పుచ్చకాయ తినే ముందు చిటికెడు ఉప్పు ఎందుకు వేయాలంటే..?

Published on Tue, 03/31/2026 - 14:01

సమ్మర్‌ అనగానే అందరికి గుర్తొచ్చేది పుచ్చకాయ. వేసవి దాహార్తిని చల్లార్చేది పుచ్చకాయ ఒక్కటే. అది తినగానే తక్షణ శక్తి, దాహం తీరుతుంది కూడా. అలాంచి పుచ్చకాయను తినేముందు చిటికెడు ఉప్పు ఎందుకు జల్లుతారో తెలుసా!. అలా తింటేనే మంచిదా అంటే..

సాధారణంగా చాలామంది పుచ్చకాయను అలానే తినేస్తారు. కొందరు మాత్రం తప్పనిసరిగా చిటికెడు ఉప్పు జల్లుకునే తింటుంటారు. ఇలా తింటే ఏం జరుగుతుందో తెలుసా..!.

సహజమైన తీపి..
చిటికెడు ఉప్పు పుచ్చకాయ రుచిని మరింత తీపిగా చేస్తుంది. రుచి గ్రాహకాలు రుచిని గ్రహించే విధానాన్ని ఉప్పు ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇలా మరింత తీపిగా అనిపిస్తుందట. అలాగే ఉప్పులో ఉండే క్లోరైడ్‌ అయాన్లు తీపి రుచి గ్రాహకాలతో చర్య జరిపి తక్కువ గాఢతలో తీపిని గ్రహించే శక్తినిపెంచి, చేదుని తగ్గిస్తాయి. అంటే ఉప్పు పండులోని సహజ చక్కెరలను ఉత్తేజపరిచి వాటి ప్రభావాన్ని పెంచుతుంది, మరింత రుచికరంగా ఉంటుంది కూడా.

కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను భర్తీ చేస్తుంది. .
పుచకాయలో సహజంగా నీటి శాతం ఎక్కువ. ఇందులో సోడియం తక్కువగా ఉంటుంది. చిటికెడు ఉప్పు కలపడంతో శరీరానికి తగిని సోడియం అంది, ద్రవాలను నిలుపుకోవడానికి హైడ్రేషన్‌కు హెల్ప్‌ అవుతుంది. ఇది ప్లాస్మా పరిమాణాన్ని నిర్వహించడంలో అలాగే శరీరం తీసుకున్న నీటిని త్వరగా బయటకు పంపకుండా నిలుపుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే వేడికి గురైన వెంటనే లేదా అధిక శ్రమ తర్వాత నీరు, సోడియం కలియిక నీరు రీహైడ్రేషన్‌కి ప్రభావవంతంగా ఉంటుందట.

రుచి సమతుల్యతను మెరుగుపరుస్తుంది
కొన్నిసార్లు పుచ్చకాయ రుచి చప్పగా లేదా మరీ నీళ్ళగా అనిపించవచ్చు. చిటికెడు ఉప్పు రుచిని సమతుల్యం చేయడం తోపాటు ప్రతి ముక్కను మరింత రుచికరంగా మారుస్తుంది.

జీర్ణక్రియకు సహాయపడుతుంది..
తక్కువ పరిమాణంలో జీర్ణరసాలను ప్రేరేపించడంలో ఉప్పు సహాయపడుతుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేసుకోవడాన్ని సులభతరం చేస్తుంది. సాధారణంగా పుచ్చకాయ చాలా సులభంగా జీర్ణమవుతుంది, ఈ చిన్న చేర్పు మొత్తం తినే అనుభవాన్ని మెరుగుపరుస్తుంది, ముఖ్యంగా భోజనం తర్వాత లేదా స్నాక్‌గా తీసుకున్నప్పుడు.

శ్రద్ధగా తినేలా చేస్తుంది.. 
పుచ్చకాయకు ఉప్పు కలపడం వల్ల  తినే వేగాన్ని తగ్గిస్తుంది. ఒక గిన్నెను త్వరగా పూర్తి చేయడానికి బదులుగా, ప్రతి ముక్కను ఆస్వాదించడానికి ఆసక్తి చూపుతారు. ఇది పరిమాణ నియంత్రణకు సహాయపడటం తోపాటు సంతృప్తికరంగా అనిపించేలా చేస్తుంది. 

కాబట్టి, పుచ్చకాయకు చిటికెడు ఉప్పు కలపడం వల్ల పండు పోషక విలువలు పెద్దగా మారవు, కానీ అది తినే అనుభవాన్ని ఆనందదాయకంగా, సమతుల్యంగా చేస్తుంది. ఇక్కడ చిటికెడు ఉప్పు చాలు. ఎక్కువైతే  పండు సహజ రుచిని డామినేట్ చేసి,  సోడియం తీసుకోవడం అధికమయ్యే అవకాశం ఉంటుంది. అవసరమైతే అదనపు రుచి కోసం నల్ల ఉప్పు, కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపునులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: చాయ్‌వాలాగా 103 ఏళ్ల బామ్మ..!)
 

Videos

కొంచమైనా సిగ్గు ఉందా? ఈనాడు పిచ్చి రాతలపై దాడిశెట్టి రాజా ఆగ్రహం

పశ్చిమాసియాలో హైఅలర్ట్.. కువైట్ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ ను పేల్చేసిన ఇరాన్

వైఎస్ జగన్‌ను కలిసిన గురజాల నియోజకవర్గ స్థానిక నేతలు

బీజేపీలో చేరిన టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్

అమెరికాపై యుద్ధం ఎఫెక్ట్ భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

అమరావతి చట్టబద్దత పేరుతో బాబు డైవర్షన్ పాలిటిక్స్

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై, YSRCP రౌండ్ టేబుల్ సమావేశం

సినీ ఇండస్ట్రీ పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఈవారం ఇన్వెస్టర్లకు పండగే.. బోనస్, స్టాక్ స్ప్రిట్, డివిడెండ్లు కుమ్మరించనున్న స్టాక్స్ ఇవే..!

అంబులెన్సును తోస్తున్న పోలీసులు

Photos

+5

ఘనంగా భగవాన్‌ మహావీర్‌ జయంతి వేడుకలు (ఫొటోలు)

+5

పైలట్‌ని పెళ్లి చేసుకున్న హీరోయిన్ జనని (ఫొటోలు)

+5

భార్యతో కలిసి హీరో నితిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మార్చి నెల జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ (ఫొటోలు)

+5

రాకాస ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మెరిసిన నీహారిక.. (ఫొటోలు)

+5

బెంగళూరు : కనువిందుగా హారతి దీపాల వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్: మధ్యాహ్నం భానుడి భగభగలు.. సాయంత్రం వరుణుడి పలకరింపు (ఫొటోలు)

+5

‘రాకాస’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కిరణ్‌ అబ్బవరం ‘చెన్నై లవ్‌ స్టోరీ’ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన గుహ గురించి మీకు తెలుసా? (ఫొటోలు)