Breaking News

కేన్సర్‌తో పోరాడుతూ షూటింగ్‌లో పాల్గొన్నా..! ఆ కారణంగానే ఆమె..

Published on Mon, 07/13/2026 - 15:53

బాలీవుడ్‌ నటి, మోడల్‌ నఫీసా అలీ కేన్సర్‌ వారియర్‌. ఇప్పటికీ దానిపై పోరాడుతున్నారామె. నిజానికి ఇలాంటి వ్యాధి ఎంతటి వ్యక్తులనైనా కుంగదీసేస్తుంది. కానీ ఆమె ఆ మహమ్మారి విడవకుండా మరోసారి తిరగబెడుతున్నా..నవ్వుతూనే పోరాడుతోంది. పైగా ఎందుకిలానో ఆమెనే స్వయంగా వెల్లడించారు. అంతేగాదు తనకు తొలిసారి కేన్సర్‌ నిర్థారణ అయినప్పుడూ కూడా షూటింగ్‌ల్లో పాల్గొన్నానని అందుకు కారణం ఉందంటూ ఆలోచింప చేసేలా మాట్లాడారామె. ఆ ఆసక్తికర విషయాల గురించి సవివరంగా తెలుసుకుందామా. 

బాలీవుడ్‌ ప్రముఖ నటి నఫీసా అలీ జూనూన్' (1979), 'మేజర్ సాబ్' (1998), 'లైఫ్ ఇన్ ఎ మెట్రో' (2007), 'గుజారిష్' (2010), 'యమ్లా పగ్లా దీవానా' (2011) వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలలో నటనకు పేరుగాంచింది. తన నటన, అభినయంతో విమర్శకులు ప్రశంసలు అందుకున్న ఈ బెంగాలీ భామకు 'మ్యాక్స్, మిన్ అండ్ మ్యావ్‌జాకి' షూటింగ్‌ సమయంలోనే స్టేజ్‌ 3 కేన్సర్‌తో పోరాడుతున్నట్లు తెలిపింది. 

అయితే ఆ టైంలో ఈ మూవీని పూర్తి చేయగలనా..ఆ పాత్రలో నటించగలనా అనే భయాలు వెంటాడుతున్న తరుణంలో ఆ చిత్రనిర్మాత పద్మకుమార్ నరసింహమూర్తి తనపై పూర్తి నమ్మకం ఉంచారని అందుకు ఆయనకు శతకోటి ధన్యవాదాలని అన్నారామె. ఆయన తనని ప్యాడీ అని ముద్దుగా పిలిచేవారని, ఆ టైంలో అంత ధైర్యంగా సినిమా చేయడానికి కారణం కూడా ఆయనే అని నాటి ఘటనను గుర్తుతెచ్చుకున్నారు. ఆ చ్రితం కూడా చక్కటి సందేశాన్ని ఇచ్చేది కావడం ఒకటైతే, కేన్సర్‌ లాంటి వ్యాధితో పోరాడుతూ కూడా తన పనుల్లో సాగిపోవాలని భవిష్యత్తు తరాలకు కొత్త ఆశను అందించేందుకు అంటోంది నఫీసా అలీ. 

అంతేగాదు తన జీవితంతో ఒక సందేశాన్ని అందించాలనే పోరాటమే అత్యంత ముఖ్యమైనదని తెలుసుకున్నా. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతోందో ఎవ్వరికీ తెలియదు, అలాంటప్పడు నాకే ఇలా అనే కుంగుబాటుకు లోనవ్వాల్సిన పనిలేదు అని చెప్పేందుకని అంటోందామె. ఇలాంటి సమయంలో మనం ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవాలి, అందరూ దీని గురించి ఆలోచించడం ముఖ్యం. అలాగే ఇలాంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు, నైతిక బాధ్యత గురించి ఆలోచించాలని చెబుతోంది. 

జీవితం ఎప్పటికీ అనూమ్యమైనదే, అందుకనే ప్రజలు సదా కరుణతో ఉండాలి, సాముహిక బాధ్యతను కలిగి ఉండాలన్నేదే నమ్ముతానని అంటోంది. ఈ రోజు ఇక్కడ ఉన్నానని, రేపు ఏం జరుగుతుందనే ఎవరికి తెలుసు కాబట్టి ఆ వ్యాధిపై ధైర్యంగా పోరాడుతూనే ఉండండి..ఆ సత్యాన్ని చెప్పేందుకే ఆ సమయంలో కూడా షూటింగ్‌లలో పాల్గొన్నట్లు తెలిపింది. తాను అప్పుడు స్టేజ్ 3 కేన్సర్‌తో పోరాడా, గెలిచా..కానీ మళ్లీ తిరగబెట్టి స్టేజ్‌ 4 కు చేరుకుంది అయినా..తన పోరాటం ఆపనని ధీమాగా చెబుతోందామె. 

ఆమె ముందు క్రీడాకారిణి..
కోల్‌కతాలో బెంగాలీ తండ్రికి, ఆంగ్లో ఇండియన్‌ తల్లికి జన్మించిన నఫిసా అలీ విభిన్న సంస్కృతులు కలగలసిన కుటుంబ నుంచి వచ్చారామె. ఆమె స్విమ్మింగ్‌లో అర్జున అవార్డు గ్రహిత. క్రీడాకారుడైన కల్నల్‌ రవీందర్‌ సింగ్‌ సోధీని పెళ్లి చేసుకున్నారు. నటలోకి ప్రవేశించడానికి ముందే ఆమె నేషనల్‌ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌గా ఉండేవారు. 

1976లో ఈవ్స్ వీక్లీ మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్నారు. అంతేగాదు శశి కపూర్‌, ధర్మేంద్ర, అమితాబ్‌ బచ్చన్‌ వంఇ ప్రముఖ నటనలతో పనిచేశారు. 2004, 2009లలో లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేశారు. 2005లో, ఆమె చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా (CFSI) ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. నవంబర్ 2018లో, ఆమెకు స్టేజ్ 3 పెరిటోనియల్, ఓవేరియన్ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.

 

(చదవండి: కదులుతున్న రైలులో పూజలు..! రైల్వే ఏం చెప్పిందంటే)

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)