Breaking News

ప్రాణాలను కాపాడే టీకాలు!

Published on Sun, 11/29/2026 - 11:30

ఒక చిన్న సూది... కొన్ని చుక్కల టీకా... ఓ చిన్నారి జీవితానికి కొండంత రక్షణ! అయితే, టీకా బాటిల్‌లో ఉండటం వల్ల ప్రాణాలు రక్షించలేం. దాన్ని సరైన సమయంలో, సరైన మోతాదులో బిడ్డకు వేయించినప్పుడే రక్షణ లభిస్తుంది! టీకాల గురించిన ముఖ్య విషయాలను ఇక్కడ తెలుసుకుందాం... 

అలా మొదలైంది! 
టీకాల చరిత్ర... మశూచిపై మానవాళి సాధించిన విజయంతో మొదలైంది! 1796లో డాక్టర్‌ ఎడ్వర్డ్‌ జెన్నర్‌ అభివృద్ధి చేసిన మశూచి టీకా ఆధునిక టీకా వైద్యానికి బాటలు వేసింది. ఆ తర్వాత లూయీ పాశ్చర్‌ రేబిస్, ఆంత్రాక్స్‌ వంటి వ్యాధులకు టీకాలను తయారుచేశారు. భారతదేశం పల్స్‌ పోలియో కార్యక్రమంతో, 2014లో పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందింది. ఇలా ఒక్కో టీకా ఒక్కో వ్యాధిపై విజయం సాధించింది. 

కోట్లాది ప్రాణాలకు రక్షణ కవచం!
వైద్యరంగం సాధించిన గొప్ప విజయాల్లో టీకాలు ఒకటి! ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం గత 50 ఏళ్లలో ఇవి 15.4 కోట్ల ప్రాణాలను కాపాడాయి. ప్రాణాంతక వ్యాధుల ముప్పును తగ్గించడమే కాదు, ఆసుపత్రి ఖర్చులు, శాశ్వత వైకల్యాల నుంచి చిన్నారులను కాపాడుతున్నాయి. అంతేకాదు, ఎక్కువమంది టీకాలు వేయించుకుంటే, టీకాలు వేయించుకోలేని చిన్నారులకూ పరోక్ష రక్షణ లభిస్తుంది. 

ఎందుకు అవసరం?
తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన శిశువు ఎన్నో కొత్త సూక్ష్మజీవులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పటికి రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో న్యుమోనియా, మెదడువాపు, పక్షవాతం, వినికిడి లోపం, కాలేయ సమస్యలు వంటి తీవ్రమైన వ్యాధుల ముప్పు ఉంటుంది. వీటిలో కొన్ని ప్రాణాలకూ ప్రమాదకరమే. వ్యాధి వచ్చాక పోరాడటం కాదు, రాకముందే అడ్డుకోవడమే వీటి అసలు ఉద్దేశం! 

తల్లిదండ్రుల సందేహాలు... సమాధానాలు!
ప్రభుత్వ ఆసుపత్రి టీకాలా? ప్రైవేట్‌ ఆసుపత్రి టీకాలా?
రెండూ నాణ్యత, నిల్వ ప్రమాణాలు పాటిస్తూ ఇచ్చినప్పుడు సురక్షితమైనవే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జాతీయ టీకా కార్యక్రమం కింద అనేక టీకాలు ఉచితంగా లభిస్తాయి. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో అదనపు టీకాలూ అందుబాటులో ఉండవచ్చు. బిడ్డకు ఏవి అవసరమో వైద్యుడిని అడిగి తెలుసుకోండి.

జలుబు, దగ్గు లేదా స్వల్ప జ్వరం ఉంటే టీకా వేయించవచ్చా? 
సాధారణ జలుబు, దగ్గు ఉన్నా టీకాలు వేయించవచ్చు. అయితే తీవ్రమైన అనారోగ్యం ఉంటే వైద్యుల సలహా తీసుకోవాలి.

టీకా తర్వాత జ్వరం వస్తే ఏం చేయాలి?
బిడ్డకు తల్లిపాలు, తగినంత ద్రవాలు ఇవ్వాలి. అవసరమైతే వైద్యుల సూచనతో జ్వరం మందు ఇవ్వవచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముఖం లేదా గొంతు వాపు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలి.

టీకాలూ ఉచితంగా లభిస్తాయా?
జాతీయ టీకా కార్యక్రమం కింద నిర్ణీత షెడ్యూల్‌లోని అనేక ముఖ్యమైన టీకాలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇస్తారు. మీ ప్రాంతంలో అందుబాటులో ఉన్న టీకాల వివరాలను ఆరోగ్య కార్యకర్తను అడిగి తెలుసుకోండి.

టీకా వేసిన తర్వాత బిడ్డకు స్నానం చేయించవచ్చా?
స్నానం చేయించవచ్చు. అయితే ఇంజెక్షన్‌ వేసిన చోట గట్టిగా రుద్దకూడదు.

టీకాలు వేయించినా వ్యాధులు వస్తాయా?
కొన్నిసార్లు రావచ్చు. ఏ టీకా కూడా పూర్తి రక్షణకు హామీ ఇవ్వదు. అయితే వ్యాధి సోకే అవకాశాన్ని, సోకినప్పుడు దాని తీవ్రతను, ఆసుపత్రిలో చేరాల్సిన ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. 

