అడపాదడపా ఉపవాసం.. మహిళలకు చేటు!

Published on Fri, 01/30/2026 - 14:03

బరువు తగ్గించే పద్దతుల్లో అడపాదడపా ఉపవాసం (ఇంటర్మిటెంట్‌  ఫాస్టింగ్‌(ఐఎఫ్‌). బరువు తగ్గడానికి అత్యంత సులభమైన పద్ధతిగా పేర్కొంటారు. త్వరితగతిన బాడీలో మార్పులు..పైగా ఆరోగ్యకరమైన విధానమని పలువురు వెల్న్‌స్‌ నిపుణుల అభిప్రాయం. అయితే ఇది మహిళలకు ఎప్పటికీ ప్రమాదకరమని, ముఖ్యంగా పీరియడ్స్‌ వచ్చే మహిళలకు మరింత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు ఫెర్టిలిటీ కోచింగ్‌ వ్యవస్థాపకురాలు ప్రీతికాసిరెడ్డి. సోషల్‌ మీడియా వేదికగా ఈ పద్ధతి మహిళ ఆరోగ్యానికి ఏవిధంగా చేటు చేస్తుందో తన స్వీయానుభవాన్నిషేర్‌ చేసుకున్నారు.

విపరీతంగా ప్రజాదరణ పొందిన అడపాదడపా ఉపవాసం మహిళల ఆరోగ్యానికి చాలా వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు. ఇది హర్మోన్లను ఇన్‌బ్యాలెన్స్‌ కారణమయ్యే విధానంగా అభివర్ణించారు. దీన్ని అవలంభించడంతో తనకు టీ స్థాయిలు గణనీయంగా పడిపోయాయని, జీవక్రియ నెమ్మదించిందని, కార్టిసాల్‌ స్థాయిలు ఉదయంపూట ఎక్కుగా ఉన్నట్లు తెలిపారు. అలాగే నిరంతరం చలిగా అనిపించిందని, పీరియడ్స్‌ రావడం తగ్గిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని అన్నారామె. 

ఈ విధానం మహిళల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదమని తేల్చి చెప్పారామె. నిజానికి ఈ విధానంలో అల్పాహారం దాటవేయాల్సి ఉంటుంది. ఇది శరీరాన్ని ఆహరం కంటే కార్టిసాల్‌తో నడపేలా బలవంతం చేస్తుందన్నారు. ఫలితంగా థైరాయిడ్‌ పనితీరుపై ప్రభావం చూపడం, పునరుత్పత్తి ఆరోగ్యాన్ని దెబ్బతీయడం వంటి సమస్యల బారిన పడతారని హెచ్చరిస్తున్నారామె. బ్రేక్‌ఫాస్ట్‌ అనేది శక్తి కదలికని, అది తప్పనసరి అన్నారామె. ఇక ఈ అడపాదడపా ఉపవాసం..తప్పుదారి పట్టించే వెల్నెస్‌ సలహాగా అభివర్ణించారామె. 

అడపాదడపా ఉపవాసం అంటే..
ఈ విధానంలో ఏం తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు అనేదానిపై ఫోకస్‌ పెట్టే చేసే డైట్‌ విధానం. అత్యంత సాధారణ వెర్షన్ 16:8 పద్ధతి. ఇక్కడ 16 గంటలు ఉపవాసం ఉండి ఎనిమిది గంటలలోపు తినాల్సి ఉంటుంది. ఇది డైటింగ్‌ను సులభతరం చేస్తుందని, బరువు తగ్గడంలో సహాయపడుతుందని, జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని పలువురు నిపుణులు వాదన. .

సైన్స్‌ ఏం అంటుందంటే..
అయితే ఈ వాదనలలో కొన్నింటిని సైన్స్ సమర్థిస్తుంది. బహుళ అధ్యయనాలు IF బరువు తగ్గడానికి, నడుము చుట్టుకొలతను తగ్గించడానికి, రక్తంలో మెరుగైన చక్కెర నియంత్రణకు ఉపకరిస్తుందని చెబుతున్నారు. 

నిపుణులు ఏమంటున్నారంటే..
నొయిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్స్ డీన్ డాక్టర్ సుప్రియా అవస్థి మాట్లాడుతూ, అడపాదడపా ఉపవాసం మహిళలందరికీ మంచిది కాదని చెప్పలేం కానీ ఇది అందరికీ సురక్షితమైనది కాదని అన్నారు. అయితే మహిళలు తమ ఆరోగ్యానికి సరిపడితే ఈ పద్ధతి పాటించొచ్చని, అయితే చాలామటుకు మహిళల్లో ఈ విధానం వల్ల హార్మోన్ల అసమతుల్యతకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చిరిస్తున్నారు. పురుషుల కంటే మహిళలు ఎక్కువ సేపు ఆహారం తీసుకోకుండా ఉండాలంటే కష్టమని, అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అన్నారు.

 

(చదవండి: పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు తీవ్రమైన కంటి వ్యాధి.. ఆర్‌వీఓ అంటే..?)

 

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)