Breaking News

నెల నెల విల విల..సివియర్‌గా ఉంటే నిర్లక్ష్యం వద్దు..!

Published on Sun, 11/01/2026 - 17:21

నెలసరి సమయంలో కొద్దిపాటి కడుపునొప్పి కనిపించడం చాలా సాధారణం. అయితే ప్రతి నెలా భరించలేనంత నొప్పి, ఎక్కువ రక్తస్రావం, దాంపత్య సమయంలో నొప్పి, మలమూత్ర విసర్జనలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి ‘ఎండోమెట్రియాసిస్‌’కు సంకేతాలు కావచ్చేమోనని అనుమానించాలి. గర్భాశయం లోపల ఉండే ఎండోమెట్రియమ్‌ వంటి కణజాలం గర్భాశయం బయట కూడా పెరగడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. సాధారణంగా అండాశయాలు, ఫెలోపియన్‌  ట్యూబులు, పెల్విస్‌ పరిసర ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది. ఎండోమెట్రాయాసిస్‌ తాలూకు లక్షణాలూ, ఈ సమస్యకు ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వచ్చిన చికిత్స ప్రక్రియలు వంటివి తెలుసుకుందాం.  

ఎండోమెట్రియాసిస్‌ సమస్య ఎందుకు వస్తుందనే అంశంపై ఖచ్చితమైన కారణం ఇప్పటికీ తెలియదు. హార్మోన్ల ప్రభావం, జన్యుపరమైన అంశాలు, రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన మార్పులు వంటి అంశాలు ఇందుకు కారణాలు కావచ్చంటూ పరిశోధకులు భావిస్తున్నారు.  నెలసరి సైకిల్‌లో భాగంగా వెలువడే హార్మోన్లకు... ఎండోమెట్రియమ్‌ పొరలోని కణజాలం ప్రతికూలంగా స్పందించడం వల్ల అక్కడ వాపు, రక్తస్రావం, మచ్చలు (అడ్హెషన్స్‌) వంటివి రావచ్చంటూ వైద్యపరి శోధకులు అనుకుంటున్నారు.

ఈ లక్షణాలుంటే అప్రమత్తత తప్పనిసరి...
నెలసరి సమయంలో తీవ్రమైన కడుపునొప్పి లేదా పొత్తికడుపులో (పెల్విక్‌) నొప్పి
నెలసరి రాకముందు నుంచే నొప్పి మొదలుకావడం 
కలయికలో తీవ్రమైన నొప్పి ∙అధికంగా లేదా ఎక్కువ రోజులు రక్తస్రావం
మలవిసర్జన సమయంలో నొప్పి, ముఖ్యంగా నెలసరి సమయంలో ∙మూత్ర విసర్జనలో నొప్పి దీర్ఘకాలిక పొత్తికడుపు (పెల్విక్‌) నొప్పి 
తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ 
గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఇక మరికొంతమందిలో పైన చెప్పిన లక్షణాలేవీ లేక΄ోయినా సంతానలేమి పరీక్షలు లేదా ఇతరత్రా చేసే వైద్య పరీక్షల సమయంలో ఎండోమెట్రియాసిస్‌ బయటపడవచ్చు.

నిర్ధారణ ఇలా... 
ముందుగా వైద్యులు... మహిళలో నెలసరి వస్తున్న తీరుతెన్నులూ / చరిత్ర, నొప్పి తీవ్రత, నొప్పి ఎప్పుడెప్పుడు వస్తోంది, రక్తస్రావం జరుగుతోందా ఒకవేళ జరుగుతుంటే ఏ మేరకు,  సంతానోత్పత్తికి సంబంధించిన వివరాలను తెలుసు కుంటారు. పెల్విక్‌ పరీక్షతో పాటు అల్ట్రాసౌండ్‌ లేదా ఎమ్మారై ద్వారా అండాశయాల్లో ఎండోమెట్రియోమా, డీప్‌ ఎండోమెట్రియాసిస్‌ వంటి మార్పులను గుర్తిస్తారు. అయితే స్కాన్‌ సాధారణంగా వచ్చినంత మాత్రాన ఎండోమెట్రియాసిస్‌ లేదని చెప్పడం కుదరదు. 

