Breaking News

కీలు మారాక 'ఫీల్‌ ఎలా ఉంది'?

Published on Sun, 06/01/2025 - 17:37

చాలా ఏళ్ల కిందట ఇటీవల మోకాలి దగ్గర ఉన్న కీళ్లు అరిగితే... తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు. పాత నొప్పులంటూ చెబుతూ జీవితాంతం బాధపడేవారు. కదలడానికి కూడా కష్టపడుతూ, నడవడానికి నానా యాతన పడుతూ జీవితాన్ని వెళ్లబుచ్చేవారు. కానీ గత కొన్ని దశాబ్దాలుగా మోకాలి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు చాలా వేగంగా ప్రాచుర్యం పొందడంతో ఈ శస్త్రచికిత్సలు చేయించుకునేవారు ఎక్కువగా ఉంటున్నారు. నిజానికి మోకాలి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స ఒక ఎత్తైతే... ఆ తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలూ, సూచనలూ మరో ఎత్తు. వీటిని ఎంత సమర్థంగా అమలు చేస్తే... నడక అంత వేగంగానూ అంత మెరుగ్గానూ జరుగుతుంది. మోకాలి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలూ, పాటించాల్సిన సూచనలపై అవగాహన కోసం  ఈ కథనం.

మోకాలి కీళ్ల మార్పిడి చికిత్సలో భాగంగా డాక్టర్లు సాధారణంగా బాధితులకు రెండు రకాల శస్త్రచికిత్సలు చేస్తుంటారు. మొదటిది పూర్తి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స (కంప్లీట్‌ నీ– రీప్లేస్‌మెంట్‌ సర్జరీ), రెండోది... పాక్షిక మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స (పార్షియల్‌ నీ – రీప్లేస్‌మెంట్‌ సర్జరీ). 

వీటిల్లో పాక్షిక మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలో కోలుకోవడం అన్నది చాలా త్వరితంగా... అంటే రెండు నుంచి నాలుగు వారాల్లో జరుగుతుంది. అదే పూర్తి మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స తర్వాత కోలుకోడానికి నాలుగు నుంచి ఆరు వారాల వ్యవధి అవసరం. బాధితుల అవసరాన్ని బట్టి ఈ రెండింటిలో ఒకదాన్ని డాక్టర్లు సూచిస్తారు. ఈ రెండింటి ప్రభావాలూ, మన్నిక ఒకేలా ఉంటాయి. 

పోలికలు వద్దు... 
పైన పేర్కొన్న కాల వ్యవధులను చాలామంది వ్యక్తులను పరిశీలించి... ఓ సగటు సమయాన్ని పేర్కొనడం కోసం చెప్పేవి మాత్రమే. వారి వారి శరీర తత్త్వాన్ని బట్టీ, అలాగే రోగనిరోధక వ్యవస్థ తాలూకు చురుకుదనం, వారి సాధారణం ఆరోగ్యం, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలూ వీటన్నింటి ఆధారంగా కోలుకునే సమయం ఒకరి నుంచి మరొకరికి మారవచ్చు. 

శస్త్రచికిత్స తర్వాత నొప్పి వస్తుండే వ్యవధి కూడా ఒకరి నుంచి మరొకరికి వేరుగా ఉండవచ్చు. అందుకే మోకాలి కీలు మార్పిడి జరిగిన ఇతర వ్యక్తులతో ΄ోల్చుకోవడం సరికాదు. దీనివల్ల మానసిక ఆందోళన పెరగడం, దాంతో వ్యాధి నిరోధక వ్యవస్థ మందగించడం వల్ల గాయం తగ్గడానికి పట్టే సమయం పెరగవచ్చు. అందుకే మరొకరితో ΄ోల్చుకోవడం ఎట్టిపరిస్థితుల్లోనూ వద్దు. 

