Weather: ఏపీకి భారీ వర్ష సూచన
Breaking News
తండ్రికి తలకొరివిపెట్టిన తనయ
Published on Wed, 07/16/2025 - 10:29
హిరమండలం: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తండ్రి అకస్మాత్తుగా కన్నుమూయడం తీరని విషాదాన్ని నింపింది. కొడుకు అయినా, కూతురైనా తానే అనుకుంటూ పుట్టెడు దుఃఖాన్ని కడుపులోనే దాచుకుని తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన పలువురి చేత కంట తడి పెట్టించింది. అలా తన తండ్రికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది ఆ కుమార్తె.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేట మండలం శ్యామలాపురం గ్రామానికి చెందిన ఇప్పిలి జగదీష్ (49) కోళ్లఫారం నడుపుతున్నారు. కోళ్లఫారంలో ఉండగా ఆదివారం రాత్రి పాముకాటు వేయడంతో మృతి చెందారు. ఈయన కుమారుడు రెండేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఒక్కగానొక్క కుమార్తె లావణ్య లండన్‌లో ఉంటోంది. తండ్రి మరణంతో హుటాహుటిన బయలుదేరి స్వగ్రామానికి మంగళవారం చేరుకుంది. అన్నీ తానై అంత్యక్రియలు పూర్తి చేసింది.
ఇదీ చదవండి: Soumyashree అలసిపోయిన ప్రాణం: పాడె మోసిన గ్రామస్తులు
బెల్ట్ షాపులపై గిరిజన మహిళల దాడి
కొరాపుట్: బెల్ట్ షాపులపై గిరిజన మహిళలు మూకుమ్మడిగా దాడి చేశారు. మంగళవారం నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ సమితి బెనరా గ్రామ పంచాయతీ కాలిబెడ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో బెల్ట్ షాపులలో మద్యం అమ్మకాల వల్ల కుటుంబాలు నాశనమవుతున్నాయని స్థానిక మహిళలు గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఫలితం లేకపోవడంతో విసుగెత్తిపోయిన మహిళలు భారీ సంఖ్యలో వెళ్లి ఆ గ్రామంలోని బెల్టుషాపులు తనిఖీ చేసి మద్యం సీసాలు పగలగొట్టారు.
Tags : 1