ముఖ్యంగా కొన్ని రకాల ఎండోమెట్రియాసిస్‌లు స్కాన్‌లు / ఇమేజింగ్‌ పరీక్షల్లో కనిపించక΄ోవచ్చు.2026లో అమెరికన్‌  కాలేజ్‌ ఆఫ్‌ అబ్‌స్టెట్రిషి యన్స్‌ అండ్‌ గైనకాలజిస్ట్స్‌ (ఏసీఓజీ) విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలు... లక్షణాలు, వైద్యపరీక్షలు, ఇమేజింగ్‌ ఆధారంగా క్లినికల్‌ డయాగ్నసిస్‌ చేసి అవసరమైనప్పుడు చికిత్స మొదలుపెట్టాలంటూ సూచిస్తున్నాయి. దీంతో ప్రతి బాధితురాలిలోనూ తొలిదశలోనే లాపరోస్కోపీ చేయాల్సిన అవసరం ఉండక΄ోవచ్చు.

ఎండోమెట్రియాసిస్‌ సమస్యతో సంతానలేమి? అయితే ఏ మేరకు? 
ఎండోమెట్రియాసిస్‌ వల్ల పెల్విస్‌లో వాపు, అడ్హెషన్స్‌తో (ఈ పొరలో వాపు వల్ల కడుపులోని భాగాలు అంటుకు ΄ోవడం వల్ల ఏర్పడే కదుముల వంటి వాటిని అడ్హెషన్స్‌గా చెబుతారు) అంటుకు΄ోవడం అనే అంశం... అండాశయాలు, ఫాలోపియన్‌ ట్యూబుల పనితీరును ప్రభావితం చేయవచ్చు. అందువల్ల గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. గర్భధారణ కోరుకునే మహిళల్లో చికిత్స ఎంపిక ఎలా జరగాలంటే... నొప్పి నియం త్రణతో ΄ాటు సంతానం కలగడాన్ని దృష్టిలో పెట్టుకుని చికిత్సను నిర్ణయించాలి.

డాక్టర్‌ సూచనలు
నెలసరి నొప్పి మహిళ రోజువారీ పనులను ప్రభావితం చేసేంతగా ఉంటే దాన్ని సాధారణంగా తీసుకోవద్దు. 
ప్రతి నెలా నొప్పి ఎప్పుడు మొదలవు తోంది, ఎంతసేపు ఉంటుంది, రక్తస్రావం ఎంతగా ఉంది వంటి వివరాలను నోట్‌ చేసుకోవడం వల్ల వైద్యులు  సమస్యను చక్కగా నిర్ధారణ చేయడానికి తోడ్పడుతుంది.  
అల్ట్రాసౌండ్‌లో అంతా నార్మల్‌ అని వచ్చినప్పటికీ లక్షణాలు మాత్రం అలాగే కొనసాగుతూ  ఉంటే వైద్యులు పరీక్షించడం అవసరం కావచ్చు. 
భవిష్యత్తులో గర్భధారణ కోరు కునేవారు చికిత్స మొదలుపెట్టే సమయంలో ఆ విషయాన్ని డాక్టర్‌కు స్పష్టంగా తెలియజే యాలి. 
ఈ సమస్యకు ఎవరికివారు స్వయంగా చికిత్స చేసుకోవడం సరికాదు. గైనకాలజిస్ట్‌ సలహాతో మందులు మొదలుపెట్టాలి. అవసరాన్ని బట్టి వైద్యులు శస్త్ర చికిత్సనూ సూచించే అవకాశముంది. 

