Breaking News

‘గుర్రాల స్నానం’ 300 ఏళ్ల పాత పండగ గురించి తెలుసా?

Published on Sat, 06/13/2026 - 11:12

పిల్లలూ... మన ఊర్లో ‘ఎడ్ల పందాలు’, ‘కోడి పందాలు’ లాగే ఇంగ్లాండ్‌లో గుర్రాల పండగ జరుగుతుంది. ఇంగ్లాండ్‌లో ‘యాపిల్‌బై’ అనే చిన్న ఊరులో మొన్న జూన్‌ 6న ‘గుర్రాల స్నానం పండుగ’ జరిగింది. ప్రతి వేసవిలో ఈ పండగ చేస్తారు. ఇది 300 ఏళ్ల పాత పండగ!

పండుగ రోజు ‘జిప్సీ’ అనే సంచార జాతి వాళ్లు ఎక్కడెక్కడి నుంచో అందమైన గుర్రాలు, రంగురంగుల బండ్లతో యాపిల్‌ బైకి వచ్చేస్తారు. తాము ప్రయాణం చేసి వచ్చిన గుర్రాలకి అక్కడి ‘ఈడెన్‌’ నదిలో స్నానం చేయిస్తారు. చల్లటి నీళ్లలో గుర్రాలు హాయిగా ఈదుతాయి.  స్నానం చేసి, జూలు దువ్వుకున్న గుర్రాలు మెరిసిపోతాయి. అప్పుడు వాటిని కొనడానికి, అమ్మడానికి బేరాలు జరుగుతాయి.

గుర్రాలే కాదు, చిన్న పిల్లలు, పెద్దవాళ్లు అందరూ కలుసుకుని ఆడతారు, పాడతారు, కథలు చెప్పుకుంటారు.  గుర్రాలు నదిలో ‘టప్‌ టప్‌’ అని నడుస్తుంటే చూడ్డానికి వేల మంది వస్తారు. కొందరు గుర్రాల మీద కూర్చునే నదిలోకి దిగుతారు. భలే థ్రిల్లింగ్‌గా ఉంటుంది!  ఈ జాతరలో ‘బౌ–టాప్‌ వాగన్‌’ అనే గుండ్రని పైకప్పు ఉన్న బండ్లు స్పెషల్‌. ఇవి జిప్సీల తిరుగాడే ఇళ్లు. మనం ప్రతి సంస్కృతిని గౌరవించాలి.

Videos

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు