Breaking News

డయాబెటిస్‌ స్త్రీ పురుషుల మధ్యన తేడా ఇది!

Published on Sun, 08/31/2025 - 09:13

యాభై ఏళ్లలోపు పురుషుల్లో టైప్‌–2 డయాబెటిస్‌ అనేది టైప్‌–1 కంటే తీవ్రమైన దుష్ప్రభావాలు చూపుతుంది. అదే మహిళల విషయానికి వస్తే వాళ్లలో టైప్‌–1 డయాబెటిస్‌ అనేదే ఎక్కువ దుష్ప్రభావాలు చూపుతుందని తేలింది. దాదాపు నాలుగు లక్షలమందికి పైగా పేషెంట్లపై స్వీడన్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వివరాల్లోకి వెళ్తే... 

కాస్తంత చిన్నవయసు పురుషుల్లో అంటే 50 ఏళ్లలోపు పురుషుల్లో టైప్‌–1 డయాబెటిస్‌ కంటే టైప్‌–2 డయాబెటిస్‌ తీవ్రమైన దుష్ప్రభావాలను కలగజేస్తుంది. ఉదాహరణకు టైప్‌–2 డయాబెటిస్‌తో బాధపడుతున్న పురుషుల్లో 51 శాతానికి పైగా వ్యక్తుల్లో గుండెజబ్బుల (కార్డియోవాస్క్యులార్‌ డిసీజెస్‌) ముప్పు ఉంటుంది. దాంతోపాటుగా  హార్ట్‌ ఫెయిల్యూర్‌ లేదా గుండె΄ోటు రిస్క్‌ కూడా వాళ్లలో రెట్టింపు ఉంటుంది. 

దీనికి కారణాలు ఆ వయసులో పురుషుల్లో ఊబకాయం, హైబీపీ జబ్బులతోపాటు వారి జీవనశైలి కాస్త అస్తవ్యవస్తంగా ఉండటంతో అది టైప్‌–2 డయాబెటిస్‌ తాలూకు దుష్ప్రభావాలను మరింతగా ప్రేరేపిస్తుంది. అయితే పురుషుల వయసు పెరుగుతున్నకొద్దీ ఈ ముప్పు క్రమంగా కాస్త తగ్గుతూ పోతుంది. అంటే వాళ్ల వయసు 60కి చేరేనాటికి వాళ్లలో టైప్‌–1 డయాబెటిస్‌తో వచ్చే ముప్పు కంటే టైప్‌–2 డయాబెటిస్‌తో వచ్చే ముప్పులు కాస్త తగ్గుతాయని చెప్పవచ్చు. 

ఇక వాళ్ల వయసు 70కి చేరేనాటికి టైప్‌–1 డయాబెటిస్‌తో ఉన్నవారిలో వచ్చే గుండెపోట్ల కంటే టైప్‌–2 డయాబెటిస్‌తో ఉన్నవారిలో గుండెపోటు వచ్చే  ముప్పు 26 శాతం తక్కువ. ఇక మహిళల విషయానికి వస్తే వాళ్లలో టైప్‌–1 డయాబెటిస్‌తో ముప్పు ఎక్కువ. అందునా అది ఏ వయసువారిలోనైనా ఎక్కువే. ఇలా టైప్‌–1 డయాబెటిస్‌తో బాధపడే యువతులూ, మహిళల్లో గుండెజబ్బులూ, గుండె΄ోట్లు వచ్చే ముప్పు టైప్‌–2 డయాబెటిస్‌తో బాధపడే మహిళల కంటే ఎక్కువే. 

అదే మహిళల వయసు 50 దాటాక... టైప్‌–1 డయాబెటిస్‌ బాధపడేవాళ్లతో పోలిస్తే టైప్‌ – 2 డయాబెటిస్‌తో బాధపడేవారిలో గుండెజబ్బులూ, గుండె΄ోట్లు వచ్చే  ముప్పు 25 నుంచి 47 శాతం తక్కువ. ఇక అన్ని రకాల గుండెజబ్బుల ముప్పులనూ పరిగణనలోకి తీసుకుంటే టైప్‌ –2 డయాబెటిస్‌తో బాధపడే మహిళల్లో గుండెజబ్బులతో మృతిచెందడానికి ఉన్న అవకాశాలు టైప్‌ – 1 మహిళల కంటే 19 శాతం తక్కువ. దీన్ని బట్టి తేలిసేదేమిటంటే... టైప్‌ –1 అలాగే టైప్‌ –2 డయాబెటిస్‌ల ముప్పులు ఇటు మహిళలూ, అటు పురుషుల్లో వేర్వేరు దుష్ప్రభావాలను చూపుతుంటాయని ఈ స్వీడిష్‌ అధ్యయనంలో వెల్లడైంది. 

(చదవండి:  ఈ జబ్బులకు లింగ వివక్ష?)

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)