నొప్పిని ‘సాధారణ నెలసరి సమస్య’గా భావించడం సరికాదు...
నెలసరి సమయంలో వచ్చే తీవ్రమైన నొప్పిని ఏళ్ల తరబడి భరిస్తూ ఉండటం వల్ల వ్యాధినిర్ధారణ ఆలస్యం కావచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఎండోమెట్రియాసిస్‌లో సమస్య నిర్ధారణ దాదాపు 4 నుంచి 12 ఏళ్లు ఆలస్యంగా జరుగుతోంద్నది ఒక అంచనా. అందుకే పదేపదే వచ్చే తీవ్రమైన నెలసరి నొప్పి, సంతానలేమి లేదా ఇతర సంబంధిత లక్షణాలు ఉంటే ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది. 

చికిత్సలో కొత్త విధానాలు
ఎండోమెట్రియాసిస్‌కు ప్రస్తుతం నిర్దిష్టంగా ఒకే ఒక్క శాశ్వత నివారణ, చికిత్స అంటూ లేదు. వయసు, లక్షణాల తీవ్రత, వ్యాధి విస్తృతి, భవిష్యత్తులో గర్భం కావాలనే కోరిక వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రతి మహిళలోనూ చికిత్సను వ్యక్తిగతంగా నిర్ణయిస్తారు. ఆ చికిత్సలివి... 

1. మందులతో చికిత్స: నొప్పి తగ్గించేందుకు అవసరాన్ని బట్టి నొప్పి నివారణ మందులు ఉపయోగిస్తారు. హార్మోన్ల చికిత్సలో కాంబైన్డ్‌ హార్మోనల్‌ కాంట్రాసెప్టివ్స్, ప్రొజెస్టిన్లు, జీఎన్‌ ఆర్‌హెచ్‌ ఎగొనిస్ట్స్‌ లేదా ఏంటగో నిస్ట్స్‌ వంటి మందులు వాడవచ్చు. అయితే వీటిని వాడాలా వద్దా అనే అంశం బాధితురాలి పరిస్థితి, ఆమెలో వచ్చేందుకు అవకాశమున్న దుష్ప్రభావాలు, ఆమె తాలూకు భవిష్యత్తు గర్భధారణ ప్రణాళికలపై ఆధారపడి ఉంటుంది.

2. లాపరోస్కోపిక్‌ శస్త్రచికిత్స: మందులతో నొప్పిని తగ్గించడం సాధ్యం కానప్పుడు, వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు లేదా కొన్ని సందర్భాల్లో ఆమెలోని సమస్య సంతానోత్పత్తికి ఇబ్బందిగా ఉన్నప్పుడు లాపరోస్కోపీ ద్వారా ఎండోమెట్రియాసిస్‌ కణజాలం, పేగులు అంటుకు΄ోవడం వల్ల ఏర్పడ్డ అడ్షెషన్స్‌ను తొలగించవచ్చు. అవసరమైతే సమస్య నిర్ధారణా, చికిత్సా ఈ రెండూ ఒకే శస్త్రచికిత్సలో చేయవచ్చు.

3. అధునాతన మినిమల్లీ ఇన్వేసివ్‌ సర్జరీ: డీప్‌ ఎండోమెట్రి యాసిస్‌ సమస్య... పేగులూ లేదా మూత్రాశయం వంటి అవయవాలకు వ్యాధి విస్తరించిన క్లిష్టమైన సందర్భాల్లో అనుభవజ్ఞులైన మల్టీ డిసిప్లినరీ బృందం ఆధ్వర్యంలో అధునాతన లాపరోస్కోపిక్‌ లేదా రోబోటిక్‌ శస్త్రచికిత్సను ఒక ప్రత్యామ్నాయంగా తీసుకునేందుకు అవకాశ ముంది. అయితే రోబోటిక్‌ శస్త్రచికిత్స అన్నది ప్రతి పేషెంట్‌కూ తప్పనిసరి కాదు; సమస్య ఉన్న స్థానం, దాని విస్తృతి, శస్త్రచికిత్స నైపుణ్యం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏ విధానాన్ని ఎంచుకోవాలన్నది నిర్ణయించుకోవాలి.

డా. అంతర్వేది శాంతి, కన్సల్టెంట్‌ గైనకాలజిస్ట్‌ 

ఇదీ చదవండి: అప్రమత్తతే అసలైన రక్షణ..!

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)