Breaking News

ఇవోరకం పూతరేకులు..!

Published on Sun, 08/10/2025 - 11:38

వీటిని దూరం నుంచి చూస్తే, బొగ్గుముక్కల్లా కనిపిస్తాయి. దగ్గరగా చూస్తే, మాడిపోయిన పూతరేకుల్లా కనిపిస్తాయి. నిజానికి ఇవి పూతరేకుల్లాంటి వంటకమే! కాకుంటే, మాడిపోలేదు, ఎవరూ కావాలని వీటిని మాడ్చేయలేదు. వీటి తయారీకి వాడే ముడిపదార్థాల కారణంగానే నల్లగా కనిపిస్తాయి. 

‘పికి బ్రెడ్‌’ అని పిలుచుకునే ఈ సంప్రదాయ వంటకం తయారీలో నల్లని మొక్కజొన్న గింజల నూక, నల్లగా నిగనిగలాడే జూనిపర్‌ బెర్రీలను కాల్చి తయారు చేసిన బూడిదను ప్రధానంగా వాడతారు. తయారీ ప్రక్రియ దాదాపు మన పూతరేకుల మాదిరిగానే ఉంటుంది. పూతరేకుల తయారీలో కుండ అడుగున మంటపెట్టి, పిండిని కుండ మీద ఒక్కోపూతగా పూసి, వాటిని ఒద్దికగా చుడతారు. ‘పికో బ్రెడ్‌’ తయారీకి రాతిపలక కింద మంట పెడతారు. 

వేడెక్కిన రాతి పలక మీద ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని అతి సన్నని పొరలుగా కాలుస్తారు. కొన్ని పొరల దొంతరలను ఇలా పూతరేకుల్లా చుడతారు. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో నివసించే ‘హోపీ’ తెగవారి సంప్రదాయ వంటకం ఇది. ఈ తీపి వంటకాన్ని పండుగలు, పుట్టినరోజులు వంటి ప్రత్యేక సందర్భాలలో తయారు చేసుకుంటారు.

(చదవండి: కొరకరాని గింజలే గాని...)
 

#

Tags : 1

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)