చిన్న చర్య... జీవితకాల రక్షణ!
పిల్లల భవిష్యత్తుకు అసలైన పునాది ఆరోగ్యం. ఆ ఆరోగ్యానికి టీకాలే రక్షణ కవచం. అందుకే, ఈరోజే మీ బిడ్డ టీకా కార్డును పరిశీలించండి. ఏవైనా మిగిలి ఉంటే పూర్తి చేయించి, ఆరోగ్యకరమైన బాల్యాన్ని అందించండి!

అపోహలు ఎన్నో... వాస్తవాలు తెలుసుకోండి!
అపోహ: టీకాలు వేయిస్తే జ్వరం వస్తుంది. బిడ్డకు ఇబ్బందే!
వాస్తవం: కొన్ని టీకాల తర్వాత స్వల్ప జ్వరం, ఇంజెక్షన్‌ వేసిన చోట నొప్పి, వాపు రావచ్చు. ఇవి సాధారణంగా కొద్దిరోజుల్లో తగ్గిపోతాయి. తీవ్రమైన ఇబ్బందులు చాలా అరుదు.
అపోహ: ఆరోగ్యంగా ఉన్న బిడ్డకు టీకాలు ఎందుకు?
వాస్తవం: వ్యాధి వచ్చిన తర్వాత కాదు, రాకముందే రక్షణ కల్పించడమే టీకాల లక్ష్యం. బిడ్డ ఆరోగ్యంగా ఉన్నప్పుడే టీకాలు వేయించాలి.
అపోహ: సహజంగా వ్యాధి వచ్చి తగ్గితేనే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
వాస్తవం: వ్యాధి సోకడం వల్ల రోగనిరోధక శక్తి ఏర్పడవచ్చు. కానీ ప్రాణాపాయం, శాశ్వత వైకల్యం వంటి ప్రమాదాలూ ఉంటాయి. టీకాలు ఆ ముప్పును తగ్గిస్తాయి.
అపోహ: ఒకేసారి ఎక్కువ టీకాలు వేయిస్తే రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
వాస్తవం: వైద్యులు సూచించిన షెడ్యూల్‌ ప్రకారం ఒకే సమయంలో పలు టీకాలు వేయించడం సురక్షితం. దీనివల్ల టీకాలు ఆలస్యం కాకుండా, పదేపదే ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది.
అపోహ: టీకాలు ఆటిజానికి కారణమవుతాయి.
వాస్తవం: టీకాలకు, ఆటిజానికి సంబంధం ఉందని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు లేవు. అనేక పరిశోధనలు ఈ అపోహను ఖండించాయి.
అపోహ: తల్లిపాలు తాగుతున్న బిడ్డకు టీకాలు అవసరం లేదు.
వాస్తవం: తల్లిపాలు కొంత రోగనిరోధక రక్షణనిస్తాయి. కానీ అన్ని అంటువ్యాధుల నుంచి కాపాడలేవు. అందుకే తల్లిపాలతో పాటు టీకాలూ తప్పనిసరి.
అపోహ: టీకా మోతాదు మిస్‌ అయితే మళ్లీ మొదటి నుంచి వేయించాలి.
వాస్తవం: చాలావరకు టీకాల విషయంలో మొదటి నుంచి ప్రారంభించాల్సిన అవసరం ఉండదు. టీకా కార్డుతో వైద్యుడిని సంప్రదించి మిగిలిన మోతాదులు పూర్తి చేయించాలి.

డా‘‘ కె. పవన్‌ కుమార్‌, సీనియర్‌, పీడియాట్రిషియన్, పీడియాట్రిక్‌ అలర్జిస్ట్, ప్రొఫెసర్‌ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌
ఇదీ చదవండి: ఎద్దు వెంట్రుకలతో కనుబొమ్మలు

Videos

TDP నేత రాసలీలలు.. బయటపడ్డ సంచలన వీడియో

స్కూల్ బస్సు టైర్ల గాలి తీసిన సర్పంచ్ అక్క

హ్యాట్రిక్ కొట్టిన భారత అమ్మాయిలు.. నాలుగోసారి ఆసియా విజేతగా భారత్

బాపట్లలో ఉద్రిక్తత.. ఆమంచి కారుపై దాడి

బిర్యానీ వదిలేసి.. కూలీల భోజనంతో..! జగ్గూభాయ్ సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే

జనసేన ఉద్యోగాల స్కామ్ లో కీలక పరిణామం

అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళలపై లాఠీ ఛార్జ్

పోలింగ్ బూత్ లో రౌడీ షీటర్ హల్చల్

YSRCP నేతలను దారుణంగా కొట్టిన TDP గూండాలు

బ్యాంకుల బంపరాఫర్.. రూ.2 లక్షలు FD చేస్తే.. రూ.1 లక్ష వడ్డీ!

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో కీర్తి సురేశ్‌ గ్లామరస్ లుక్స్‌ (ఫోటోలు)

+5

సాక్షి ‘స్పెల్‌ బీ’కి విశేష స్పందన (ఫొటోలు)

+5

‘గాగ్రాచోళి’లో గ్లామర్‌ మెరుపులు.. ‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్‌ సాత్విక వీరవల్లి(ఫోటోలు)

+5

‘అలియాస్ రుక్మిణి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో జాన్వీ కపూర్‌ సందడి (ఫోటోలు)

+5

గ్లామర్ షోతో అదరగొట్టిన హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ (ఫొటోలు)

+5

నీరో మూవీ గ్లింప్స్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య ‘వృషకర్మ’ గ్రాండ్‌ ప్రెస్‌ మీట్‌ (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ మూవీ ఉల్లిపూల సాంగ్‌ రిలీజ్ (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన ప్రాంతం... ఎక్కడో మీకు తెలుసా? (ఫోటోలు)