Breaking News

హంటా రాలేదు..ఆందోళన వద్దు!

Published on Sun, 05/24/2026 - 09:17

ఇటీవల హంటా వైరస్‌ గురించి పెద్ద ఎత్తున చర్చ జరగుతోంది. గతంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న సమయంలోనూ అది విదేశాల్లోనే ఉందనీ, మన దేశంలోకి ప్రవేశించలేదని అన్నప్పటికీ... క్రమంగా అది విదేశాల నుంచి  వచ్చిన ఒకరిద్దరితో మొదలై క్రమంగా దేశాన్నంతా చుట్టుముట్టింది. అదేలాంటి ఆందోళనే ఇప్పుడు దేశంలోని కొంతమందిలో మొదలైంది. అయితే ఇప్పటివరకు హాంటా వైరస్‌మనదేశంలోకి ప్రవేశించలేదు. భారతీయులిద్దరికి వచ్చినట్టు వార్తలు వచ్చినప్పటికీ విదేశాల్లో ఒక డచ్‌ క్రుయిజ్‌ షిప్‌ మీద ఉన్న ఇద్దరు క్రూ మెంబర్లలో కనిపిందన్నది మాత్రమే న్యూస్‌. ఈ వైరస్‌కు సంబంధించినంత వరకు ప్రస్తుతానికి దేశమంతా సురక్షితమే. అయితే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో హాంటా వైరస్‌ స్వైరవిహారం చేస్తున్న నేపథ్యంలో ఈ వైరస్‌ గురించి ప్రాథమిక సమాచారం కోసం ఈ కథనం.

హంటావైరస్‌ కారణంగా వచ్చే వ్యాధులు చాలా తీవ్రమైన అనారోగ్యాలతో పాటు కొంతవరకు మరణాలకూ కారణమవుతుంది. ఈ వైరస్‌ కుటుంబంలోని వైరస్‌లు ప్రధానంగా రెండు రకాల వ్యాధులకు కారణమవుతాయన్నది వైద్యుల మాట. 

వ్యాప్తికి కారకాలు: ఈ వైరస్‌ ప్రధానంగా ఎలుకలు. ఈ (ఎలుక / రోడెంట్‌) జాతికి చెందిన కొన్ని రకాల మూషిక జాతుల ద్వారా ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతూ దానివల్ల కలిగే వ్యాధులకు కారణమవుతుంది. ముఖ్యంగా ఎలుకల మూత్రం, విసర్జనలతో పాటు వాటి లాలాజలంతో మనుషులకు కాంటాక్ట్‌ సంభవించినప్పుడు మానవుల్లో ఈ వైరస్‌ సోకుతుంది. అరుదుగా ఎలుక కరవడం లేదా గీరడం వల్ల కూడా వ్యాపించవచ్చు. ఇక మనుషులకు సోకాక... ఇది వ్యక్తి నుంచి వ్యక్తి (పర్సన్‌ టు పర్సన్‌) వ్యాప్తి చెందే అవకాశముంది. బాధితులతో బాగా సన్నిహితంగా ఉన్నవారిలో ఇలా వ్యాప్తిచెందే అవకాశాలెక్కువ.

హాంటా వైరస్‌తో వచ్చే వ్యాధులు... హాంటావైరస్‌లు రెండు ప్రధాన సిండ్రోమ్‌లకు కారణమవుతాయి. అవి... 

1. హాంటావైరస్‌ పల్మనరీ సిండ్రోమ్‌ (హెచ్‌పీఎస్‌) 

2. హీమరేజిక్‌ ఫీవర్‌ విత్‌ రీనల్‌ సిండ్రోమ్‌ (హెచ్‌ఎఫ్‌ఆర్‌ఎస్‌) 

హీమరేజిక్‌ ఫీవర్‌ విత్‌ రీనల్‌ సిండ్రోమ్‌ (హెచ్‌ఎఫ్‌ఆర్‌ఎస్‌) అనేది ప్రధానంగా యూరప్‌తో ΄ాటు ఆసియాలోని కొన్ని దేశాల్లో కనిపిస్తుంది.

లక్షణాలు... 
హాంటావైరస్‌ పల్మనరీ సిండ్రోమ్‌ (హెచ్‌పీఎస్‌) : ఈ వైరస్‌ ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా పరిణమించవచ్చు. ఎలుక నుంచి వైరస్‌ వ్యాప్తి చెందిన ఒకటి నుంచి ఎనిమిది వారాల తర్వాత లక్షణాలు కనిపించడం మొదలువుతాయి. 