శస్త్రచికిత్సకు ముందున్న స్టిఫ్‌నెస్‌ :  శస్త్రచికిత్సకు ముందు మోకాలి దగ్గర కదలికలు చాలా పరిమితంగా మాత్రమే ఉన్నవారికి ఆ తర్వాత కదలికలు పెరుగుతాయి. అయితే మునుపు అంతగా స్టిఫ్‌గా లేనివారితో పోలిస్తే ఇలా స్టిఫ్‌గా ఉన్నవారిలో కదలికలు అంతగా పెరగకపోవచ్చు. 

నొప్పి తీవ్రత ఎక్కువ తక్కువలు : నొప్పి తక్కువగా ఉన్నవారు ఫిజియో వ్యాయామాలను సమర్థంగా చేయగలుగుతారు అందుకే వారిలో మెరుగదల గణనీయంగా ఉండవచ్చు. నొప్పి విపరీతంగా ఉన్నవారిలోనూ, వ్యాయామల సమయంలో నొప్పిని అంతగా భరించలేనివారిలో వ్యాయామాలు అంత ఎక్కువగా లేకపోవడం వల్ల పూర్తిస్థాయి నార్మల్‌ కదలికలు రాకుండా కేవలం పరిమితంగా మాత్రమే మెరుగుదల కనిపించవచ్చు. 

ఇలా నొప్పి ఎక్కువగా ఉండేవారు దాన్ని భరించాల్సిన అవసరం లేదు. డాక్టర్‌ను సంప్రదించి నొప్పి వాళ్ల ఆధ్వర్యంలో నివారణ మందులు వాడుతూ వ్యాయామాలు చేస్తూ తాము కోరుకున్న స్థాయి మెరుగుదలను పొందవచ్చు.

మెరుగుదల ఆధారపడే అంశాలివే... 
శస్త్రచికిత్స తర్వాత కాలి కదలికలు మామూలుగా మారడం లేదా మోకాలి దగ్గర నార్మల్‌గా ఉండటం అన్నవి కొన్ని అంశాల మీద ఆధారపడి ఉంటుంది. వాటిలో ప్రధానమైనవి... 

శస్త్రచికిత్సలో ఏ టెక్నిక్‌ వాడారనే అంశం : శస్త్రచికిత్సలో ఏ తరహా టెక్నిక్‌ వాడారనే అంశంతో పాటు శస్త్రచికిత్స సమయంలోనే లోపల ఉన్న అవరోధాలనూ, వైకల్యాలను, ఇతరత్రా సమస్యలను ఏ మేరకు రిపేర్‌ చేశారనే అంశాలపై కూడా శస్త్రచికిత్స తర్వాతి మెరుగుదల ఆధారపడి ఉంటుంది. 

కృత్రిమ మోకాలు తాలూకు డిజైన్‌ : కృత్రిమంగా లోపల అమర్చే భాగాన్ని ప్రోస్థెసిస్‌’ అంటారు. ఈ ప్రోస్థెటిక్‌ డిజైన్‌ను బట్టి కూడా మెరుగుదల ఉంటుంది. ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వస్తున్న డిజైన్‌లు మోకాలి కీళ్ల దగ్గర కదలికలు ఫుల్‌ 
రేంజ్‌లో చాలా ఎక్కువగా (గరిష్ఠంగా) ఉండేలా డిజైన్‌ చేసినవి అందుబాటులోకి వస్తున్నాయి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి... 
శస్త్రచికిత్స సమయంలో పెట్టే గాటు వద్ద కొందరికి స్పర్శ తెలియకపోవడం (నంబ్‌నెస్‌) లాంటి లక్షణాలు కనిపిస్తే మరికొందరిలో అక్కడ ముట్టుకోనివ్వకపోవడం (హైపర్‌సెన్సిటివిటీ) లాంటి లక్షణం కనిపించవచ్చు. అందుకే బాధితులలో కనిపించే లక్షణం ఏదైనా దాని గురించి ఆందోళన వద్దు. దాని గురించి ఇతర బాధితుల లేదా శస్త్రచికిత్స జరిగినవారితో మీ భావాలు పంచుకోకుండా  కేవలం మీ డాక్టర్‌తో మాట్లాడటమే మంచిది. 

