Breaking News

నీలి రంగు అద్దాల మేడలు : భగభగ మంటలు

Published on Wed, 04/02/2025 - 17:35

ముంబై, ఉప నగరాల్లో మొన్నటిదాకా 34 డిగ్రీలున్న ఉష్ణోగ్రతలు ఇప్పుడు ఏకంగా 37, 38 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత పదిహేను రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతను భరించలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండల దెబ్బకు వివిధ అనారోగ్య సమస్యల బారిన పడి ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో చిన్న చిన్న క్లినిక్‌లు మొదలుకుని ప్రభుత్వ, ప్రైవేటు, బీఎంసీ తదితర ప్రధాన ఆసుపత్రులకు రోగులు బారులు తీరుతున్నారు. ఎండలు ముదరడంతో విధులకు వెళ్లేందుకు బయలుదేరిన ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ రకాల పనుల కోసం ఇల్లు కదిలే గృహిణులు, సామాన్యులు డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు. 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి  
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య శాఖ సూచించింది. ప్రతీరోజు రెండు నుంచి మూడు లీటర్లకుపైగా నీరు తాగాలని, అవసరమైతే కొబ్బరి నీళ్లు, మజ్జిగ, లస్సీ, పండ్ల రసాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్న సమయాల్లో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కళ్లు తిరగడం, వాంతులు, కాళ్లు, చేతుల నొప్పులు, దురద , మూత్రం సరిగా రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపం క్లినిక్‌లు లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలని జె.జె.ఆసుపత్రి ప్రొఫెసర్‌ డా.మధుకర్‌ గైక్వాడ్‌ సూచించారు. లేదంటే వడదెబ్బతో తీవ్ర అనారోగ్యం బారిన పడే అవకాశముందని హెచ్చరించారు. – డా.మధుకర్‌ గైక్వాడ్‌

అద్దాల మేడలూ కారణమే  
ముంబైలో అనేక బహుళ అంతస్తుల భవనాలు రోజురోజుకూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. బేస్‌మెంట్‌పై అదనపు భారం పడకుండా , అందంగా కనిపించాలనే ఉద్దేశ్యంతో 90 శాతం భవనాలకు నీలం రంగు అద్దాలు బిగిస్తున్నారు. నగరంలో వేడిమి పెరుగుదలకు ఇది కూడా ఒక కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. – ఆరోగ్య నిపుణులు 

చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్‌ వీడియో

అకాల వర్షాలకు అవకాశం 
వేసవి ఎండలతో సతమతమవుతున్న ముంబైకర్లపై మరో పిడుగు పడనుంది. త్వరలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అకాల వర్షాల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముందని, జాగ్రత్తలు పాటించాలని సూచించింది.– ఐఎండీ

చదవండి: నెట్టింట సంచలనంగా మోడల్‌ తమన్నా, జాన్వీకి షాక్‌!


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)