amp pages | Sakshi

Health Tips: ఉసిరి టీ.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!

Published on Sat, 11/26/2022 - 16:25

Health Tips In Telugu- Amla Tea: కొందరికి రెండు గంటలకోమాటు టీ తాగడం అలవాటు. అయితే మధుమేహం ఉన్నవారు పంచదార వేసిన టీ తాగకూడదు. కానీ టీ అలవాటు ఉన్నవారు టీకి బదులు పంచదార కలపని టీ కోసం ప్రయత్నిస్తుంటారు.

అయితే ఉసిరి టీ తాగితే ఇటు టీ తాగాలన్న కోరిక తీరడంతోపాటు.. విటమిన్‌ సి, పీచుపదార్థం, క్యాల్షియం వంటివి శరీరానికి అందుతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. 

ఉసిరి టీని ఎలా తయారు చేసుకోవాలంటే...
►రెండు ఉసిరికాయలు, అరంగుళం అల్లం ముక్క తీసుకోవాలి
►ఈ రెండింటిని చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేయాలి.
►గ్లాసు నీళ్లు తీసుకుని స్టవ్‌పై పెట్టి గింజలు తీసేసిన ఉసిరి, అల్లం ముక్కలను దానిలో వేసి మరిగించాలి.

►ఇవి మరిగాక నీళ్లలో అరస్పూను దాల్చిన చెక్కపొడి వేసి స్టవ్‌ ఆపేసేయాలి.
►ఈ నీళ్ల గిన్నెపై మూతపెట్టి ఐదునిమిషాలు పక్కన పెట్టుకోవాలి.  
►తరువాత వడగట్టి టీలా తాగాలి.
►ఈ టీని రోజూ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. 

బరువు తగ్గొచ్చు!
►ఉసిరి, అల్లం తాజాగా అందుబాటులో లేనప్పుడు.. కప్పు నీళ్లను వేడిచేసి దానిలో స్పూను ఉసిరిపొడి, స్పూను సొంఠి పొడి, అరస్పూను దాల్చిన చెక్కపొడి వేసి కలపాలి.
►ఈ నీళ్లపై మూతపెట్టి ఐదు నిమిషాలు మరిగించాలి.
►నీళ్లు బాగా మరిగాక దించేసి తాగే వేడికి వచ్చాక వడకట్టకుండా నేరుగా తాగాలి. 
►దీనిని తాగడం వల్ల కొవ్వు తగ్గుతుందని.. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయోగకరమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
నోట్‌: ఈ కథనం కేవలం ఆరోగ్యం మీద అవగాహన కోసం మాత్రమే! ఆరోగ్య సమస్యలను బట్టి వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సరైన పరిష్కారం పొందవచ్చు.

చదవండి: Health Tips: రోజూ ఉసిరికాయ తింటున్నారా... ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు
Heart Healthy Foods: గుండెకు మేలు చేసే ఆహార పదార్థాలు ఇవే! అయితే ప్రతి రోజూ ఓట్స్‌ తినడం వల్ల..

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)