Breaking News

Holi 2025 : రంగుల పండుగ, షాపింగ్‌ సందడి షురూ!

Published on Wed, 03/12/2025 - 15:16

నగరంలో  హోలీ సందడి మొదలయ్యింది. ఈ నెల 14న పండుగ సందర్భంగా ఇప్పటికే నగరంలోని పలు దుకాణాల్లో హోలీ వేడుకలకు సంబంధించిన వివిధ రకాల సామగ్రిని కొనుగోలు చేయడానికి బేగం బజార్‌ వచ్చిన కొనుగోలుదారులు, మహిళలతో సందడి వాతావరణం నెలకొంది. 

హోలీ రంగుల కేళీ. చక్కటి సంగీతం, కుటుంబం , స్నేహితులతో మంచి సమయం గడపటం, చక్కటి స్వీట్లు. రెండు రోజుల వేడుకల కోసం సన్నాహాలు వారాల ముందుగానే  షురూ అయిపోతాయి. రంగుల పొడులు (గులాల్), వాటర్ గన్‌లు , స్వీట్లను కొనుగోలు చేసే వ్యక్తులతో మార్కెట్‌లు నిండిపోతాయి.  రాధా కృష్ణుల దైవిక ప్రేమకు గుర్తుగా జరుపుకోవడం  ఒక ఆనవాయితీ.  

చెడుపై మంచి సాధించిన విజయానికి  గుర్తుగా జరుపుకునే  పండుగల్లో మరో ముఖ్యమైన పండుగ.  హోలీ అంటే రంగుల పండుగ. ఫాల్గుణ మాసం శుక్లపక్ష పౌర్ణమి నాడు హోలీ పండుగను జరుపుకుంటారు. పౌర్ణమి రాత్రి హోలికా దహనం చేస్తారు.  మరునాడు   ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ ఉత్సాహంగా హోలీ  వేడుకలను  ఎంజాయ్‌ చేస్తారు. దీనిని ధూలేడి పండుగ అని అంటారు.

హోలీ  పండుగ అంటేనే ఉత్సాహభరితమైన పండుగ. 'రంగుల పండుగ'. చిన్నా పెద్దా అంతా దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగల్లో హోలీ కూడా. వసంతం రాకను తెలియ చెప్పే పండుగ. భారతదేశం వ్యాప్తంగా హోలీని గొప్పగా జరుపుకుంటారు. ఒక్కోప్రాంతంలో ఒక్కోలా దీనిని చేసుకుంటారు. శ్రీకృష్ణుని జన్మస్థలమైన మధుర, బృందావనంలో హోలీకి ప్రత్యేక ప్రాధన్యత ఉంది. మేజర్​గా అన్ని చోట్ల రంగులతో సెలబ్రేట్ చేసుకుంటారు. 

ఆర్గానిక్‌ కలర్స్‌నే వాడదాం
హోలీ ప్రధానంగా రంగుల చుట్టూ ఉంటుంది. అందుకే దీనిని ఆడేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.  పర్యావరణానికి, మన చర్మానికి ఎలాంటి హాని జరగకుండా ఉండాలంటే సేంద్రీయ, సహజమైన రంగులు ఎంచుకోవడం ఉత్తమం. అలాగే స్నేహితులతో హోలీ  ఆడేటపుడు అప్రమత్తంగాఉండాలి. ఎక్కువగా తిరగకుండా,  హైడ్రేటెడ్​గా ఉండాలా  జాగ్రత్తపడాలి.  జుట్టుకు నూనె రాస్తే రంగులు ఈజీగా వదిలిపోతాయి. కళ్లకు అద్దాలు పెట్టుకోవాలి. సన్​స్క్రీన్ వాడితే మంచిది. 
 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)