Breaking News

Hetvi Khimsuriya: బంగారంలాంటి బిడ్డ

Published on Thu, 01/25/2024 - 00:33

గుజరాత్‌లోని వడోదరకు చెందిన హెత్వి ఖిమ్సూరియా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పీఎం నేషనల్‌ చైల్డ్‌ అవార్డ్‌ (ప్రధాన్‌మంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌–పీఎంఆర్‌బీపి) అందుకుంది. వివిధ రంగాలలో పిల్లలు సాధించిన అద్భుత విజయాలకు గుర్తింపుగా ఇచ్చే పురస్కారం ఇది.

పదమూడు సంవత్సరాల హెత్వి సెరిబ్రల్‌ పాల్సీని అధిగమించి పెయింటింగ్, పజిల్‌ సాల్వింగ్‌లో అసా«ధారణ ప్రతిభ చూపుతోంది. తనకు వచ్చే పెన్షన్‌ను దివ్యాంగుల సంక్షేమ నిధికి ఇస్తోంది. తన ఆర్ట్‌పై యూట్యూబ్‌ చానల్‌ నడుపుతోంది....

వడోదరలోని 8–గ్రేడ్‌ స్టూడెంట్‌ హెత్వి ఖిమ్సూరియాకు పురస్కారాలు కొత్త కాదు. ప్రశంసలు కొత్తకాదు.  గత సంవత్సరం ఫ్రీహ్యాండ్‌ పెయింటింగ్, క్రాఫ్ట్, పజిల్‌ సాల్వింగ్‌లో చూపుతున్న ప్రతిభకు ‘గుజరాత్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు సంపాదించింది. ‘వరల్డ్స్‌ ఫస్ట్‌ సీపీ గర్ల్‌ విత్‌ ఎక్స్‌ట్రార్డినరీ స్కిల్స్‌’ టైటిల్‌ సాధించింది. వంద ఎడ్యుకేషనల్‌ పజిల్స్‌ సాల్వ్‌ చేసిన ఫస్ట్‌ సీపీ గర్ల్‌గా ఆమెను ‘ది లండన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ గుర్తించింది.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డ్‌లు సాధించిన హెత్వి గీసిన చిత్రాలు యాభై ఆర్ట్‌ గ్యాలరీలలో ప్రదర్శితమయ్యాయి. చిత్రకళలపై  పిల్లల్లో ఆసక్తి కలిగించడానికి ‘స్పెషల్‌ చైల్డ్‌ ఎడ్యుకేషన్‌ యాక్టివిటీ–హెత్వి ఖిమ్సూరియా’ అనే యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించింది.

హెత్వి విజయాల వెనుక ఆమె తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది.
కూతురు ప్రస్తావన వచ్చినప్పుడు ‘అయ్యో! మీ అమ్మాయి’ అంటూ ఎంతోమంది సానుభూతి చూపే సమయాల్లో  ‘బాధ పడాల్సిన అవసరం ఏముంది. మా అమ్మాయి బంగారం. భవిష్యత్‌లో ఎంత పేరు తెచ్చుకుంటుందో చూడండి’ అనేవారు. ఆ మాట అక్షరాలా నిజమైంది.

చిన్నప్పటి నుంచి బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.
హెత్విని చూసుకోవడానికి ఆమె తల్లి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసింది.

రంగులు, పజిల్స్‌తో బేసిక్స్‌ ప్రారంభించారు. రంగులు, పజిల్స్‌ అంటే హెత్విలో ఇష్టం ఏర్పడేలా చేశారు. బొమ్మలు వేస్తున్నప్పుడు, పజిల్స్‌ పరిష్కరిస్తున్నప్పుడు ఆ అమ్మాయి కళ్లలో శక్తి కనిపిస్తుంది. ఆ శక్తితో ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకాన్ని తల్లిదండ్రులలో నింపింది.
హెత్వి మోములో ఎప్పుడూ చెరగని చిరునవ్వు కనిపిస్తుంది. ఆ చిరునవ్వే ఈ చిన్నారి బలం.
హెత్వి ఖిమ్సూరియా మర్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)