Breaking News

ఆనంద్ మహీంద్రా ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఇదే..! తప్పనిసరిగా ఓ 20 నిమిషాలు..

Published on Mon, 06/23/2025 - 14:00

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడూ..సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ స్ఫూర్తిదాయకమైన కథలను పంచుకుంటుంటారు. ఆయన కూడా ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్య ఇస్తారు. అందుకు నిదర్శనం ఆయన ఆహార్యం. 70 ఏళ్ల వయసులోనూ అంతే ఫిట్‌గా చురుగ్గా కనిపిస్తారు. ఈసారి సోషల్‌ మీడియాలో తన హెల్త్‌ సీక్రెట్‌ని పంచుకుంటూ తానేమి ఫిట్‌నెస్‌ గురువుని కాదని చెబుతున్నారు. మరి ఆనంద్‌ మహీంద్రా ఫిట్‌నెస్‌ రహస్యం ఏంటో  సవివరంగా తెలుసుకుందామా..!.

ఆయన తన వీక్లీ ఫిట్‌నెస్ దినచర్య మారుతూ ఉంటుందని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు కూడా. అయితే మహీంద్రా ఎక్కువగా కార్డియో-వాస్కులర్ (ఈత/ఎలిప్టికల్స్), కండరాల టోన్ (బరువులు ఎత్తడం) వంటి వర్కౌట్లు చేస్తుంటారట. ఒక్కోసారి ఆ వ్యాయామాల బదులు యోగా చేస్తుంటారట. అయితే ప్రతిరోజూ తప్పనిసరిగా ఓ 20 నిమిషాలు ధ్యానం చేస్తుంటారట. 

అదే తనను పూర్తి ఆరోగ్యంతో ఉండేలా చేయడంలో కీలకపాత్ర పోషిస్తోందట. నిపుణులు సైతం 70 ఏళ్లు పైబడితే..తప్పనిసరిగా ధ్యానం చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. ఏవిధంగానో వారి మాటల్లోనే తెలుసుకుందాం. 

ధ్యానం ఆరోగ్యానికి మంచిదా..
60 ఏళ్లు దాటాక..కండరాల ద్రవ్యరాశి, ఎముక సాంద్రత తగ్గడం అనేది స్పష్టంగా తెలుస్తుంది. క్రమంగా వయసు పెరిగేకొద్దీ..ఇమ్యూనిటీ పవర్‌ కూడా ఆటోమెటిగ్గా తగ్గుతుంది. అందువల్ల అలాంటి పెద్దవాళ్లు తప్పనిసరిగా బరువులు ఎత్తే వ్యాయామాలు, ఈత వంటివి చేస్తే..కండరాలకు సరైన కదలిక, బలం ఏర్పడుతుందట. దీనికి తోడు వ్యాయామం కూడా చేయడం వల్ల ..అవయవాలన్నీ రిలాక్స్‌ మోడ్‌లో ఉండి..మనసుపై ధ్యాస పెట్టగలుగుతారట. 

తమపై తాము దృష్టిసారించే ఈ అమూల్యమైన సమయం..భావోద్వేగాలను కట్టడి చేసేందుకు దోహదపడుతుంది. ఆ వయసులో మనసులో కలిగే లేనిపోనీ భయాలు మాయమవ్వడమే గాక..తెలియని ఆత్మవిశ్వాసం ఏర్పడి బాడీలో ఆటోమేటిగ్గా వ్యాధినిరోధిక శక్తి కూడా పెరుగుతుందట.

ఎలా చేయాలంటే..

  • కుషన్ లేదా కుర్చీపై కూర్చోండి. వెన్నెముక నిటారుగా లేదా విశ్రాంతి స్థితిలో ఉంచండి

  • కళ్ళు మూసుకుని మీ శ్వాసపై ధ్యాస పెట్టండి. 

  • ఈ అభ్యాసం అలా సాగితే..ఆటోమేటిగ్గా తెలియకుండానే అలవాటుగా మారడటమే గాక, మంచి మార్పులు మొదలవ్వుతాయట. 

  • ముఖ్యంగా శారీరకంగా, మానసికంగా మెరుగ్గా ఉండేలా చేసి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

(చదవండి:  అప్పుడు ఆర్మీ అధికారి.. కానీ ఇవాళ వీధుల్లో..)

 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)