పెద్ది మరోసారి వాయిదా...రామ్ చరణ్ అనుకున్నదే జరిగింది.
Breaking News
చలువ చేసే మారేడు పానకం..!
Published on Wed, 04/15/2026 - 13:57
మే నెల ఇంకా రాకమునుపే ఎండలు మండిపోతున్నాయి. చైత్రంలోనే చెమటలు పట్టేలా భానుడు భగభగలాడిస్తున్నాడు. ముఖ్యంగా ఈ వేడి గాల్పులకు పెద్దలు, చిన్నారులే అల్లాడిపోతుంటారు. ఉదయం ఏడింటి కల్లా చుర్రుమంటున్న సూర్యుడి తాపానికి చిన్నారులు తాళ్లలేక వాడిపోగా, పెద్దలు నిసత్తువతో ఇబ్బంది పడుతుంటారు. మరి ఈ వేసవి తాపం నుంచి బయటపడేందుకు మన పూర్వీకులు ఎన్నో గొప్ప సహజసిద్ధమైన ఔషధ పానకాలను అందించారు. ఇప్పుడు చెప్పబోయే పానకంలో అలాంటి గుణాలే ఉన్నాయి. దీని ముందు ఏ షెర్బత్లు, జ్యూస్లు నిలువలేవు. దీని ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే విస్తుపోతారు.
వేసవి తాపం నుంచి విముక్తినిచ్చే చలవ చేసే పానియమే ఈ మారేడు పానం. దీన్ని ఒడియా ప్రజలు తమ సంవత్సరాది రోజున చేసుకుని తింటారు. అచ్చం మన ఉగాది పచ్చడిలా వాళ్లు ఈ మారేడు పానకాన్ని తయారు చేసుకుంటారు. వాళ్ల సంవత్సరాది వైశాఖ మాసంలో వస్తుంది. వాళ్లకి అప్పుడు వసంతకాలం అన్నమాట. వాళ్లు కూడా మనలా ఈ రోజు నంచే చలివేంద్రాలు ఏర్పాటు చేసి లాంఛనంగా ఈ మారేడు పానం వితరణను ఆనవాయితీగా చేస్తుంటారు. వేసవి ప్రారంభానికి గుర్తుగా ఈ పానకం తయారు చేస్తారు ఒడియా ప్రజలు. ఇదెలా తయారు చేస్తారంటే..
పండిన మారేడు పండును పగలగొట్టి, లోపలి గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ గుజ్జులో తగినన్ని నీళ్లు పోసి, చేతితో బాగా పిసికి (లేదా మిక్సీ పట్టి) 15-20 నిమిషాలు నానబెట్టాలి. పిసికిన మిశ్రమాన్ని జల్లెడ (strainer) ద్వారా వడపోసి, పీచు, గింజలను వేరు చేసి స్వచ్ఛమైన రసాన్ని తీసుకోవాలి.ఈ రసంలో రుచికి సరిపడా బెల్లం తురుము లేదా పంచదార వేసి కరిగే వరకు కలపాలి. చివరగా చిటికెడు యాలకుల పొడి, కావాలంటే కొద్దిగా నిమ్మరసం కలిపి, చల్లటి నీరు లేదా ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవచ్చ. ఈ చల్లని పానీయం వేసవి వేడి నుంచి శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా ఆరోగ్యప్రదం కూడా.
ఆరోగ్య ప్రయోజనాలు..
ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది.
వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది.
మలబద్ధకాన్ని, ఎసిడిటీ సమస్యను దూరం చేస్తుంది.
మొటిమలను నివారిస్తుంది.
దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కేన్సర్ బారినపడకుండా రక్షిస్తుంది.
బాడీని హైడ్రేటెడ్ ఉంచుతుంది
బరువుని అదుపులో ఉంచుతుంది.
అలాగే కంటి సమస్యలు, గుండె సమస్యలకు చెక్ పెడుతుంది.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: weight loss Tips: ఏడు వారాలకే జూనియర్ ఎన్టీఆర్ 9 కిలోలు..!)
Tags : 1