శస్త్రచికిత్స గాయం దగ్గర ఇలా స్పర్శ తెలికుండా ఉన్న కొందరిలో గాటు పెట్టిన భాగం పొడిగా ఉండటంతో పాటు అక్కడ దురద వస్తుండటం జరగవచ్చు. ఇలాంటప్పడు అక్కడ పైపూతగా రాసే మాయిష్చరైజర్‌ (టాపికల్‌ మాయిష్చరైజర్‌) రాయడం మంచిది.

మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స తర్వాత... చేయాల్సినవీ... చేయకూడనివి... 
మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స తర్వాత గాయం నయం కావడం గానీ లేదా మెరుగుదల గానీ, కృత్రిమ కీలు చాలా రోజులు మన్నికతో ఉండటానికి గానీ పాటించాల్సిన సూచనలలో ప్రధానమైవి...

చేయాల్సినవి... 

బరువు అదుపులో ఉంచుకోవడం (స్థూలకాయం వల్ల కృత్రిమ కీలుపై బరువు పడటం వల్ల మన్నిక తగ్గే అవకాశమున్నందున బరువును అదుపులో ఉంచుకోవడం అవసరం). 

కృత్రిమ కీలు వద్ద తగినంత కదలికలూ, కీలుకు అవసరమైన బలం సమకూరడంతో పాటు అది చాలాకాలం మన్నికతో ఉండటం కోసం క్వాడ్రసెప్, హ్యామ్‌స్ట్రింగ్‌ కండరాలకు బలం చేకూరే వ్యాయామాలు చేయడం. 

క్రమం తప్పకుండా ఈత (స్విమ్మింగ్‌), సైక్లింగ్, నడక (వాకింగ్‌) వ్యాయామాలు. ఇక్కడ పేర్కొన్న వ్యాయామాల్లో బాధితులకు అనువుగా ఉన్నవాటిని రోజుకు 30 నుంచి 45 నిమిషాల పాటు వారంలో కనీసం ఆరు రోజుల పాటు చేస్తుండాలి.

చేయకూడనివి... 
పరుగు (రన్నింగ్‌), ఆటలాడటం వంటి వ్యాయామాలు వద్దు. దీనివల్ల అమర్చిన  కృత్రిమ కీలుపై భారం ఎక్కువగా పడి అక్కడ గాయం రేగవచ్చు. 

మోకాళ్లు పూర్తిగా ముడుచుకునేలా గుంజీళ్లు తీయడం వంటి వ్యాయామాలూ, అలాగే గొంతుక్కూర్చోవడం, బాసిపట్లు వేసి కూర్చోవడం వద్దు. 

కృత్రిమ కీలు ప్రోస్థెసిస్‌)లోని పాలీ ఇథిలీన్‌  / ప్లాస్టిక్‌ స్పేసర్‌ భాగం కొంత సున్నితమైనది. కాబట్టి నడక, కఠిన వ్యాయామాలు, రఫ్‌గా ఉపయోగించడం వంటి సందర్భాల్లో కొంత విచక్షణ పాటించి జాగ్రత్తగా చూసుకోవడం మేలు.

నరాలకు సంబంధించిన సమస్యలుగానీ లేదా నడకలో నొప్పిగాని ఉంటే వాకర్‌  లేదా వాకింగ్‌ స్టిక్‌ వంటి ఉపకరణాల సహాయం తీసుకోవడం మంచిది. 

చివరగా... కృత్రిమ కీలు కొత్తగా శరీరంలోకి వచ్చి చేరిన భాగమైనందువల్ల మిగతా అవయవాల లాగే దాని గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జాగ్రత్తగా ఉండాలి. ఈలోపు జ్వరం, గాయం దగ్గర తీవ్రమైన నొప్పి రావడం లేదా ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే తక్షణం డాక్టర్‌ను సంప్రదించాలి. అలాగే చెవి, గొంతు, మూత్రసంబంధ ఇన్ఫెక్షన్లు కనిపించినా వెంటనే డాక్టర్‌ను కలవాలి. అంతే తప్ప సొంత చికిత్స రూపంలో యాంటీబయాటిక్స్‌ వాడటం సరికాదు. 

