మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!
Breaking News
పాత ఆలోచనా విధానాన్ని కూల్చేయండి
Published on Sat, 03/07/2026 - 07:10
ఇప్పటివరకు మనల్ని మనం గమనించాం, మన లోపాలను గుర్తించాం, మన మెదడు మనకు చెప్పే అబద్ధాలను పట్టుకున్నాం. ఇప్పుడు ఆ పాత పునాదిని పూర్తిగా కూల్చివేసి (Break), కొత్తదానికి సిద్ధమయ్యే సమయం. ఎందుకంటే, పాత భవనం మీద కొత్త ఇల్లు కట్టలేం కదా! మన పాత పర్సనాలిటీని ఎలా 'బ్రేక్' చేయాలో చూద్దాం.
పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌లో 'బ్రేక్' చేయడం అంటే మనల్ని మనం నాశనం చేసుకోవడం కాదు, మనల్ని మనం పరిమితం చేస్తున్న ఆ పాత 'ఐడెంటిటీ' (Identity) ని వదిలించుకోవడం. దీనినే సైకాలజీలో 'De-conditioning' అంటారు. మీరు ఇన్నాళ్లూ నమ్మిన 'నేను' అనే వ్యక్తి, కేవలం పరిస్థితులు సృష్టించిన ప్రతిబింబం మాత్రమే. ఆ ప్రతిబింబాన్ని ఇప్పుడు తుడిచేయాలి.
1. పాత పునాది ఎందుకు కూలిపోవాలి?
చాలామంది తమ పాత అలవాట్లను, పాత భయాలను ఎందుకు వదలలేకపోతారంటే, అవి వారికి సుపరిచితమైనవి. అవి మనకు కష్టం కలిగించినా, అవి మనకు తెలిసినవి కాబట్టి వాటిని వదలడానికి భయపడతాం.
పాత ఆలోచనలు = మీ గతం.
కొత్త పర్సనాలిటీ = మీ భవిష్యత్తు.
ఈ రెండింటికీ మధ్య ఒక గ్యాప్ ఉంటుంది, అదే 'The Void' (శూన్యం). ఈ శూన్యంలోకి వెళ్లడానికి చాలామంది భయపడతారు. కానీ, ఆ శూన్యమే మీ కొత్త వ్యక్తిత్వానికి పునాది!
2. కూల్చివేతకు కావాల్సిన మూడు ఆయుధాలు
మీ పాత ఐడెంటిటీని బ్రేక్ చేయడానికి మీకు మూడు ముఖ్యమైన ఆయుధాలు కావాలి.
Radical Honesty: మీకు మీరు అబద్ధం చెప్పుకోవడం మానేయాలి. "నాకు కోపం రాదు" అని అబద్ధం చెప్పే బదులు, "నేను అతిగా రియాక్ట్ అవుతున్నాను, అది నా బలహీనత" అని ఒప్పుకోవాలి. నిజం మాట్లాడటం మొదలుపెడితే, పాత అబద్ధపు గోడలు దానంతట అదే కూలిపోతాయి.
Detachment: మీ ఆలోచనలు, మీ భావోద్వేగాలు మాత్రమే మీరు కాదు. కోపం వచ్చినప్పుడు "నేను కోపంగా ఉన్నాను" అనడం కంటే, "నాలో కోపం అనే భావం కలుగుతోంది" అని అనండి. ఆ ఆలోచనల నుండి మిమ్మల్ని మీరు వేరు (Detach) చేసుకున్నప్పుడే మీరు వాటిని బ్రేక్ చేయగలరు.
Destruction of Comfort Zone: ప్రతిరోజూ మీకు భయం కలిగించే చిన్న పనిని చేయండి. మీ పాత వ్యక్తిత్వం ఎక్కడైతే ఆగిపోతుందో, అక్కడ మీరు అడుగు వేయండి.
3. మార్కెట్ మోటివేషన్ vs రియల్ సైకాలజీ
మార్కెట్ "నేను గెలుస్తాను, నేను తోపు" అని అరుస్తూ గోడలను బద్దలు కొట్టమంటుంది. ఇది తాత్కాలిక జోష్.
సైకాలజీ (CBT & Mindfulness) గోడలను కొట్టడం కాదు, ఆ గోడలు అసలు ఎందుకు కట్టామో (పాస్ట్ ట్రామాస్) అర్థం చేసుకుని, వాటిని ఇటుక ఇటుకగా విడదీయమంటుంది. అప్పుడే మళ్ళీ ఆ గోడలు కట్టే అవకాశం ఉండదు.
4. మీ నూతన నిర్మాణానికి సిద్ధం!
Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ కూల్చివేత ప్రక్రియ ఎలా ఉండాలి?
Step 1: Break (అహాన్ని వదిలేయడం)
మీరు ఇన్నాళ్లు కాపాడుకున్న ఆ 'ఇమేజ్'ని వదిలేయండి. "నేను అంటే ఇలాగే ఉంటాను" అనే ఫిక్స్డ్ మైండ్‌సెట్‌ను వదిలేయండి. మీ పాత ఐడెంటిటీని 'డీ-కన్స్ట్రక్ట్' (Deconstruct) చేయండి. ఇది నొప్పిగా ఉంటుంది, కానీ ఇది అవసరం.
Step 2: Build (నిశ్శబ్దం)
పాత పర్సనాలిటీ కూలిపోయిన తర్వాత, కొత్తది కట్టే ముందు కొద్ది రోజులు 'నిశ్శబ్దం'గా ఉండండి. ఏ ప్లాన్లు లేని, ఏ లేబుల్స్ లేని ఒక శూన్య స్థితిలో ఉండండి. అక్కడే మీ అసలైన పర్పస్ (Purpose) పుడుతుంది.
Step 3: Beyond (కొత్త ప్రతిబింబం)
ఇప్పుడు మీరు కొత్త ఇటుకలతో, కొత్త ఆలోచనలతో మీ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోండి. ఈసారి ఇది మీ ఛాయిస్, సమాజం వేసిన అచ్చు కాదు. ఇదే మీరు 'Beyond' స్టేజ్‌లోకి వెళ్ళే మార్గం.
5. మీ పాత వ్యక్తిత్వానికి వీడ్కోలు!
ఈ రోజు ఒక చిన్న విచారణ చేయండి.
* మీ పాత ఐడెంటిటీలో మిమ్మల్ని ఇబ్బందిపెట్టిన ఒక లక్షణం ఏది?
* ఆ లక్షణాన్ని వదిలేస్తే, మీరు పోగొట్టుకునేది ఏంటి? (బహుశా అది ఒక భద్రత కావచ్చు).
* ఆ భద్రతను వదిలి, కొత్తగా మారుతానని మీకు మీరు ఒక ప్రామిస్ చేసుకోండి.
కూల్చండి.. అప్పుడే నిర్మించగలరు!
బ్రో, పాత గోడలను కూల్చడం బాధాకరమే కావచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఆ గోడల వల్ల మీరు ఇప్పటివరకు ఎంతో పరిమితంగా బతికారు. ఇప్పుడు ఆ పరిమితులు లేవు. మీరు గాలిలో ఎగరడానికి సిద్ధంగా ఉన్నారు.
"Sometimes, you have to break yourself to become whole."
సైకాలజిస్ట్ విశేష్
Genius Matrix Hub
8019 000066
www.psyvisesh.com
Tags : 1