హీమరేజిక్‌ ఫీవర్‌ విత్‌ రీనల్‌ సిండ్రోమ్‌ (హెచ్‌ఎఫ్‌ఆర్‌ఎస్‌) : ఇది మూత్రపిండా(కిడ్నీ)లను ప్రభావితం చేసే వ్యాధి. వైరస్‌ సోకిన ఒకటి నుంచి రెండు వారాల్లో లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. అయితే అరుదుగా లక్షణాలు కనిపించడానికి కొందరిలో ఎనిమిది వారాలూ పట్టవచ్చు.

ప్రారంభ లక్షణాలు: 

జ్వరం / వణుకు 

తీవ్రమైన తలనొప్పి 

వెన్నునొప్పి 

కడుపు నొప్పి 

వికారం

చూపు మసకబారడం 

కొంతమందిలో ముఖం ఎర్రబారడం ∙కళ్లు వాచడం లేదా ఎర్రబారడం

చర్మంపై దద్దుర్ల వంటివి కనిపించవచ్చు. 

మలి లక్షణాలు: ప్రారంభ లక్షణాలు కనిపించిన కొద్దిరోజుల్లో ఈ కింద పేర్కొన్న లక్షణాలూ కనిపిస్తాయి. 

బీపీ తగ్గడం / పడిపోవడం 

రక్తప్రసరణ తగ్గడం షాక్‌కు గురికావడం 

అంతర్గత రక్తస్రావం (ఇంటర్నల్‌ హేమరేజ్‌) మూత్రపిండాలు విఫలం కావడం (రీనల్‌ ఫెయిల్యూర్‌... ఈ కారణంగా దేహంలో నీరు చేరి మనిషి ఉబ్బినట్లుగా కనిపించవచ్చు). 

నిర్ధారణ : ఆ ప్రాంతంలో హాంటా వైరస్‌ వ్యాప్తి ఉన్నప్పుడు లక్షణాలను బట్టి అవి హాంటా వైరస్‌ కారణంగా కావచ్చని అనుమానిస్తారు. వైరస్‌ సోకిన 72 గంటల లోపల హాంటావైరస్‌ను గుర్తించడం కష్టం. తొలి పరీక్షలో వైరస్‌ ఆనవాళ్లు కనిపించకపోతే, లక్షణాలు మొదలైన 72 గంటల తర్వాత మళ్లీ పరీక్ష చేస్తారు. 

బాధితులు పూర్తిగా కోలుకోవడానికి కొన్ని వారాలు మొదలుకొని కొన్ని నెలలు పట్టవచ్చు. అయితే ప్రస్తుతానికి హాంటా వైరస్‌ అనేది దేశంలో లేనేలేదు కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 

(చదవండి: Watermelon: భోజనం తర్వాత తీసుకోకపోవడమే మంచిదా..?)

Videos

నా ఇల్లే ముట్టడిస్తారా.. దమ్మున్నోళ్లు రెండిరా..?! భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్

నాదే బాధ్యత.! సలార్ 2పై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్

బిగ్ రిలీఫ్.. ముగిసిన ఇరాన్ - అమెరికా యుద్ధం?

3 నెలల్లోనే రూ. 5.6 లక్షల కోట్ల లాభం..

బాబు మాటలు.. APలో అగ్గి రాజేస్తున్న మనువాద రాజకీయం

తాటి చెట్టులా పెరిగావ్.. బుర్ర లేదు.. మీ అన్న చావు వెనుక ఉన్నది నువ్వేనా?!

నోటికాడి కూడు లాక్కున్నావ్.. దీనికి అనుభవిస్తావ్..

సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్.. పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలన్నీ ముంబై పైనే

స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. హల్ చల్ చేసిన నాగ బాబు

బుమ్రాకు రామ్ చరణ్ క్షమాపణలు

Photos

+5

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

విజయవాడలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : అందమా.. అందుమా.. (ఫొటోలు)

+5

మృణాల్‌ని ఇంత అందంగా చూసుండరేమో! (ఫొటోలు)

+5

'పాటశాల' ఈవెంట్‌లో మంచు మనోజ్ ఫ్యామిలీ సందడి (ఫొటోలు)

+5

తమిళ స్టార్ హీరోలతో మహేశ్ క్రికెట్ ఆడితే? (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 24-31)

+5

'మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌' షో విజేతలుగా వాసంతి- కల్యాణ్‌ (ఫోటోలు)

+5

కరుప్పు సక్సెస్‌: కేక్‌ కట్‌ చేసిన త్రిష (ఫోటోలు)

+5

చీరలో చందమామలా సమీరా(ఫోటోలు)