పైన పేర్కొన్న సూచనలతో కృత్రిమ కీలును దాదాపు 15 నుంచి 20 ఏళ్లు మన్నేలా జాగ్రత్త పడవచ్చు. శస్త్రచికిత్స సమయంలో పెట్టే గాటు వద్ద కొందరికి స్పర్శ తెలియకపోవడం (నంబ్‌నెస్‌) లాంటి లక్షణాలు కనిపిస్తే మరికొందరిలో అక్కడ ముట్టుకోనివ్వక΄ోవడం (హైపర్‌సెన్సిటివిటీ) లాంటి లక్షణం కనిపించవచ్చు. అందుకే బాధితులలో కనిపించే లక్షణం ఏదైనా దాని గురించి ఆందోళన వద్దు. 

శస్త్రచికిత్స గాయం దగ్గర ఇలా స్పర్శ తెలికుండా ఉన్న కొందరిలో గాటు పెట్టిన భాగం పొడిగా ఉండటంతోపాటు అక్కడ దురద వస్తుండటం జరగవచ్చు. ఇలాంటప్పడు అక్కడ పైపూతగా రాసే మాయిష్చరైజర్‌ (టాపికల్‌ మాయిష్చరైజర్‌) రాయడం మంచిది. 
డాక్టర్‌  ప్రవీణ్‌ మేరెడ్డి,సీనియర్‌ కన్సల్టెంట్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్‌. 

(చదవండి: పచ్చి క్యాబేజ్‌ సలాడ్‌లు తింటున్నారా..? నిపుణుల స్ట్రాంగ్‌ వార్నింగ్‌)

Videos

వెన్నుపోటు దినం కేవలం ట్రైలర్ మాత్రమే.. రాచమల్లు శివప్రసాద రెడ్డి మాస్ కౌంటర్

డ్రగ్స్ దందాలో ఏపీ పోలీసులు

Ambati: ఈనాడు CI కి సపోర్ట్, CI కి లోకేష్ సపోర్ట్

ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎనౌకౌంటర్

Trinamool: ఎంపీ రహస్య వివాహం

చంద్రబాబు, పవన్, లోకేష్ పై బియ్యపు మధుసూదన్ రెడ్డి పంచులే పంచులు

మంత్రి కొండా సురేఖకు అస్వస్థత

TS Cabinet Meeting: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల నివేదికపై చర్చ

జగన్‌ని చూస్తే వాళ్లకు వెన్నులో వణుకు చంద్రబాబుపై పోతిన మహేష్ ఫైర్

ఆర్‌సీబీ ఫ్యాన్స్ బలి: 11 Fans Dead in Stampede

Photos

+5

ఆల్‌ది బెస్ట్ టీమిండియా.. ఇంగ్లండ్‌కు ప‌య‌న‌మైన గిల్ సేన‌ (ఫోటోలు)

+5

పర్యావరణాన్ని అత్యద్భుతంగా చూపే పర్యాటక ప్రదేశాలివే..!

+5

దుబాయ్‌లో సమంత టూర్‌.. వైరల్‌ ఫోటోలకు లక్షల్లో లైకులు

+5

కేన్సర్‌పై పోరులో అన్నీ తానైన ప్రియుడితో నటి హీనాఖాన్‌ పెళ్లి సందడి (ఫొటోలు)

+5

ఏపీలో ఉన్న ఈ అందమైన అభయారణ్యం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

కమల్‌ హాసన్ 'థగ్‌ లైఫ్‌' మూవీ HD స్టిల్స్‌

+5

విషాదం నడుమే.. ఆర్సీబీ జట్టుకు కర్ణాటక ప్రభుత్వ సన్మానం (ఫొటోలు)

+5

Kuldeep Yadav Engagement : ఘనంగా స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌ నిశ్చితార్థం (ఫొటోలు)

+5

బెస్ట్ ఫ్రెండ్ పెళ్లిలో హీరోయిన్ ఆలియా భట్ (ఫొటోలు)

+5

ఆర్సీబీ విజయోత్సవంలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో ఏడుగురి దుర్మరణం (ఫోటోస్)