు. ఆవిధంగానే తాను 89 కిలోల నుంచి 65 కిలోలకు తగ్గినట్లు పేర్కొన్నారు. అయితే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తర్వాత గానీ లేదా ఉదయాన్నే లేవగానే గానీ, ఈ రొటీన్‌ను వారానికి మూడు నుంచి ఐదు సార్లు చేయాలని లోజేష్ సూచిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం స్మార్ట్‌గా వర్కైట్లు చేసి స్లిమ్‌గా మారిపోండి త్వరగా..!.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

(చదవండి: అధిక ప్రోటీన్‌ ఆహారంతో జస్ట్‌ 60 రోజుల్లో 22 కేజీలు..! సహాయపడిన డైట్‌ ఇదే..)
 

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)